Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ 'ఒక్క అడుగు' ప‌రిస్థితి ఏంటి?

ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే 'ఒక్క అడుగు' పట్టాలెక్కే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.

By:  Srikanth Kontham   |   17 July 2026 6:00 PM IST
ప్ర‌భాస్ ఒక్క అడుగు ప‌రిస్థితి ఏంటి?
X

దివంగత రెబల్ స్టార్ కృష్ణం రాజు వారసుడు ప్రభాస్‌తో 'ఒక్క అడుగు' అనే చిత్రాన్ని తెరకెక్కించాలన్నది ఎంతో కాలంగా ఉన్న గొప్ప కల. 'ఒక్క అడుగు వెనుక వెయ్యి అడుగులు ఎలా పడతాయి?' అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో రాజకీయ , సామాజిక అంశాల కలబోతగా ఈ కథను రాజుగారు స్వయంగా సిద్ధం చేసుకున్నారు. ప్రభాస్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోతో ఈ సినిమా చేస్తే బాగుంటుందని భావించారు. కానీ కృష్ణం రాజు భౌతికంగా లేకపోవడంతో ఇప్పుడా ఆ ప్రాజెక్ట్ పరిస్థితి ఏమిటనేది అభిమానుల్లో చర్చగా మారింది.

ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే 'ఒక్క అడుగు' పట్టాలెక్కే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఒక ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చాలంటే దాని వెనుక బలమైన నిర్ణయం, సమన్వయం ఉండాలి. కృష్ణం రాజు ఆలోచనలకు అను గుణంగా ఆ కథను తెరకెక్కించడానికి ఎంతో శ్రద్ధ, సమయం అవసరం. ఈ సినిమా ప‌ట్టాలెక్కాలంటే? అది ప్రభాస్ చేతుల్లోనే ఉంది. ఆయన స్వయంగా చొరవ తీసుకుని ఆ కథను ముందుకు తీసుకెళ్లగల సమర్థుడైన దర్శకుడికి అప్పగించినప్పుడే ప్రాజెక్టుకు రూపం వస్తుంది.

అయితే ప్రభాస్ కెరీర్ గ్రాఫ్ .. ఆయనకున్న పాన్ ఇండియా కమిట్‌మెంట్లను పరిశీలిస్తే? ఇది అంత సులభమైన పని కాదని అర్థమవుతోంది. 'కల్కి', 'స్పిరిట్', 'పౌజీ', 'స‌లార్ 2' వంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలతో ప్రభాస్ అత్యంత బిజీగా ఉన్నారు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఇలాంటి సామాజిక-రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా చేయడం సవాలుతో కూడుకున్న వ్యవహారమే. అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్‌కు ఇలాంటి ఎమోషనల్ ప్రాజెక్ట్‌ను పూర్తి స్థాయిలో హ్యాండిల్ చేయడం అంత సుల‌భం కాదు. సినిమాను కేవలం భావోద్వే గంతో మాత్రమే కాకుండా వ్యాపార పరంగా కూడా సరిచూసుకోవాల్సి ఉంది. పాన్ ఇండియా స్థాయికి చేరిన ప్రభాస్ మార్కెట్ ఇమేజ్‌కు ఒక్క అడుగు కథ సరిపోతుందా లేదా అని కూడా ఆలోచించే అవకాశం లేక‌పోలేదు.

అభిమానులు కూడా ఈ ప్రాజెక్టు కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. కృష్ణం రాజు గారి జ్ఞాపకార్థం .. ఆయన ఆశయాన్ని గౌరవించే క్రమంలో ప్రభాస్ దీన్నీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకునే అవ‌కాశాలు అంతే మెండుగా ఉన్నాయి.

ఆయ‌న వార‌సత్వంతోనే ప్ర‌భాస్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు? అన్న‌ది కాద‌న లేని నిజం. ప్ర‌భాస్ తండ్రి కేవ‌లం నిర్మాత మాత్ర‌మే..న‌టుడిగా వార‌సత్వాన్ని అందించింది కృష్ణంరాజే. కాబ‌ట్టి 'ఒక్క అడుగు'ను అంత ఈజీగా తీసుకోవ‌డానికి లేదు. ఈ సినిమాకు భారీ బ‌డ్జెట్ అవ‌స‌రం. ప్ర‌భాస్ కూడా సమయం కేటాయించాలి.

కానీ ప్రభాస్ క్యాలెండర్ చూస్తే? మూడేళ్ల వ‌ర‌కూ సాధ్యం కాదు. కృష్ణం రాజు ఉన్న‌ప్పుడే ప‌ట్టాలెక్కించాల‌నుకున్న సినిమా ఇలా వాయిదా ప‌డ‌టం అభిమానుల‌కు ఎంత మాత్రం న‌చ్చ‌డం లేదు. ఈ విష‌యాన్ని డార్లింగ్ కూడా అంతే సీరియ‌స్ గా తీసుకుని చొరవ తీసుకుంటే త‌ప్ప సాధ్యం కాదు. దీనిపై ప్ర‌భాస్ కూడా అధికారిక ప్ర‌క‌ట‌న చేయాల్సిన బాధ్య‌త ఆయ‌నపై ఉంద‌న్న‌ది అంతే వాస్త‌వం.