ప్రభాస్ ఇమేజ్ ఎఫెక్ట్.. 'రాజా సాబ్' కోసం మారుతి మరో ప్లాన్!
ప్రస్తుతం 'రాజా సాబ్' టీమ్ ముందున్న అతిపెద్ద టాస్క్, సినిమాను ప్రమోట్ చేయడం.
By: M Prashanth | 27 Oct 2025 10:07 AM ISTప్రస్తుతం 'రాజా సాబ్' టీమ్ ముందున్న అతిపెద్ద టాస్క్, సినిమాను ప్రమోట్ చేయడం. ఇది వినడానికి సింపుల్‌గా ఉన్నా, దీని వెనుక పెద్ద ఛాలెంజ్ ఉంది. ఆ ఛాలెంజ్ సినిమా కాదు, హీరో ప్రభాస్ ఇమేజ్. బాహుబలి, సలార్, కల్కి లాంటి సినిమాల తర్వాత, ఇండియన్ ఆడియెన్స్, ముఖ్యంగా నార్త్ బెల్ట్, ప్రభాస్‌ను ఒక పవర్ఫుల్ యాక్షన్ హీరోగా ఫిక్స్ అయిపోయారు.
ఇప్పుడు అలాంటి ఇమేజ్ ఉన్న హీరోతో మారుతి ఒక 'హారర్-
కామెడీ' తీశారు. ఈ జానర్‌ను ఆడియెన్స్ యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ ట్రైలర్‌కు డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. కానీ, ఆ ట్రైలర్ ఇంకా ఆడియెన్స్‌ను యాక్షన్ మోడ్ నుంచి బయటకు తీసుకురాలేకపోయింది. అందుకే, న్యూ ఇయర్ కి ప్లాన్ చేస్తున్న సెకండ్ ట్రైలర్‌తో మారుతి ఒక పెద్ద ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో ఎవరూ చేయని ప్రయోగం అనే టాక్ కూడా వినిపిస్తోంది.
సాధారణంగా ట్రైలర్ అంటే సినిమాలో ఉన్న బెస్ట్ షాట్స్, డైలాగ్స్ కట్ చేసి వదులుతారు. కానీ, మారుతి మాత్రం సినిమా ఫుటేజ్‌ను టచ్ చేయడం లేదట. ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం ఆ రెండు నిమిషాల ట్రైలర్ కోసమే, ప్రభాస్‌తో మళ్లీ రెండు మూడు రోజులు ఫ్రెష్‌గా షూట్ చేయబోతున్నారట. ఇది రెగ్యులర్ ట్రైలర్ కాదు, ఇది ఒక కాన్సెప్ట్ వీడియో లేదా మినీ షార్ట్ ఫిల్మ్ లాంటిదని తెలుస్తోంది.
సినిమాలోని కామెడీ సీన్లు కట్ చేసి చూపిస్తే, ప్రభాస్ యాక్షన్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారు. హారర్, యాక్షన్ సీన్లు చూపిస్తే, ఇది మరో 'సలార్'లా ఉందని ఫిక్స్ అయిపోతారు. ఈ కన్ఫ్యూజన్ ఎందుకని, అసలు 'రాజా సాబ్' ప్రపంచం ఎలా ఉంటుంది ఆ 'వైబ్' ఏంటి అనే ప్రశ్నలకు సమాధానం ఇస్తారట. ముఖ్యంగా ప్రభాస్ ఈ కొత్త జానర్‌లో ఎంత ఫ్రెష్‌గా ఉంటాడో చూపించడానికి ఈ స్పెషల్ షూట్ అని తెలుస్తోంది.
ఇది ఖర్చుతో కూడుకున్న రిస్క్. కేవలం ప్రమోషన్ కోసం 2, 3 రోజులు ప్రభాస్ డేట్స్ తీసుకోవడం, మళ్లీ షూట్ చేయడం అంటే మాటలు కాదు. కానీ, ప్రభాస్ ఇమేజ్‌ను బ్రేక్ చేసి, ఈ హారర్ కామెడీని పాన్ ఇండియా లెవల్‌లో జనాలకు ఎక్కించాలంటే ఈ మాత్రం ప్రయోగం తప్పదని మారుతి ఫిక్స్ అయ్యారట. ఈ ఐడియా గనుక క్లిక్ అయితే, ఇది ఫ్యూచర్ ఫిల్మ్ ప్రమోషన్స్‌లో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేయడం ఖాయం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
