ఆ విషయంలో భారీ నిరాశలో డార్లింగ్ ఫ్యాన్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ది రాజా సాబ్ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఆడియన్స్ ను నిరాశ పరిచింది.
By: Sravani Lakshmi Srungarapu | 12 Jan 2026 1:56 AM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ది రాజా సాబ్ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఆడియన్స్ ను నిరాశ పరిచింది. ఈ సినిమాకు సాధారణ ఆడియన్స్ నుంచి మాత్రమే కాకుండా ఫ్యాన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ రావడం లేదు. సినిమాలోని కంటెంట్ మాత్రమే కాదు, ప్రభాస్ ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేసిన అంశాలెన్నో వారి డిజప్పాయింట్‌మెంట్ కు కారణం.
బాడీ డబుల్ పై నెట్టింట వేల పోస్టులు
రాజా సాబ్ లో ప్రభాస్ కోసం వాడిన బాడీ డబుల్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ డిస్కషన్సే జరుగుతున్నాయి. ఈ మూవీలో ఎన్నో కీలక సీన్స్ లో ఉపయోగించిన బాడీ డబుల్ గురించి చర్చిస్తూ కొన్ని వేల పోస్టులు సోషల్ మీడియాలో ఉన్నాయి. అంతేకాదు, ఈ మూవీలో ప్రభాస్ లుక్ గురించి తెగ చర్చలు జరుగుతున్నాయి.
రాజా సాబ్ మూవీలో ప్రభాస్ తన లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉన్నారని, ఇప్పటికైనా ఆయన తన లుక్స్ పై ఫోకస్ చేయాలని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. దీని కోసం కాస్త లేటైనా గ్యాప్ తీసుకుని, తన లుక్స్ పై ఫోకస్ పెట్టి తిరిగి గత లుక్స్ లోకి వచ్చాక సినిమాలు చేయాలని ప్రభాస్ ను ఫ్యాన్స్ కోరుతున్నారు. బాహుబలి తర్వాత నుంచి ప్రభాస్ లుక్స్ విషయంలో పెద్దగా శ్రద్ధ తీసుకోకపోయినప్పటికీ ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు సరిపెట్టుకుంటున్నారు. కానీ రాజా సాబ్ లాంటి సినిమాలు చేయడం కంటే లుక్స్ పై దృష్టి పెట్టడమే బెటర్ అని భావిస్తున్నారు.
డార్లింగ్ లుక్స్ విషయంలో పలు విమర్శలు
దానికి తోడు రాజా సాబ్ డైరెక్టర్ మారుతి ఈ సినిమాలో బాడీ డబుల్ ను వాడామని పబ్లిక్ గానే ఒప్పుకున్నారు. దీంతో ఇప్పుడు రాజా సాబ్ రిలీజ్ తర్వాత ప్రభాస్ తన లుక్స్ విషయంలో చాలా విమర్శల పాలవుతున్నారు. పలు సినిమాల షూటింగుల్లో పాల్గొంటున్న కారణంతో ప్రభాస్ కొన్ని సార్లు తన బాడీ షేప్ ను కూడా కోల్పోతున్నారు. రాజా సాబ్ తర్వాత స్పిరిట్, ఫౌజీ సినిమాల కోసం ప్రభాస్ మళ్లీ ఫిట్ గానే కనిపిస్తున్నప్పటికీ డార్లింగ్ తన స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
