Begin typing your search above and press return to search.

రాజాసాబ్.. అభిమానుల 'అతి'తో తలనొప్పులు!

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాగా, మిక్స్‌ డ్ రిజల్ట్ అందుకోవడంతో కొంతమంది అభిమానుల్లో అసంతృప్తి మొదలైంది.

By:  M Prashanth   |   24 Jan 2026 1:00 PM IST
రాజాసాబ్.. అభిమానుల అతితో తలనొప్పులు!
X

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాగా, మిక్స్‌ డ్ రిజల్ట్ అందుకోవడంతో కొంతమంది అభిమానుల్లో అసంతృప్తి మొదలైంది. అదే ఇప్పుడు హద్దులు దాటి ఏకంగా దర్శకుడు, నిర్మాతలపై ప్రభావం చూపే స్థాయికి చేరింది. ఇటీవల జరిగిన విచిత్ర ఘటనలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కొండాపూర్‌ లోని కొల్లా లగ్జరియా విల్లాస్‌ లో నివసిస్తున్న దర్శకుడు మారుతి ఇంటి పేరు మీద భారీగా ఫుడ్ డెలివరీ ఆర్డర్లు రావడం కలకలం రేపింది. ఆన్‌ లైన్ ఫుడ్ యాప్‌ ల ద్వారా ఒక్కరోజే వందకు పైగా ఆర్డర్లు రావడంతో, విల్లా సెక్యూరిటీ సిబ్బంది తలలు పట్టుకున్నారు. ప్రతి కొద్ది నిమిషాలకోసారి గేటు వద్దకు ఫుడ్ డెలివరీ బాయ్ రావడంతో అసలు విషయం ఏమిటో అర్థం కాక అక్కడ సిబ్బంది అయోమయంలో పడిపోయారు.

సెక్యూరిటీ చెక్‌ పాయింట్ వద్ద డెలివరీలను నిలిపివేసి వారు దర్శకుడు మారుతిని సంప్రదించగా, తాను ఎలాంటి ఆర్డర్లు పెట్టలేదని ఆయన స్పష్టంగా తెలిపారట. అయినప్పటికీ ఆర్డర్లు ఆగకపోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. చివరికి విసిగిపోయిన మారుతి, తన పేరు మీద వచ్చే ఏ డెలివరీ అయినా లోపలికి అనుమతించవద్దని సెక్యూరిటీ సిబ్బందికి స్పష్టం చేశారని తెలుస్తోంది.

దీంతో విల్లా పరిసరాల్లో నెలకొన్న గందరగోళానికి కొంతమేరకు ఊరట లభించినట్లు సమాచారం. అయితే రాజాసాబ్ ఈవెంట్ లో మారుతినే తన అడ్రస్ చెప్పిన విషయం తెలిసిందే. అదే సమయంలో రాజా సాబ్ కు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌ గా వ్యవహరించిన ఎస్కేఎన్ పేరు మీద సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ సృష్టించి తప్పుడు పోస్టులు పెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆ అంశంపై ఎస్కేఎన్ ఇప్పటికే లాయర్‌ తో కలిసి రీసెంట్ గా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కావాలనే నకిలీ ఖాతాల ద్వారా గొడవల కోసం రెచ్చగొడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరినట్టు సమాచారం. మొత్తానికి రాజాసాబ్ సినిమా చుట్టూ మొదలైన అసంతృప్తి ఇప్పుడు దర్శకుడు, నిర్మాతలకు తలనొప్పిగా మారింది.

ఏదేమైనా సినిమా మీద ఉన్న ప్రేమ, హీరోపై ఉన్న అభిమానాన్ని ఇలా అల్లరి చేష్టలుగా మార్చడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మూవీలపై విమర్శలు చేయడం సహజమే అయినా, వ్యక్తిగత జీవితాల్లో ఇబ్బంది పెట్టడం ఎప్పటికీ ఎవరికీ తగదని హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో అభిమానులు సంయమనం పాటించి, కేవలం సినిమాలను సినిమాల్లానే చూసి, తమ అభిప్రాయాలను హద్దుల్లోనే వ్యక్తపరచాలని సినీ వర్గాలు సూచిస్తున్నాయి.