ఓపెనింగ్ డే 50కోట్లు.. నాలుగోసారి అతనొక్కడే..!
ప్రభాస్ నటించిన డిజాస్టర్ మూవీ `ఆదిపురుష్` (2023) డే1లో 89 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత రెండు బ్లాక్ బస్టర్లు 90కోట్లు పైగా మొదటిరోజు రాబట్టాయి.
By: Sivaji Kontham | 30 Nov 2025 4:20 PM ISTప్రభాస్ నటించిన డిజాస్టర్ మూవీ `ఆదిపురుష్` (2023) డే1లో 89 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత రెండు బ్లాక్ బస్టర్లు 90కోట్లు పైగా మొదటిరోజు రాబట్టాయి. సలార్ (2023) - 92 కోట్లు, కల్కి 2898 AD (2024) - 93 కోట్లు వసూలు చేయడం ఒక సంచలనం. నాన్ బాహుబలి కేటగిరీలో 50 కోట్లు అంతకుమించిన వసూళ్లు సాధించిన ఘనత ప్రభాస్ కి దక్కింది. ఇది భారతదేశంలో ఏ ఇతర హీరోకి సాధ్యం కానిది.
ఇప్పుడు రాజా సాబ్ ఆ స్థాయి ఓపెనింగ్ వసూళ్లను అందుకోగలడా? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. కల్కి 2898 AD సినిమా భారీ విజయం సాధించిన తర్వాత, ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ ఎలాంటి ఓపెనింగులు సాధిస్తుందో తెలుసుకోవాలనే కుతూహలం ట్రేడ్ తో పాటు అభిమానుల్లోను ఉంది. ఇప్పటికే రాజా సాబ్ పై భారీ బజ్ నెలకొంది. ఈ సినిమాలో ప్రభాస్ మునుపెన్నడూ లేని విధంగా రకరకాల వేషధారణలతో అలరించనున్నాడు.
రాజా సాబ్ కథాంశంలో సస్పెన్స్ ఎలిమెంట్స్ అభిమానులను మెస్మరైజ్ చేస్తాయని కూడా ఇప్పటికే టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ ఈ హారర్ కామెడీలో ఓవైపు సరదాగా కనిపిస్తూనే, మరోవైపు భయపెట్టబోతున్నాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆద్యంతం అతడి వేషధారణలు ఆశ్చర్యపరిచాయి. ఈ సినిమా ఓపెనింగ్ రికార్డులను బ్రేక్ చేస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇది కూడా గత చిత్రాల్లానే ఐదు భారతీయ భాషలు (తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ వెర్షన్ల)లో భారీగా విడుదల కానుంది. ఒరిజినల్ తెలుగు, హిందీ-డబ్బింగ్ వెర్షన్లలోను దీనిని అత్యంత భారీగా విడుదలకు సిద్ధం చేస్తుండడంతో రికార్డులు తిరగరాయడం ఖాయమని భావిస్తున్నారు.
బడ్జెట్- కాన్వాస్ దృష్ట్యా ప్రభాస్ సినిమా ఓపెనింగ్ డే సునాయాసంగా రూ.50కోట్లు వసూలు చేయనుందని అంచనా. ఇది అతడి కెరీర్ లో వరుసగా నాలుగవసారి 50 కోట్లకు పైగా బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్ లకు ఆస్కారం ఉందని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఇప్పటివరకు, ఏ భారతీయ నటుడు వరుసగా నాలుగు 50 కోట్ల ఓపెనింగులను సాధించలేకపోయాడు. ఇది బహుశా ప్రభాస్ కి మాత్రమే సాధ్యమయ్యే ఫీట్! అంటూ హిందీ మీడియాలు సైతం విశ్లేషించడం ఆసక్తిని కలిగిస్తోంది. ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏడి తర్వాత రాజా సాబ్ తో ప్రభాస్ మరో 50కోట్ల క్లబ్ ని అందుకోబోతున్నాడు.
