Begin typing your search above and press return to search.

ప్రభాస్.. కొత్త ఛాలెంజ్ ఇదే!!

ప్రభాస్ సినిమా అంటే ఇప్పుడు కేవలం ఒక మూవీ కాదు.. ఒక బిగ్ ఈవెంట్ అని చెప్పాలి.

By:  M Prashanth   |   16 Sept 2026 3:15 PM IST
ప్రభాస్.. కొత్త ఛాలెంజ్ ఇదే!!
X

ప్రభాస్ సినిమా అంటే ఇప్పుడు కేవలం ఒక మూవీ కాదు.. ఒక బిగ్ ఈవెంట్ అని చెప్పాలి. రాజా సాబ్ తర్వాత ఆయన లైనప్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. రాబోయే 2-3 ఏళ్లలో వరుసగా భారీ పాన్ ఇండియా సినిమాలు రానున్నాయి. అయితే ఆ మూవీల కౌంట్, రిలీజ్ డేట్స్ కంటే.. ఒక్కో ప్రాజెక్ట్‌ కు ల పెరుగుతున్న అంచనాలే ప్రభాస్‌ కు కొత్త ఛాలెంజ్‌ గా మారుతున్నాయని టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు భారీ ప్రాజెక్టులు ఉండగా, ముందుగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 1940స్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ వార్ డ్రామాగా ఆ సినిమా రూపొందుతోంది. రెండు భాగాలుగా రావచ్చనే టాక్ కూడా ఉంది. ఫస్ట్ పార్ట్ ను 2026 డిసెంబర్‌ లో లేదా 2027 జనవరిలో విడుదల చేస్తారని సమాచారం.

ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్. రా అండ్ ఇంటెన్స్ కాప్ యాక్షన్ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఆ సినిమాలో ప్రభాస్ సరికొత్త మేకోవర్‌ లో కనిపించనున్నారు. ఆ సినిమాను 2027 సెకండాఫ్ లో భారీ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడీకి సీక్వెల్ గా కల్కి 2 రూపొందుతోంది. మైథో సైన్స్ ఫిక్షన్ ప్రపంచంలో సాగే ఆ సీక్వెల్‌ పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఆ సినిమా 2027 చివర్లో లేదా 2028 ఫస్టాఫ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2- శౌర్యాంగ పర్వం కూడా లైనప్‌ లో ఉంది. ఖాన్సార్ వరల్డ్ లోని స్టోరీని కంటిన్యూ చేస్తూ ఆ సినిమా రూపొందనుంది. ఆ సీక్వెల్ 2028లో విడుదలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అంటే 2026 చివరి నుంచి 2028 వరకు ప్రభాస్ సినిమాలు వరుసగా వస్తాయన్నమాట.

ఫౌజీతో పీరియాడిక్ వార్ డ్రామా, స్పిరిట్ తో కాప్ యాక్షన్, కల్కి 2తో సైన్స్ ఫిక్షన్, సలార్ 2తో హై-వోల్టేజ్ యాక్షన్.. ఇలా ప్రతి సినిమాతో ప్రభాస్ కొత్త వరల్డ్ లోకి ఆడియెన్స్ ను తీసుకెళ్లనున్నారు. ఇదే ఇప్పుడు అసలు ఛాలెంజ్‌ గా మారుతోంది. ఒక సినిమా భారీ విజయం సాధిస్తే.. దాని తర్వాత వచ్చే మూవీపై అంచనాలు మరింత పెరుగుతాయి. అదే సమయంలో ఒక్కో సినిమాకు స్పెషల్ గుర్తింపు తీసుకురావాల్సి ఉంటుంది.

ఇవే కాకుండా ప్రశాంత్ వర్మ, లోకేష్ కనగరాజ్ వంటి దర్శకులతో కూడా ప్రభాస్ ప్రాజెక్ట్స్ గురించి చర్చలు జరుగుతున్నట్లు టాక్ ఉంది. అలా ప్రభాస్‌ కు ఇప్పుడు ఎదురవుతున్న సవాల్ వరుసగా సినిమాలతో సందడి చేయడం కాదు.. ప్రతి మూవీకి కొత్త వరల్డ్ క్రియేట్ చేసి పాన్ ఇండియా అంచనాలను అందుకోవడం. మరి 2026 నుంచి 2028 వరకు కొనసాగే ఆ లైనప్‌ తో ప్రభాస్ ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.