ప్రభాస్ లైనప్ రచ్చ - డైరెక్టర్లకు టెన్షన్!
డార్లింగ్ పై కూడా అంతే ఒత్తిడి ఉందన్నది కాదనలేని నిజం. ఒకే సమయంలో అరడజన్ భారీ ప్రాజెక్టులను సెట్స్‌పైకి తీసుకెళ్లడం తో ప్రభాస్ కాల్ షీట్ల సర్దుబాటు టాలీవుడ్‌లో చర్చ నీయాంశంగా మారింది.
By: Srikanth Kontham | 2 Sept 2026 11:00 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ చూస్తే మరే ఇతర ఇండియన్ స్టార్ కూడా ఊహించని రేంజ్‌లో ఉంది. 'కల్కి 2', 'ఫౌజీ', 'స్పిరిట్', 'సలార్ 2' వంటి సంచలన పాన్-ఇండియా ప్రాజెక్టులు ఒకేసారి లైన్లో ఉండటంతో ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ భారీ లైనప్ ఇప్పుడు దర్శకులకు పెద్ద పజిల్ లా మారిందన్నది అంతే వాస్తవం. డార్లింగ్ పై కూడా అంతే ఒత్తిడి ఉందన్నది కాదనలేని నిజం. ఒకే సమయంలో అరడజన్ భారీ ప్రాజెక్టులను సెట్స్‌పైకి తీసుకెళ్లడం తో ప్రభాస్ కాల్ షీట్ల సర్దుబాటు టాలీవుడ్‌లో చర్చ నీయాంశంగా మారింది.
ప్రతి సినిమా 300 కోట్ల నుంచి 600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నదే కావడం గమనార్హం. దాంతో ఒక సినిమా షెడ్యూల్ కాస్త ఆలస్యమైనా? అది తదుపరి సినిమా ప్లానింగ్ మొత్తాన్ని తలకిందులు చేస్తోంది. ఫలితంగా ప్రభాస్‌తో సినిమాలు ప్రకటించిన అగ్ర దర్శకులు డార్లింగ్ కాల్ షీట్ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడాల్సిన సన్నివేశం కనిపిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ 'కల్కి 2' కోసం ప్రభాస్ ఎప్పుడు డేట్స్ కేటాయిస్తారా? అని మేకర్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రకటన వచ్చి కొన్ని రోజులు గడుస్తున్నా? ఇంకా ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి ప్రభాస్ బల్క్ డేట్స్ లభించకపోవడమే ప్రధాన కారణమని తెలుస్తోంది.
మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఫౌజీ' చిత్రీకరణ సుదీర్ఘంగా సాగుతుంది. అక్టోబర్ వరకూ ఆ సినిమా షూట్ కొలిక్కి వచ్చేలా కనిపించలేదు. అలాగే సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తోన్న 'స్పిరిట్' షూటింగ్ కూడా నెమ్మదిగానే జరుగుతోంది. ఈ సినిమా షూట్ మొదలైన నాటి నుంచి శర వేగంగా మాత్రం జరగడం లేదు. మధ్యలో బ్రేక్స్ తప్పడం లేదు. ఇక ప్రశాంత్ నీల్ తెరకెక్కించాల్సిన `సలార్ 2: శౌర్యాంగ పర్వం` పరిస్థితి కూడా దీనికి మినహాయింపు ఏమీ కాదు. ప్రశాంత్ నీల్ ఇతర కమిట్‌మెంట్లతో బిజీగా ఉండటం, ప్రభాస్ వేరే సినిమాల సెట్స్‌లో నిమగ్నమై ఉండటంతో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది సస్పెన్స్‌గానే మారింది.
ఒకేసారి ఇన్ని భారీ పాన్-ఇండియా యాక్షన్ సినిమాలకు వేర్వేరు గెటప్‌లు మారుస్తూ కాల్ షీట్లను బ్యాలెన్స్ చేయడం ప్రభాస్‌కు కూడా కత్తిమీద సాములా మారింది. గతంలో కూడా ప్రభాస్ 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్', 'సలార్', 'రాజా సాబ్' చిత్రాలను ఒకేసారి సమాంతరంగా చిత్రీకరించారు. అయితే డేట్స్ క్లాష్ రావడం వల్ల ఆయా సినిమాల నిర్మాణం ఆలస్యమై విడుదల తేదీలు పదే పదే మారాయి.
తాజాగా మళ్లీ అదే తరహా సవాళ్లు పునరావృతం కావడంతో దర్శకులు షెడ్యూళ్లను ఎలా డిజైన్ చేసుకోవాలో? తెలియక ఒత్తిడికి గురవుతున్నారు. ప్రాజెక్ట్ ప్రకటించడం వరకు దర్శకుల చేతుల్లో ఉన్నా? అది ఎప్పటికి పూర్తవుతుందనేది మాత్రం ప్రభాస్ కేటాయించే డేట్స్‌పైనే ఆధారపడి ఉంది. కోట్లాది మంది అభిమానులను అలరించేందుకు ప్రభాస్ నాన్‌స్టాప్‌గా కష్టపడుతున్నా? ప్రొడక్షన్ టైమ్ లైన్ మాత్రం మేకర్స్‌ను కలవరపెడుతోంది. మరి భారీ లైనప్‌ను రీ-షెడ్యూల్ చేసుకుంటూ ప్రభాస్ ఏ సినిమా షూటింగ్ ను ముందుగా పూర్తి చేస్తారు? అన్నది చూడాలి.
