Begin typing your search above and press return to search.

ఒకేసారి మూడు పాన్ ఇండియా చిత్రాల‌తో డార్లింగ్ రికార్డు!

ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయ‌డానికి స్టార్ హీరోలంతా కిందా మిదా ప‌డుతున్నారు.

By:  Srikanth Kontham   |   30 March 2026 11:10 PM IST
ఒకేసారి మూడు పాన్ ఇండియా చిత్రాల‌తో డార్లింగ్ రికార్డు!
X

ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయ‌డానికి స్టార్ హీరోలంతా కిందా మిదా ప‌డుతున్నారు. అందులోనూ ఏక కాలంలో రెండు సినిమా షూటింగ్ ల‌కు హాజ‌ర‌వ్వ‌డం అంటే? హీరోల వ్య‌ధ‌లు ఇంకే స్థాయిలో ఉంటాయో చెప్పాల్సిన ప‌ని లేదు. అలాగ‌ని హీరోలంద‌రి విష‌యంలో ఇది వ‌ర్తించ‌దు. కొంత మంది హీరోలు షూటింగ్ ను అంతే వేగంగా పూర్తి చేయ‌గ‌ల స‌మ‌ర్ధులున్నారు. అయితే ఇక్క‌డ హీరోల కోణంలోనే చూడాల్సిన ప‌నిలేదు. డైరెక్ట‌ర్ కూడా అంతే కీల‌కం. డెరెక్ట‌ర్ ఇచ్చే డైరెక్ష‌న్ ని బ‌ట్టే షూటింగ్ ఎప్పుడు పూర్త‌వుతుంది? సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అన్న‌ది క్లారిటీ ఉంటుంది. ఈ విష‌యంలో చాలా మంది స్టార్ హీరోలంద‌రికంటే డార్లింగ్ ప్ర‌భాస్ ఎంతో మెరుగ్గా ప‌నిచేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కొంత మంది స్టార్లు ప్ర‌భాస్ ను స్పూర్తిగా తీసుకుని ముందుకు క‌దులుతున్నారు.

తాజాగా డార్లింగ్ మ‌రోసారి ఏక కాలంలో మూడు సినిమా షూటింగ్ లు పూర్తిచేస్తూ షెభాష్ అనిపిస్తున్నాడు. ప్ర‌స్తుతం ప్రభాస్ ఏకకాలంలో `స్పిరిట్`, `ఫౌజీ`, `కల్కి 2` వంటి మూడు భారీ బడ్జెట్ పాన్-ఇండియా చిత్రాల షూటింగ్‌లలో పాల్గొంటూ రికార్డు సృష్టిస్తున్నారు. ఒకే సమయంలో మూడు భిన్నమైన ప్రపంచాలు, మూడు భిన్నమైన పాత్రలను హ్యాండిల్ చేయడం చిన్న‌ విషయం కాదు.

కానీ ప్రభాస్ తన అంకిత భావంతో సాధ్యం చేస్తున్నారు. రెండు..మూడు నెల‌లుగా `పౌజీ`, `స్పిరిట్` షూటింగ్ ల్లో నిర్విరామంగా డార్లింగ్ పాల్గొంటున్న సంగ‌తి తెలిసిందే. `క‌ల్కి 2` షూటింగ్ కూడా మొద‌ల‌వ్వ‌డంతో? ఆ సినిమా షూట్ కు వెళ్ల‌డానికి రెడీ అవుతున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌భాస్ లేని స‌న్నివేశాల‌ను ద‌ర్శ‌కుడు నాగీ చిత్రీక‌రిం చారు. కానీ ఇక‌పై డార్లింగ్ కూడా రెగ్యుల‌ర్ గా షూట్ కి హాజ‌రు కావాల్సి స‌మ‌యం ఆసన్న‌మైంది. దీంతో ప్ర‌భాస్ షెడ్యూల్ మ‌రింత టైట్ అవుతుంద‌ని తెలుస్తోంది. రాత్రింబవళ్లు షూటింగ్‌లతో మ‌రింత బిజీ అవుతారు.

ఒక్కో సినిమాకు ఒక్కో రకమైన లుక్, బాడీ లాంగ్వేజ్ అవసరమవుతాయి. ఏ ఒక్క ప్రాజెక్టుకు ఇబ్బంది కలగకుండా ప్రభాస్ ముందుకెళ్లాల్సి ఉంటుంది. ప్ర‌భాస్ లో క‌మిట్ మెంట్ చూస్తుంటే? వృత్తి పట్ల ఆయ‌న‌ గౌరవాన్ని తెలియ జేస్తోంది. గతంలో కూడా డార్లింగ్ `సలార్`, `కల్కి2898`, `ఆదిపురుష్` వంటి చిత్రాలను ఒకే సమయంలో బ్యాలెన్స్ చేశారు. అప్పుడు చేతిలో స‌మ‌యం ఉండ‌టంతో పెద్ద‌గా ఇబ్బంది ప‌డ‌లేదు. కానీ ఇప్పుడు ప‌రిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. నాలిగింత‌లు అధికంగా శ్ర‌మించాల్సి ఉంటుంది. నటుడిగా పాత్రల మధ్య తేడాను చూపిస్తూ, వేర్వేరు దర్శకుల విజన్‌కు అనుగుణంగా మారి ప‌నిచేయాల్సి ఉంటుంది. ఇలా ఒకేసారి మూడు సినిమాలు ప‌ట్టాలెక్కించిన డార్లింగ్ ను నిజంగా మెచ్చుకోవాల్సిందే. ప్ర‌భాస్ తో పోల్చితే షూట్ విష‌యంలో మిగ‌తా పాన్ ఇండియా స్టార్లు ఎంత‌గా వెనుక బ‌డుతున్నారు? అన్న‌ది అద్దం ప‌డుతుంది.