ప్రభాస్ ట్యాగ్ ఇకపై అదేనా?
దీంతో అందరూ ప్రభాస్ ను అలాగే పిలుచుకుంటున్నారు. కానీ రీసెంట్ గా ఆయన అప్ కమింగ్ మూవీ స్పిరిట్ మూవీ నుంచి గ్లింప్స్ రాగా.. అంతా ఒక్కసారిగా షాకయ్యారు.
By: M Prashanth | 27 Dec 2025 12:32 PM ISTటాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. వరల్డ్ వైడ్ గా ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఆయన సొంతం. ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్ లో ఓ రేంజ్ లో స్టార్ డమ్ ఉన్న హీరో ఎవరంటే ప్రభాస్ అనే చెప్పాలి. అందుకే రెబల్ స్టార్ గా ఉన్న మన డార్లింగ్.. కొన్నేళ్ల క్రితం ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు.
దీంతో అందరూ ప్రభాస్ ను అలాగే పిలుచుకుంటున్నారు. కానీ రీసెంట్ గా ఆయన అప్ కమింగ్ మూవీ స్పిరిట్ మూవీ నుంచి గ్లింప్స్ రాగా.. అంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఎందుకంటే ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సందీప్ రెడ్డి వంగా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అని పేర్కొన్నారు.
అప్పటి వరకు డార్లింగ్ ను యంగ్ రెబల్ స్టార్ అని, రెబల్ స్టార్ అని, పాన్ ఇండియా స్టార్ అంటూ అందరూ పిలుచుకుంటుండగా.. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటూ డిక్లేర్ చేశారు సందీప్. దీంతో అప్పుడు ఆ విషయంపై జోరుగా చర్చ సాగింది. ఇకపై మన ప్రభాస్ ట్యాగ్ అదేనేమోనని అంతా డిస్కస్ చేసుకున్నారు.
ఇప్పుడు యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ అంటూ అలాంటి కామెంట్స్ చేశారు. ప్రభాస్ తో కలిసి ఆమె ది రాజా సాబ్ మూవీ చేస్తుండగా.. మరికొద్ది రోజుల్లో ఆ సినిమా రిలీజ్ కానుంది. దీంతో ఆమె ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో హోస్ట్.. ప్రభాస్ తో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కోసం అడిగారు.
ఆ సమయంలో యాంకర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని అనగా.. దీంతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కాదు, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటూ చెప్పుకొచ్చారు నిధి. వెంటనే హోస్ట్ కూడా తన మాటలను సరిచేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు మళ్లీ వైరల్ గా మారింది.
నిజానికి.. అప్పుడు స్పిరిట్ గ్లింప్స్ వచ్చినప్పుడు.. కొందరు బాలీవుడ్ అభిమానులు సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎందరో హీరోలు.. కొన్నేళ్లుగా ఉన్నారని ఆ సమయంలో చెప్పారు. బాక్సాఫీస్ వద్ద ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుని సత్తా చాటారని డీటెయిల్స్ మెన్షన్ చేశారు.
అంతే కాదు.. ఇండియాస్ సూపర్ స్టార్ ఎవరంటూ పోల్స్ కూడా పెట్టారు. అప్పట్లో కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాలో ఆ విషయంపై జోరుగా చర్చ జరిగింది. ఇప్పుడు మళ్లీ ప్రభాస్ ను ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ అంటూ నిధి అగర్వాల్ పిలవడంతో ఆ విషయం వైరల్ గా మారింది. దీంతో ఇప్పుడు ఏం జరుగుతుందో వేచి చూడాలి.
