ప్రభాస్ సినిమాల్లో స్పిరిట్ లెక్క వేరంతే..!
ఎందుకంటే సందీప్ వంగ సినిమాల మీద ఉన్న కాన్ఫిడెన్స్ అలాంటిది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఈ సినిమాలతో సందీప్ వంగ అంటే ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు.
By: Ramesh Boddu | 9 Dec 2025 12:01 PM ISTరెబల్ స్టార్ ప్రభాస్ లైన్ లో ఉన్న సినిమాలు ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. నెక్స్ట్ సంక్రాంతికి రాజా సాబ్ సినిమాతో రాబోతున్న ప్రభాస్ అదే ఏడాది ఫౌజీ సినిమాతో కూడా సర్ ప్రైజ్ చేయనున్నాడు. హను రాఘవపూడి ఫౌజీ సినిమాను మరో అద్భుతమైన కథతో వస్తున్నారని తెలుస్తుంది. సినిమాలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా ప్రభాస్, ఇమాన్వి లవ్ స్టోరీ ఆడియన్స్ కి ట్రీట్ టు వాచ్ అనేలా ఉంటుందట. అంతేకాదు సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా వార్ సీక్వెన్స్ ని తలపించేలా నెక్స్ట్ లెవెల్ ఉంటాయని టాక్.
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్..
ఐతే ఈ సినిమా తర్వాత సందీప్ వంగాతో స్పిరిట్ చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాను కూడా సందీప్ తన మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ విత్ ఫుల్ ఆఫ్ ఎమోషన్ యాంగిల్ లో ప్లాన్ చేస్తున్నాడు. సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఐతే ప్రభాస్ క్యూలో ఉన్న అన్ని సినిమాల్లో రెబల్ ఫ్యాన్స్ కి సూపర్ ఎగ్జైటెడ్ గా అనిపించే సినిమా ఏదైనా ఉంది అంటే అది సందీప్ వంగా చేస్తున్న స్పిరిట్ మాత్రమే.
ఎందుకంటే సందీప్ వంగ సినిమాల మీద ఉన్న కాన్ఫిడెన్స్ అలాంటిది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఈ సినిమాలతో సందీప్ వంగ అంటే ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. విజయ్ దేవరకొండ ని అర్జున్ రెడ్డిగా చూపించినప్పుడే డైరెక్టర్ సత్తా ఏంటో ప్రూవ్ అయ్యింది. ఇక యానిమల్ తో బాలీవుడ్ ని సైతం షేక్ ఆడించాడు సందీప్. అలాంటి డైరెక్టర్ కి బాహుబలి ప్రభాస్ దొరకడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అందుకే సందీప్ వంగ స్పిరిట్ లో ప్రభాస్ ఎలా ఉంటాడు.. ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడు అన్న దాని మీద దృష్టి పెట్టారు.
రాజా సాబ్, ఫౌజీ నెక్స్ట్ ఇయర్ ఫ్యాన్స్ కి ట్రీట్..
ప్రభాస్ సందీప్ వంగ ఆల్రెడీ తమ డ్యూటీ ఎక్కేశారు. ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్లిన స్పిరిట్ నుంచి ఒక లీక్ వీడియో కూడా వైరల్ అయ్యింది. సినిమాను ఎట్టి పరిస్థితుల్లో 2027 రిలీజ్ చేసేలా సందీప్ ప్లానింగ్ ఉందట. సో రాజా సాబ్, ఫౌజీ నెక్స్ట్ ఇయర్ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తే 2027 లో రెబల్ ఫ్యాన్స్ కి స్పిరిట్ హంగామా ఉండబోతుంది.
అసలే స్పిరిట్ సౌండ్ అనౌన్స్ మెంట్ తో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనే ట్యాగ్ వేశాడు. మరి ఆ ట్యాగ్ కి న్యాయం చేసేలా సినిమా ఉంటే మాత్రం రికార్డుల లెక్క నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు. ఇవే కాదు సలార్ 2, కల్కి 2 సినిమాలు కూడా ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది. ఈ సినిమాలు పూర్తి చేసిన తర్వాతే ప్రభాస్ కొత్త సినిమా సైన్ చేసే ఛాన్స్ లు ఉన్నాయి.
