Begin typing your search above and press return to search.

ప్రభాస్ కి ఇమేజ్ కి సెట్ కానీ సినిమాలు ఇవే...

ప్రస్తుతం ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ హీరోగా ఎదిగిన ప్రభాస్ ఆయన ఇమేజ్ కి సెట్ అవ్వని కొన్ని మూవీస్ చేశాడు. వాటి మీద ఒక లుక్కేద్దాం...

By:  Gopi Velupala   |   29 Oct 2026 9:00 PM IST
ప్రభాస్ కి ఇమేజ్ కి సెట్ కానీ సినిమాలు ఇవే...
X

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించిన నటుడు ప్రభాస్. ప్రస్తుతం ఆయన పాన్ వరల్డ్ ప్రాజెక్టులను చేస్తున్నాడు. పాన్ ఇండియా ప్రేక్షకులందరు ప్రభాస్ కొత్త సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ హీరోగా ఎదిగిన ప్రభాస్ ఆయన ఇమేజ్ కి సెట్ అవ్వని కొన్ని మూవీస్ చేశాడు. వాటి మీద ఒక లుక్కేద్దాం...

చక్రం

వర్షం లాంటి బిగ్గెస్ట్ మాస్ హిట్ తరువాత చేసిన 'చక్రం' ప్రభాస్ ఇమేజ్ కి ఏ మాత్రం సెటవ్వలేదు. ప్రభాస్ నుంచి కమర్షియల్ యాక్షన్ లవ్ స్టోరీలను ఎక్స్పెక్ట్ చేసిన ప్రేక్షకులకు ఈ సినిమా ఏ మాత్రం కనెక్ట్ కాలేదు. ఈ మూవీలో ప్రభాస్ క్యాన్సర్ పేషెంట్ గా కనిపించడం, ఎమోషనల్ మెలో డ్రామా ఆయన మాస్ ఇమేజ్ కి సెట్ అవ్వలేదు. చివర్లో ఆయన చనిపోవడం ప్రభాస్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు కూడా జీర్ణించుకోలేకపోయారు. ప్రభాస్ నటన పరంగా మెప్పించినప్పటికీ ఆయన కటౌట్ కి సెంటిమెంట్ ఎమోషనల్ సన్నివేశాలు సెట్ అవ్వలేదు.

పౌర్ణమి

'ఛత్రపతి' అనే ఊర మాస్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రభాస్ క్రేజ్ తార స్థాయికి వెళ్ళిపోయింది. ఆ వెంటనే సంప్రదాయ నృత్యం బ్యాక్ డ్రాప్ తో వచ్చిన 'పౌర్ణమి ' లో ప్రభాస్ కనిపించడం అభిమానులకు మింగుడుపడలేదు. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ క్లాసికల్ డ్యాన్స్ ఓరియెంటెడ్ కథల కంటే యాక్షన్ మాస్ ఎలిమెంట్స్ ఉన్న స్టోరీలకే సెట్ అవుతుందని ఈ సినిమా ద్వారా ప్రూవ్ అయింది.

రాధేశ్యామ్

బాహుబలి, సాహో మూవీల తర్వాత ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. పాన్ ఇండియాలో యాక్షన్ హీరో గా ఎదిగారు. అలాంటి హీరోను పెట్టుకొని ఒక్క ఫైట్ లేకుండా విక్రమాదిత్య అనే ఒక (హస్త సాముద్రిక నిపుణుడు) పాత్రలో చూపించి ప్రభాస్ ను ప్యూర్ లవ్ స్టోరీ కి పరిమితం చేయడం అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. ప్రభాస్ ఇమేజ్ డిమాండ్ చేసే హై ఓల్టేజ్ మాస్ డ్రామా ఇందులో లోపించడమే అతి పెద్ద మైనస్...

ది రాజాసాబ్

బాహుబలి, సాహో, సలార్, కల్కి సినిమాల సక్సెస్ తో టాప్ చైర్ ను కైవసం చేసుకున్న ప్రభాస్, ఒకప్పటి రోజులను గుర్తు చేసుకునేలా బుజ్జిగాడు, డార్లింగ్ లాంటి సినిమాల తరహాలో ఒక మూవీ చేయాలని ఏరికోరి మరి 'ది రాజాసాబ్' మూవీ చేశాడు. కానీ ఒక స్టార్ హీరోతో హార్రర్ కామెడీ అనేది వర్కౌట్ కాలేదు. ప్రభాస్ అద్భుతమైన పర్ఫామెన్స్ ను ఇచ్చినప్పటికి అది ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయలేకపోయింది.