మరో యుద్ధానికి ముందు ప్రశాంతత కోసం ప్రభాస్ ఏం చేశాడో!
భారతీయ సినిమా స్థాయిని పాన్-వరల్డ్ రేంజ్‌కి తీసుకెళ్లడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకున్న అతడు అలుపెరగని పోరాట యోధుడిలా వరుసపెట్టి మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్‌లకు సంతకం చేశారు
By: Sivaji Kontham | 25 Oct 2026 1:40 PM ISTపాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వార్ జోన్‌లో ఉన్నారు. భారతీయ సినిమా స్థాయిని పాన్-వరల్డ్ రేంజ్‌కి తీసుకెళ్లడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకున్న అతడు అలుపెరగని పోరాట యోధుడిలా వరుసపెట్టి మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్‌లకు సంతకం చేశారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, ప్రశాంత్ నీల్‌తో `సలార్ 2`, నాగ్ అశ్విన్‌తో `కల్కి 2` వంటి భారీ చిత్రాలను ప్యారలల్‌గా నడిపించాలంటే బోలెడంత స్టామినా - శక్తి అవసరం. అందుకే తన తదుపరి సినిమాల సమరానికి సిద్ధమయ్యే ముందు శారీరకంగా, మానసికంగా ప్రశాంతత పొందడానికే ప్రభాస్ విదేశీ వెకేషన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవల అక్టోబర్ 23న తన 47వ పుట్టినరోజు వేడుకలను అత్యంత సన్నిహితుల మధ్య ఘనంగా జరుపుకున్న అనంతరం.. ప్రభాస్ యూరప్‌లోని ఇటలీకి పయనమయ్యారు. అక్కడ సుమారు రెండు నుండి మూడు వారాల పాటు ప్రశాంతంగా గడిపి.. తగినంత విశ్రాంతి తీసుకున్న తర్వాత అక్టోబర్ చివరి నాటికి తిరిగి ఇండియాకు చేరుకోనున్నారు. అంతులేని శ్రమతో నిరంతరం సెట్స్‌పై గడిపే డార్లింగ్ ప్రభాస్.. మళ్లీ షూటింగ్‌ల మోత మోగించే ముందు తన ఎనర్జీ లెవల్స్‌ను రీచార్జ్ చేసుకోవడం కోసమే ఈ సీక్రెట్ బ్రేక్ తీసుకున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ రాగానే ప్రభాస్ ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుస షూటింగ్ షెడ్యూల్స్‌లో పాల్గొననున్నారు. ముందుగా నవంబర్ 3 నుండి 6 వరకు కేవలం నాలుగు రోజుల పాటు `కల్కి 2898 ఏడీ` సీక్వెల్ షూటింగ్‌లో పాలుపంచుకుంటారు. ఆ వెంటనే హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ డ్రామా `ఫౌజీ` సెట్స్‌పై దృష్టి సారిస్తారు. ఈ చిత్రంలో ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన మెజారిటీ భాగాన్ని పూర్తి చేసిన ప్రభాస్ త్వరలోనే ప్లాన్ చేసిన ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొనబోతున్నారు. ఈ చిత్రం 2027 మార్చి 19న విడుదల కావడానికి సిద్ధమవుతోంది.
`ఫౌజీ` యాక్షన్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత, ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ `స్పిరిట్` సెట్స్‌లోకి అడుగుపెడతారు. `అర్జున్ రెడ్డి`, `యానిమల్` చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. త్రిప్తి డిమ్రి కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం 2027 దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక దీనితో పాటు ప్రశాంత్ నీల్ `సలార్ 2: శౌర్యాంగ పర్వం`, నాగ్ అశ్విన్ `కల్కి 2` సీక్వెల్స్ కూడా లైన్లో ఉండటంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
అయితే ఒకేసారి ఇన్ని భారీ చిత్రాల లైనప్, విడుదల తేదీల షెడ్యూల్స్ ఉండటంతో అభిమానుల్లో కాస్త గందరగోళం కూడా నెలకొంది. ముఖ్యంగా `ఫౌజీ` సెకండ్ హాఫ్ యాక్షన్ పార్ట్ చిత్రీకరణ బ్యాలెన్స్ ఉండటంతో సినిమా అనుకున్న సమయానికి వస్తుందా లేదా అనే సందేహాలు ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. సినిమాలు ఏవైనా సరే.. తమ ప్రియతమ నటుడు పూర్తి ఎనర్జీతో మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఈ చిన్న బ్రేక్ ఎంతగానో ఉపయోగపడుతుందని.. రానున్న రోజుల్లో ప్రభాస్ రాక కోసం బాక్సాఫీస్ వెయిట్ చేస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
వరుస చిత్రాల కోసం నెలల తరబడి సెట్స్ లో కుస్తీ పట్టాలంటే డార్లింగ్ తన స్టామినాను పదింతలు పెంచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా విశ్రాంతితో వచ్చే ఎనర్జీ కావాలి. అందుకోసమే చిన్న బ్రేక్ లను తీసుకునేందుకు ప్రభాస్ వెనకాడటం లేదు.
