ది రాజా సాబ్ సర్ ప్రైజ్: వింటేజ్ ప్రభాస్ ట్రీట్ అదిరింది!
రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా మొత్తం డార్లింగ్ నామస్మరణతో నిండిపోతుంది.
By: M Prashanth | 23 Oct 2025 2:36 PM ISTరెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా మొత్తం డార్లింగ్ నామస్మరణతో నిండిపోతుంది. అయితే, ఈసారి పుట్టినరోజు సంబరాలను డబుల్ చేస్తూ, ఆయన నుంచి వచ్చిన ఒక అప్‌డేట్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆ వింటేజ్ ప్రభాస్‌ను గుర్తుచేసేలా, ఒక కలర్‌ఫుల్ పోస్టర్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
గత కొన్నేళ్లుగా ప్రభాస్ నుంచి ఎక్కువగా యాక్షన్, సీరియస్ రోల్స్ చూస్తున్నాం. 'బాహుబలి' నుంచి సలార్, కల్కి, ఫౌజీ వరకు.. అన్నీ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్లే. మధ్యలో రాధేశ్యామ్ వచ్చినా, అది కూడా పూర్తిస్థాయి లవర్ బాయ్ సినిమా కాదు. దీంతో, 'బుజ్జిగాడు', 'డార్లింగ్', 'మిర్చి' లాంటి సినిమాల్లో చూసిన ఆ ఎనర్జిటిక్, చార్మింగ్ ప్రభాస్‌ను ఫ్యాన్స్ బాగా మిస్ అవుతున్నారు. ఇప్పుడు ఆ లోటును తీర్చేలా ఒక పోస్టర్ వచ్చేసింది.
ప్రభాస్ పుట్టినరోజు కానుకగా, డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ది రాజా సాబ్' సినిమా నుంచి అదిరిపోయే ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే, ఫ్యాన్స్ ఏదైతే కోరుకున్నారో, దానికి రెట్టింపు ట్రీట్ ఇవ్వడానికి ప్రభాస్ రెడీ అయినట్లు కనిపిస్తోంది. కలర్‌ఫుల్ కాస్ట్యూమ్స్, అదిరిపోయే స్వాగ్, చుట్టూ పండగ వాతావరణం.. పోస్టర్ మొత్తం ఒక సెలబ్రేషన్ మూడ్‌ను క్రియేట్ చేస్తోంది.
పోస్టర్‌లో ప్రభాస్ ఒక ఓపెన్ టాప్ కారులో నిలబడి, చేతులు చాచి అభివాదం చేస్తూ కనిపించాడు. కలర్‌ఫుల్ జాకెట్, స్టైలిష్ గాగుల్స్‌తో చాలా హ్యాండ్‌సమ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉన్నాడు. బ్యాక్‌డ్రాప్‌లో ఒక గుడి గోపురం, జనసంద్రం, రంగులు చల్లుకుంటున్న వాతావరణం కనిపిస్తున్నాయి. ఇది సినిమాలోని ఒక పండగ పాట లేదా సెలబ్రేషన్ సీన్‌కు సంబంధించిన లుక్ అనిపిస్తోంది. హ్యాపీ బర్త్ డే రెబల్ సాబ్ మేకర్స్ పోస్టర్ ద్వారా విషెస్ అందిస్తూ సినిమాను 2026 జనవరి 9న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ లుక్ చూస్తుంటే, మారుతి తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో, ప్రభాస్‌లోని కామెడీ టైమింగ్‌ను, రొమాంటిక్ యాంగిల్‌ను పూర్తిస్థాయిలో వాడుకోబోతున్నాడని స్పష్టమవుతోంది. ఇది ఒక హారర్ కామెడీ అని చెబుతున్నా, పోస్టర్ మాత్రం ఫుల్ పాజిటివ్, ఫెస్టివ్ వైబ్స్‌తో నిండిపోయింది. ఫ్యాన్స్‌కు, ఫ్యామిలీ ఆడియన్స్‌కు కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయని ఈ ఒక్క పోస్టర్ హింట్ ఇస్తోంది. తమన్ సంగీతం కూడా ఈ సెలబ్రేషన్ మూడ్‌కు తోడవనుంది. మొత్తం మీద, 'ది రాజా సాబ్' ఫస్ట్ లుక్ ఫ్యాన్స్‌కు పర్ఫెక్ట్ బర్త్‌డే గిఫ్ట్‌గా నిలిచింది. ప్రభాస్‌ను ఇలా చూసి చాలా కాలమైందని, సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర అసలైన పండగ ఇదేనని ఫ్యాన్స్ కామెంట్లతో సోషల్ మీడియాను నింపేస్తున్నారు. ఇక సినిమా ఫస్ట్ సింగిల్ కూడా ఫ్యాన్స్‌కు పెద్ద సెలబ్రేషన్ ఇవ్వబోతోందని టీమ్ ప్రకటించింది.
