Begin typing your search above and press return to search.

ఫస్ట్ పార్ట్‌ కు రెండు.. సెకండ్ పార్ట్ తో టార్గెట్ ఎంత?

రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీకి 72వ రెండు నేషనల్ అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే.

By:  M Prashanth   |   22 Sept 2026 6:17 PM IST
ఫస్ట్ పార్ట్‌ కు రెండు.. సెకండ్ పార్ట్ తో టార్గెట్ ఎంత?
X

రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీకి 72వ రెండు నేషనల్ అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే. ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకున్న బెస్ట్ కంప్లీట్ ఎంటర్టైనర్ సినిమాగా సెలెక్ట్ అయింది. అలాగే సినిమాలో ఫ్యూచర్ వరల్డ్ ను అద్భుతంగా చూపించినందుకు ప్రొడక్షన్ డిజైన్ డిపార్ట్మెంట్ లో నితిన్ జిహానీ చౌదరికి జాతీయ పురస్కారం లభించింది.

ఇప్పటికే థియేటర్లలో భారీ విజయం సాధించిన ఆ సినిమా.. ఇప్పుడు జాతీయ అవార్డులతో మరోసారి వార్తల్లో నిలిచింది. లేటెస్ట్ గా జరిగిన జాతీయ అవార్డుల కార్యక్రమానికి కల్కి నిర్మాత అశ్వనీదత్, దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత ప్రియాంక దత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముగ్గురూ కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. దీంతో కల్కి టీమ్‌ కు వచ్చిన రెండు జాతీయ అవార్డులపై మరోసారి చర్చ మొదలైంది.

ముఖ్యంగా డిబేట్ అంతా కల్కి 2పైనే ఉంది. ఎందుకంటే ఫస్ట్ పార్ట్‌ లో మొదలైన ఎన్నో ప్రశ్నలకు సీక్వెల్‌ లోనే సమాధానాలు దొరకాల్సి ఉంది. ప్రభాస్ పోషించిన భైరవ పాత్రకు సంబంధించిన అసలు బ్యాక్ డ్రాప్ ఏమిటి? కర్ణుడితో అతడికి ఉన్న రిలేషన్ ఏంటి? సుప్రీమ్ యాస్కిన్ స్టోరీ ఎక్కడికి వెళ్తుంది? అశ్వత్థామ పాత్రకు ఇంకా ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుంది? అనేది సెకండ్ పార్ట్‌ లో చూడాల్సి ఉంది.

మరోవైపు కల్కి 2 షూటింగ్ కూడా ఇప్పటికే కొంత పార్ట్ పూర్తయినట్లు సమాచారం. దాదాపు 30 శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమితాబ్ బచ్చన్ షూటింగ్‌ కు సంబంధించిన కొన్ని విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. కమల్ హాసన్‌ తో కలిసి ఉన్న ఫొటోలను కూడా షేర్ చేశారు. ఫస్ట్ పార్ట్‌ లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఒకే సన్నివేశంలో కనిపించలేదు.

కానీ సెకండ్ పార్ట్‌ లో ఆ ఇద్దరు లెజెండరీ నటులు స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీపికా పదుకొనె ఇప్పటికే కల్కి 2 నుంచి తప్పుకున్నారు. ఆమె ప్లేస్ లో సాయి పల్లవిని తీసుకున్నట్లు వార్తలు వచ్చినా.. దర్శకుడు నాగ్ అశ్విన్ నిజం కాదని క్లారిటీ ఇచ్చారు. మరి ఆమె ప్లేస్ లో ఎవరు యాక్ట్ చేస్తున్నారో ఇంకా అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఆ సినిమాల షూటింగ్స్ పూర్తయిన తర్వాత కల్కి 2 సెట్స్ లోకి ఆయన ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఫస్ట్ పార్ట్‌ తోనే నేషనల్ ప్లాట్ ఫామ్ పై రెండు అవార్డులు అందుకున్న కల్కి మూవీ, ఇప్పుడు సెకండ్ పార్ట్‌ తో మరింత భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మరి పార్ట్ 2తో ఇంకెంత పెద్ద టార్గెట్‌ ను నాగ్ అశ్విన్ టీమ్ పెట్టుకుందో వేచి చూడాలి.