ప్రభాస్ న్యూ సర్ ప్రైజ్.. అతను ఒంటరిగా నిలబడే సైన్యం..
ఈ పోస్టర్‌తో, సినిమాలో ప్రభాస్ ఒక ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఆయన కెరీర్‌లో ఇలాంటి పాత్ర చేయడం ఇదే మొదటిసారి.
By: M Prashanth | 20 Oct 2025 7:10 PM ISTపాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ చూస్తే నెవ్వర్ బిఫోర్ అనేలా ఉంది. ఒకేసారి ఇన్ని భారీ చిత్రాలు చేతిలో ఉండటంతో, ఏ సినిమా నుంచి అప్‌డేట్ వచ్చినా అది సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ అవుతుంది. ప్రతీ పండక్కి ఏదో ఒక ట్రీట్ ఇవ్వడం మేకర్స్‌కు అలవాటు. ఇప్పుడు ఈ దీపావళికి కూడా ప్రభాస్ ఫ్యాన్స్‌కు అలాంటి ఒక పవర్‌ఫుల్ సర్‌ప్రైజే వచ్చింది.
ఒక క్రియేటివ్ డైరెక్టర్, ఒక టాప్ ప్రొడక్షన్ హౌస్, ఒక పాన్ ఇండియా స్టార్.. ఈ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా సైలెంట్‌గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి, ఫస్ట్ లుక్‌కు ముందే ఒక కాన్సెప్ట్ పోస్టర్‌ను వదిలి, మేకర్స్ సినిమాపై ఉన్న హైప్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు.
ఆ సర్‌ప్రైజ్ మరేంటో కాదు, ప్రభాస్ హను రాఘవపూడి క్రేజీ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన కాన్సెప్ట్ పోస్టర్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి దీపావళి కానుకగా విడుదలైన ఈ పోస్టర్, సినిమా థీమ్‌ను, ప్రభాస్ క్యారెక్టర్ ఇంటెన్సిటీని చాలా క్రియేటివ్‌గా పరిచయం చేసింది. ప్రభాస్ నీడను వందలాది మెషిన్ గన్‌లతో నింపేసి, ఒంటరిగా నిలబడే సైన్యం.. అనే ట్యాగ్‌లైన్‌తో ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు.
ఈ పోస్టర్‌తో, సినిమాలో ప్రభాస్ ఒక ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఆయన కెరీర్‌లో ఇలాంటి పాత్ర చేయడం ఇదే మొదటిసారి. ఈ ట్యాగ్‌లైన్, ప్రభాస్ పాత్ర ఒక వన్ మ్యాన్ ఆర్మీలా ఉండబోతోందని హింట్ ఇస్తోంది. ఇక పోస్టర్‌పై ఉన్న "డీక్రిప్షన్ బిగిన్స్ 22.10.25" అనే లైన్, ప్రభాస్ పుట్టినరోజైన అక్టోబర్ 22న ఫస్ట్ లుక్ రాబోతోందని స్పష్టం చేస్తోంది.
'సీతారామం' లాంటి ఒక విజువల్ పొయెట్రీని అందించిన హను రాఘవపూడి, ఇప్పుడు ప్రభాస్‌తో ఒక భారీ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తుండటం ప్రాజెక్ట్‌పై క్యూరియాసిటీని పెంచుతోంది. ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ వంటి లెజెండరీ యాక్టర్లు కూడా కీలక పాత్రల్లో నటిస్తుండటం సినిమా స్కేల్‌ను తెలియజేస్తోంది. మొత్తం మీద, ఈ ఒక్క కాన్సెప్ట్ పోస్టర్‌తో మేకర్స్ ఇంటర్నెట్‌లో పెద్ద తుఫానే సృష్టించారు. ప్రభాస్‌ను ఒక సరికొత్త అవతారంలో చూడబోతున్నామనే ఆనందం ఫ్యాన్స్‌లో కనిపిస్తోంది. మరి అక్టోబర్ 22న ప్రభాస్ ఫస్ట్ లుక్‌తో ఈ ఎలా ఉండబోతోందో చూడాలి.
