ఇకపై ప్రభాస్ ఫోకస్ మొత్తం ఆ రెండింటి పైనే!
ఇదిలా ఉంటే తాజాగా రాజా సాబ్ కు సంబంధించి ప్రభాస్ పోర్షన్ షూటింగ్ పూర్తైందని తెలుస్తోంది.
By: Sravani Lakshmi Srungarapu | 12 Nov 2025 1:15 AM ISTతెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో ప్రతీ సినిమా పూర్తవడానికి చాలానే కాలం పడుతుంది. క్యాస్టింగ్ నుంచి విజువల్స్ వరకు, వీఎఫ్ఎక్స్ నుంచి ఎడిటింగ్ వరకు అన్నీ టాప్ గా ఉండాలని ప్రతీ విషయంలో జాగ్రత్త తీసుకోవడంతో భారీ బడ్జెట్ సినిమాలన్నీ బాగా ఆలస్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే స్టార్ హీరోలు ఒక్కో సినిమా చేయడానికి సుమారు రెండేళ్లు తీసుకుంటున్నారు .
పలుసార్లు వాయిదా పడ్డ రాజా సాబ్
కానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రం త్వరత్వరగా సినిమాలను పూర్తి చేస్తూ వస్తున్నారు. కనీసం సంవత్సరానికి ఒక సినిమా అయినా రిలీజయ్యేట్టు చూసుకుంటున్నారు ప్రభాస్. గతేడాది కల్కి సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన ప్రభాస్, ఈ ఇయర్ రాజా సాబ్ ను ఆడియన్స్ ముందుకు తీసుకొద్దామనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల మధ్యలో షూటింగ్ లేటవడంతో రాజా సాబ్ వాయిదా పడింది.
సంక్రాంతి కానుకగా రానున్న రాజా సాబ్
పలు వాయిదాలు పడ్డ తర్వాత రాజా సాబ్ ను డిసెంబర్ లో రిలీజ్ చేద్దామని మేకర్స్ భావించారు. కానీ భారీ సినిమా కావడంతో సంక్రాంతి సీజన్ అయితే ఈ సినిమా ఎక్కువ మంది ఆడియన్స్ కు రీచ్ అవడంతో పాటూ మంచి కలెక్షన్లు వస్తాయని భావించి సినిమాను జనవరి 9న రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా రాజా సాబ్ కు సంబంధించి ప్రభాస్ పోర్షన్ షూటింగ్ పూర్తైందని తెలుస్తోంది.
రాజా సాబ్ ను పూర్తి చేసేసిన డార్లింగ్
ఇప్పటివరకు ఓ వైపు మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ ను, మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాలను చేస్తున్న ప్రభాస్, త్వరలోనే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ ను మొదలుపెట్టి ఫౌజీ మరియు స్పిరిట్ సినిమాలను ఒకేసారి చేయనున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ ఫౌజీ ఎప్పుడో మొదలవడంతో ఆ సినిమా త్వరగానే పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫౌజీని పూర్తి చేశాక ప్రభాస్ తన ఫోకస్ మొత్తాన్ని స్పిరిట్ పైనే పెట్టనున్నారని సమాచారం. స్పిరిట్ తర్వాత కల్కి2, సలార్2 సినిమాలను చేయనున్నారు ప్రభాస్.
