Begin typing your search above and press return to search.

రెబల్ ఫ్యాన్స్ కి మెంటల్ ఎక్కించే న్యూస్..!

ప్రభాస్ తో ఫౌజీ అంటూ ప్రీ ఇండిపెండెన్స్ కథతో వస్తున్నాడు హను. అతని వర్క్ కి ప్రభాస్ ఇంప్రెస్ అయినట్టు తెలుస్తుంది. అందుకే అతనితోనే మరో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట ప్రభాస్.

By:  Ramesh Boddu   |   12 Oct 2025 1:38 PM IST
రెబల్ ఫ్యాన్స్ కి మెంటల్ ఎక్కించే న్యూస్..!
X

రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ మెంటల్ ఎక్కించే ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆల్రెడీ ప్రభాస్ చేయాల్సిన సినిమాలు లైన్ లో చాలానే ఉన్నాయి. రాజా సాబ్ ఎలాగు పూర్తై నెక్స్ట్ సమ్మర్ కి రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఫౌజీ సినిమాను నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుంది. ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ కూడా డిఫరెంట్ గా ఉంటుందట. ఇక ఈ సినిమా తర్వాత సందీప్ వంగ సినిమా ఉంటుంది. స్పిరిట్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను రెబల్ ఫ్యాన్స్ అంచనాలను మించి ఉండేలా సందీప్ వంగా ప్లానింగ్ ఉంది.

ప్రభాస్ ఐదు సినిమాలు లైన్ లో..

ఇక వీటితో పాటు సలార్ 2, కల్కి 2 కూడా ఉన్నాయి. ఇప్పటికే ఐదు సినిమాలు లైన్ లో ఉండగా ఇంకా ప్రశాంత్ వర్మ కూడా ప్రభాస్ తో సినిమా చేస్తాడని అంటున్నారు. ఐతే ఇవి కాకుండానే ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న ఒక సినిమా డైరెక్టర్ తో వెంటనే ప్రభాస్ మరో సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడట. ఇంతకీ అతనెవరు అంటే హను రాఘవపూడి అని తెలుస్తుంది.

ప్రభాస్ తో ఫౌజీ అంటూ ప్రీ ఇండిపెండెన్స్ కథతో వస్తున్నాడు హను. అతని వర్క్ కి ప్రభాస్ ఇంప్రెస్ అయినట్టు తెలుస్తుంది. అందుకే అతనితోనే మరో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట ప్రభాస్. ఎలాగు హోంబలే ప్రొడక్షన్ ప్రభాస్ తో 3 సినిమాలు అనౌన్స్ చేశారు. అందులో సలార్ 2 తో పాటు మరో స్టాండలోన్ సినిమా కూడా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఉంటుందని తెలుస్తుంది. ఈ రెండు కాకుండా హను రాఘవపూడితో ప్రభాస్ చేసే నెక్స్ట్ సినిమా కూడా హోంబలే వారు నిర్మిస్తారని తెలుస్తుంది.

సౌత్ లోనే కాదు పాన్ ఇండియా లెవెల్..

సో హోంబలే బ్యానర్ లో ఫౌజీ తర్వాత హను, ప్రభాస్ కాంబో మరో సినిమా ఉంటుందని టాక్. అదే నిజమైతే మాత్రం ఫౌజీ కాదు ఈసారి మరో స్టోరీతో హను ప్రభాస్ సినిమా ఉండే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం సౌత్ లోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో భారీ సినిమాలతో వరుస సక్సెస్ లు అందుకుంటున్నారు హోంబలే బ్యానర్. మరి ప్రభాస్ తో వాళ్ల సినిమాలు ఏ రేంజ్ లో రీచ్ ఉంటాయో రెబల్ ఫ్యాన్స్ కి ఎలాంటి ట్రీట్ అందిస్తాయన్నది చూడాలి.