Begin typing your search above and press return to search.

గూఢచారి 'ప్రభాస్' .. బ్రిటిష్ జెండాపై నడుస్తూ.. ఏంటి కథ?

ఇక ఫుల్ బిజీగా ఉన్న డార్లింగ్, ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్ తో వచ్చాడు. ఇది ఫ్యాన్స్‌కు ప్రీ బర్త్‌డే ట్రీట్ అని చెప్పవచ్చు.

By:  M Prashanth   |   22 Oct 2025 12:20 PM IST
గూఢచారి ప్రభాస్ .. బ్రిటిష్ జెండాపై నడుస్తూ.. ఏంటి కథ?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే, ఆ అంచనాలు మామూలుగా ఉండవు. లైనప్ చూస్తేనే ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తున్నాయి. ప్రస్తుతం ది రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, 'కల్కి 2'.. ఇలా ఒకదాని తర్వాత ఒకటి భారీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ ని షేక్ చేయబోతున్నాడు. ఇక ఫుల్ బిజీగా ఉన్న డార్లింగ్, ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్ తో వచ్చాడు. ఇది ఫ్యాన్స్‌కు ప్రీ బర్త్‌డే ట్రీట్ అని చెప్పవచ్చు.




క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడి, బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. ఈ కాంబినేషన్‌లో ప్రభాస్ హీరోగా ఫౌజీ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచీ మంచి బజ్ ఉంది. 'సీతారామం' లాంటి క్లాసిక్ తర్వాత హను తీస్తున్న సినిమా, అదీ ప్రభాస్‌తో కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ, మేకర్స్ సినిమా ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఎన్నో డీటెయిల్స్‌తో క్యూరియాసిటీని పెంచుతోంది. ఇందులో ప్రభాస్ పూర్తి లుక్ రివీల్ చేయలేదు కానీ, ఆయన స్టీల్ కనిపిస్తోంది. స్టైలిష్ సూట్‌లో, చేతిలో ఒక బ్రీఫ్‌కేస్‌తో నడుస్తున్నట్లు చూపించారు. ఆయన నడుస్తున్న నేలపై బ్రిటిష్ జెండా పరిచి ఉంది. బ్యాక్‌డ్రాప్‌లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. 1940ల నాటి వలస భారతదేశ నేపథ్యంలో సాగే కథ అని సూచిస్తోంది.

పోస్టర్‌పై ఉన్న ట్యాగ్‌లైన్లు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. Most Wanted since 1932.. ఒంటరిగా నడిచే సైన్యం.. అనే లైన్లు ప్రభాస్ పాత్ర స్వభావాన్ని, సినిమా జానర్‌పై హింట్ ఇస్తున్నాయి. దీన్నిబట్టి ఇది ఒక పీరియాడికల్ స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్ అని అర్థమవుతోంది. ప్రభాస్ ఒక రెబల్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది.

ఇంతేకాదు, పోస్టర్‌పై "decrypts Z tomorrow" అని రాసి ఉంది. అంటే, అక్టోబర్ 22 ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ లేదా టైటిల్ రివీల్ కానుందని ఓ క్లారిటీ ఇచ్చారు. ఇక ఫౌజీ అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

అయితే ఈ ప్రీ లుక్ పోస్టరే ఈ రేంజ్‌లో ఉంటే, ఇక ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతోందో అని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ వంటి లెజెండ్స్ కూడా నటిస్తున్నారు. మొత్తం మీద, ఈ ఒక్క పోస్టర్‌తో ప్రభాస్-హను ప్రాజెక్ట్‌పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ప్రభాస్‌ను ఒక సరికొత్త స్పై యాక్షన్ అవతారంలో చూడబోతున్నామనే ఎగ్జయిట్‌మెంట్ ఫ్యాన్స్‌లో కనిపిస్తోంది. మరి ఈ 'Z' డీక్రిప్షన్ వెనుక దాగి ఉన్న అసలు సర్‌ప్రైజ్ ఏంటో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.