మెగాస్టార్‌కి రెస్పెక్ట్.. హార్ట్‌ని టచ్ చేసావుగా డార్లింగ్!
డార్లింగ్ ప్రభాస్ కూడా ఎప్పుడూ తన వినమ్రతతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాడు. అతడు తన సీనియర్లు, అనుభవజ్ఞులను ఎంతగా గౌరవిస్తాడో ఇప్పుడు `ది రాజా సాబ్` ఈవెంట్లో మరోసారి బయటపడింది.
By: Sivaji Kontham | 28 Dec 2025 9:37 AM ISTసీనియారిటీని, అనుభవాన్ని గౌరవించడం నేటితరానికి చాలా అవసరం. ఆ రెండిటితోనే జీవితపాఠాలు ఆవిష్కృతమవుతాయి. లైట్ తీస్కుంటే, దానిని అనుభవ రాహిత్యం అంటారు. సీనియర్ల గురించి అగౌరవంగా మాట్లాడినా, పొగరు నెత్తికెక్కించుకున్నా దాని ప్రభావం కెరీర్, లైఫ్ పై పడుతుంది. కానీ తెలుగు చిత్రసీమలో కథానాయికలు ఎప్పుడూ ఈ హద్దుల్ని దాటలేదు. డార్లింగ్ ప్రభాస్ కూడా ఎప్పుడూ తన వినమ్రతతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాడు. అతడు తన సీనియర్లు, అనుభవజ్ఞులను ఎంతగా గౌరవిస్తాడో ఇప్పుడు `ది రాజా సాబ్` ఈవెంట్లో మరోసారి బయటపడింది.
వేదికపై డార్లింగ్ ప్రభాస్ `సీనియర్ల` గురించి ప్రత్యేకంగా స్ట్రెస్ చేస్తూ మాట్లాడాడు. రాజా సాబ్ సంగతుల్ని హైలైట్ చేస్తూనే, అతడు సంక్రాంతి బరిలో ఉన్న సీనియర్ హీరోలను గౌరవిస్తూ మాట్లాడటం హైలైట్ అయింది. ప్రభాస్ మాట్లాడుతూ..``వెరీ ఇంపార్టెంట్.. సీనియర్ సీనియరే.. సీనియర్ దగ్గర నుంచి మేం నేర్చుకున్నాం. సీనియర్స్ తర్వాతే మేము..వందశాతం సంక్రాంతికి అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వాలి. మేము కూడా విజయం సాధించాలి`` అని అన్నాడు.
సంక్రాంతి 2025 బరిలో ప్రభాస్ నటించిన `ది రాజా సాబ్` ముందుగా విడుదలవుతోంది. ఈ సినిమా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం విడుదలైన రెండు రోజుల తర్వాత, అంటే జనవరి 12న మెగాస్టార్ చిరంజీవి నటించిన `మన శంకర వరప్రసాద్ గారు` విడుదలవుతుంది. అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాపైనా భారీ బజ్ నెలకొంది. ఇందులో చిరంజీవితో పాటు, మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా కనిపించనున్న సంగతి తెలిసిందే. కడుపుబ్బా నవ్వించే హాస్యం, అద్భుతమైన రొమాన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో ఈ సినిమా కూడా యువ ప్రేక్షకులను అలరించనుంది.
రెండు రోజుల గ్యాప్ తో పెద్ద హీరోల సినిమాలు నువ్వా నేనా? అంటూ బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్నాయి. అయితే పండగ సీజన్ సెలవులు ఈ రెండు సినిమాలకు కలిసి రానున్నాయి. జనవరి 10 నుంచి జనవరి 18 వరకూ స్కూళ్లకు సంక్రాంతి సెలవులను ప్రకటించడం బాక్సాఫీస్ కలెక్షన్లకు పెద్దగా కలిసి రానుంది. ఇక ఇదే సంక్రాంతి సీజన్ లోనే మరో సీనియర్ హీరో.. మాస్ మహారాజ్ రవితేజ నటించిన `భర్త మహాశయులకు విజ్ఞప్తి` కూడా అత్యంత భారీగా విడుదలవుతోంది. ప్రభాస్ తన సీనియర్లు అయిన చిరంజీవి, వెంకటేష్, రవితేజలను `ది రాజా సాబ్` వేదికపై సముచితంగా గౌరవించాడు. అంతేకాదు సంక్రాంతి బరిలో వస్తున్న అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లు అవ్వాలని, తన సినిమా కూడా విజయం సాధించాలని ఎంతో పరిణతితో మాట్లాడి అందరి హృదయాలను గెలుచుకున్నాడు.
ప్రభాస్ ఇదే వేదికపై తన కాస్ట్ అండ్ క్రూని కూడా ప్రశంసల్లో ముంచెత్తాడు. సంజయ్ దత్ సర్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంటుందని, క్లోజప్ లో అతడు రెచ్చిపోతాడని పొగిడేసాడు. ఈ చిత్రంలో నాన్నమ్మ పాత్రధారి బాగా కుదిరారు. ఇది నానమ్మ- మనవడు కథ.. ఈ సినిమాకి హీరో విశ్వప్రసాద్ గారు. బడ్జెట్ విషయంలో రాజీకి రాకుండా నిర్మించారని ఎంతో ఎమోషనల్ గా మాట్లాడాడు ప్రభాస్. బడ్జెట్ విషయంలో నిర్మాత రాజీ పడలేదని కూడా వివరించారు. థమన్ .. అద్భుతమైన పాటలు, ఆర్.ఆర్ తో అలరించాడని తెలిపారు. కార్యక్రమంలో మారుతి, విశ్వప్రసాద్, ఎస్కే ఎన్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ తదితరులు పాల్గొన్నారు.
