రాజా సాబ్ బాక్సాఫీస్.. మిగతా రాష్ట్రాల్లో ఎంత?
హారర్ కామెడీ జోనర్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు.
By: M Prashanth | 10 Jan 2026 3:38 PM ISTపండుగ వేళ బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ 'ది రాజా సాబ్' హవా స్పష్టంగా కనిపిస్తోంది. సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకుల నుంచి రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ, వసూళ్ల విషయంలో మాత్రం డార్లింగ్ తన పవర్ ఏంటో చూపిస్తున్నాడు. శుక్రవారం నాడు థియేటర్ల వద్ద ఉన్న రద్దీని బట్టి చూస్తే, టాక్ తో సంబంధం లేకుండా ప్రభాస్ క్రేజ్ వసూళ్లను ముందుకు నడిపిస్తోందని అర్థమవుతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఓపెనింగ్స్ గట్టిగానే వచ్చాయి.
హారర్ కామెడీ జోనర్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రమోషన్లలో బిల్డప్ ఇచ్చినట్లుగా సెకండ్ హాఫ్ లేదనే విమర్శలు వినిపిస్తున్నా, ప్రభాస్ వింటేజ్ లుక్, కామెడీ టైమింగ్ సినిమాకు ప్లస్ పాయింట్ గా మారాయి. మేకర్స్ ఆశించినట్లే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వంద కోట్ల మార్కును చాలా సునాయాసంగా దాటేసిందని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఊహించిన స్థాయిలో వసూళ్లు వచ్చాయి. ముఖ్యంగా నైజాం ఏరియాలో టికెట్ ధరల ఇష్యూ ఉన్నప్పటికీ 23 కోట్ల గ్రాస్ రావడం విశేషం. ఆంధ్రలో కూడా దాదాపు 31 కోట్లకు పైగా వసూళ్లు నమోదయ్యాయని అంచనా. సీడెడ్ ఏరియాలో కూడా ప్రభాస్ తన మాస్ ఫాలోయింగ్ ను నిరూపించుకుంటూ మంచి కలెక్షన్లు అందుకున్నాడు. కేవలం తెలుగు రాష్ట్రాలే కాకుండా పక్కనే ఉన్న కర్ణాటకలో కూడా 8 కోట్ల గ్రాస్ వసూలైంది.
ఇక నార్త్ ఇండియాలో ఎనిమిది కోట్ల వసూళ్లు రావడం గమనించాల్సిన విషయం. అక్కడ ప్రభాస్ కు ఉన్న పాన్ ఇండియా ఇమేజ్ రాజా సాబ్ కు బాగా కలిసి వచ్చింది. ఓవర్సీస్ మార్కెట్ లో కూడా డార్లింగ్ సత్తా చాటాడు. అక్కడ ఏకంగా 24 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు అంచనా. మొత్తంగా చూస్తే మొదటి రోజే దాదాపు 103 కోట్ల గ్రాస్ సాధించినట్లు ట్రేడ్ వర్గాల అంచనా.
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఏరియా వారీగా మొదటి రోజు వసూళ్ల వివరాలు..
తెలంగాణ: రూ.22 కోట్లు
సీడెడ్: రూ.8 కోట్లు
ఆంధ్రప్రదేశ్: రూ.31 కోట్లు
కర్ణాటక: రూ.8 కోట్లు
తమిళనాడు + కేరళ: రూ.2 కోట్లు
నార్త్ ఇండియా: రూ.8 కోట్లు
ఓవర్సీస్: రూ.24 కోట్లు
మొత్తం గ్రాస్ వసూళ్లు: రూ.103 కోట్లు
ఈ వంద కోట్ల మార్కును చేరుకోవడం ఒక ఎత్తు అయితే, దీన్ని లాంగ్ రన్ లో కాపాడుకోవడం మరో ఎత్తు. ప్రస్తుతం వస్తున్న మిక్స్డ్ టాక్ సినిమాపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో వీకెండ్ ముగిసేసరికి క్లారిటీ వస్తుంది. సంక్రాంతి సెలవులు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉంటే రాబోయే రోజుల్లో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. రాజా సాబ్ ఈ స్పీడ్ ని ఇలాగే కొనసాగిస్తాడో లేదో వేచి చూడాలి.
