Begin typing your search above and press return to search.

న్యూ ఇయ‌ర్ అయినా వ‌ర్క్ ఫ‌స్ట్ నో బ్రేక్ అంటున్నారే!

దీంతో న్యూ ఇయ‌ర్‌కు ఎన్టీఆర్‌, నీల్ బ్రేక్ తీసుకోవ‌డం లేద‌న్న‌మాట‌. ఇక గ్యాప్ దొరికితే ఫ్యామిలీతో క‌లిసి వెకేష‌న్‌ల‌కు వెళ్లే మ‌హ‌స్త్రష్ బాబు కూడా ఈ సారి నో బ్రేక్ అంటున్నాడు.

By:  Tupaki Entertainment Desk   |   19 Dec 2025 3:37 PM IST
న్యూ ఇయ‌ర్ అయినా వ‌ర్క్ ఫ‌స్ట్ నో బ్రేక్ అంటున్నారే!
X

కొత్త సంవ‌త్సం వ‌స్తోందంటే మ‌న స్టార్స్ ప్ర‌త్యేకంగా షూటింగ్‌ల‌కు పాజ్ ఇచ్చి చిన్న బ్రేక్ తీసుకోవ‌డం తెలిసిందే. క్రిస్మ‌స్ నుంచి మొద‌లైన న్యూ ఇయ‌ర్ సంద‌డి వ‌ర‌కు ఈ బ్రేక్ పీరియ‌డ్ సాగుతూ ఉంటుంది. ఈ స‌మ‌యాన్ని చాలా మంది స్టార్స్ ప్ర‌త్యేక వెకేష‌న్ల‌కు కేటాయిస్తూ ఫ్యామిలీతో కలిసి జాలీగా విదేశాల్లో ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్ప‌టికే కొంత మంది స్టార్స్ ప్ర‌త్యేక వెకేష‌న్ కో విదేశాల‌కు ప‌య‌న‌మ‌వ్వ‌గా మ‌రికొంత మంది మాత్రం న్యూ ఇయ‌ర్‌కు నో బ్రేక్ అంటున్నారు.

వ‌రుస షూటింగ్‌ల‌ మ‌ధ్య చిన్న బ్రేక్ ల‌భిస్తే వెకేష‌న్‌కు ఇట‌లీలో వాలిపోయే పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఈ సారి మాత్రం నో బ్రేక్ అంటూ షూటింగ్‌కే ప్ర‌ధాన్య‌త ఇస్తున్నాడు. ప్ర‌స్తుతం త‌ను న‌టిస్తున్న భారీ పాన్ ఇండియా యాక్ష‌న్ డ్రామా `స్పిరిట్‌`. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. సందీప్‌రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తాజా షెడ్యూల్‌ని జ‌న‌వ‌రి 5 వ‌ర‌కు పూర్తి చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఆ కార‌ణంగానే ఎలాంటి బ్రేక్‌లు ఇవ్వ‌డం లేదు.

న్యూ ఇయ‌ర్‌కు బ్రేక్ ఇవ్వ‌కుండా ఫ‌స్ట్ షెడ్యూల్‌ని పూర్తి చేసి సంక్రాంతికి టీమ్ బ్రేక్ తీసుకోబోతోంది. సంక్రాంతికి ప్ర‌భాస్ `ది రాజా సాబ్‌`తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. దీని ప్ర‌మోష‌న్స్ పూర్తి చేసిన త‌రువాతే మ‌ళ్లీ `స్పిరిట్‌` షూట్‌లో పాల్గొంటార‌ట‌. నెక్స్ట్ షెడ్యూల్‌ని విదేశాల్లో ప్లాన్ చేశారు. ఇక గ‌త ఆరు నెల‌లుగా షూటింగ్ ల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్న ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. దీని షూటింగ్ తిరిగి ఇట‌వ‌లే మొద‌లైంది. హైద‌రాబాద్‌లో విరామం లేకుండా ఈ మూవీ షూటింగ్ జ‌రుగుతోంది.

దీంతో న్యూ ఇయ‌ర్‌కు ఎన్టీఆర్‌, నీల్ బ్రేక్ తీసుకోవ‌డం లేద‌న్న‌మాట‌. ఇక గ్యాప్ దొరికితే ఫ్యామిలీతో క‌లిసి వెకేష‌న్‌ల‌కు వెళ్లే మ‌హ‌స్త్రష్ బాబు కూడా ఈ సారి నో బ్రేక్ అంటున్నాడు. `వార‌ణాసి` మూవీ షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. జ‌క్క‌న్న ఎలాంటి బ్రేక్‌లు ఇవ్వ‌డం లేదు. దీంతో టీమ్ అంతా బిజీ బిజీ. రామ్‌చ‌ర‌ణ్ కూఐడా ఇందుకు భిన్నంగా ప్లాన్ చేసుకోలేదంట‌. త‌ను కూడా న్యూ ఇయ‌ర్‌కి ఎలాంటి బ్రేక్‌లు తీసుకోవ‌డం లేద‌ని ఇన్ సైడ్ టాక్‌.

చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం `పెద్ది` మూవీని పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు. ఓ రెండు రోజులు మాత్ర‌మే న్యూ ఇయ‌ర్ కోసం బ్రేక్ తీసుకుని వెంట‌నే సెట్‌లోకి వెళ్లిపోతాడ‌ట‌. యంగ్ స్ట‌ర్స్ నాని, సాయిధ‌ర‌మ్ తేజ్‌, శ‌ర్వానంద్‌తో పాటు గోపీచంద్ కూడా షూటింగ్ షూటింగ్ అంటూ బిజీగా గ‌డిపేస్తున్నాడు. అయితే మెగా హీరో అల్లు అర్జున్ మాత్రం కొన్ని రోజులుగా వెకేష‌న్ ట్రిప్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. అట్లీతో భారీ పాన్ వ‌ర‌ల్డ్ మూవీకి శ్రీ‌కారం చుట్టిన బ‌న్నీ ప్ర‌స్తుతం గ్యాప్ దొర‌క‌డంతో అమెరికాలో ఫ్యామిలీతో క‌లిసి ఎంజాయ్ చేస్తున్నాడు. చిరు `మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు` ప్ర‌మోష‌న్స్‌లో, వెంకటేష్.. త్రివిక్ర‌మ్ సినిమా షూటింగ్‌లో, బాల‌య్య ..గోపీచంద్ మ‌లినేని పీరియాడిక్ ఫిల్మ్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. దీంతో స్టార్స్ చాలా వ‌ర‌కు న్యూ ఇయ‌ర్‌కు నో బ్రేక్ అంటూ వ‌ర్క్ మోడ్‌లోకి వెళ్లిపోతున్నారు.