Begin typing your search above and press return to search.

రాజా సాబ్ విష‌యంలో డార్లింగ్ శాటిస్‌ఫై

వాస్త‌వానికి రాజాసాబ్ ఈపాటికే రిలీజ‌వాల్సింది కానీ కొన్నికార‌ణాల వ‌ల్ల మ‌ధ్య‌లో షూటింగ్ లేట‌వ‌డంతో రిలీజ్ కూడా ఆల‌స్య‌మైంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   1 Oct 2025 4:40 PM IST
రాజా సాబ్ విష‌యంలో డార్లింగ్ శాటిస్‌ఫై
X

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా ది రాజా సాబ్. మొద‌ట్లో మారుతి డైరెక్ష‌న్ లో ప్ర‌భాస్ సినిమా అని టాక్ వచ్చిన‌ప్పుడు ఈ సినిమా చేయొద్ద‌ని ప్ర‌భాస్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో నెత్తి నోరూ బాదుకున్నారు. కానీ ప్ర‌భాస్ అవేమీ ప‌ట్టించుకోకుండా మారుతి మీద‌, క‌థ మీద న‌మ్మ‌కంతో ముందుకెళ్లిపోయారు.

ప్ర‌భాస్ న‌మ్మ‌క‌మే నిజ‌మైంది..

తీరా చూస్తే ఇప్పుడు ప్ర‌భాస్ న‌మ్మ‌క‌మే నిజ‌మైంది. ఫ్యాన్స్ వ‌ద్దన్నార‌ని ప్ర‌భాస్ రాజా సాబ్ ను ఆపేసి ఉంటే ప్ర‌భాస్ ను వింటేజ్ లుక్స్ లో చూసే అవ‌కాశాన్ని కోల్పోయేవారు అభిమానులు. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ను ఎలాగైనా ఇంప్రెస్ చేయాల‌ని మారుతి మొద‌టి నుంచి ఈ సినిమా విష‌యంలో ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఎంతో చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్నారు.

రాజా సాబ్ ట్రైల‌ర్ కు మంచి రెస్పాన్స్

మారుతి క‌ష్టానికి త‌గ్గ‌ట్టే ప్ర‌భాస్ లుక్స్ నుంచి, గ్లింప్స్, టీజ‌ర్, రీసెంట్ గా వ‌చ్చిన ట్రైల‌ర్ వ‌ర‌కు అన్నీ ఫ్యాన్స్ తో పాటూ సాధార‌ణ సినీ ప్రేక్ష‌కుడిని కూడా మెప్పించాయి. వాస్త‌వానికి రాజాసాబ్ ఈపాటికే రిలీజ‌వాల్సింది కానీ కొన్నికార‌ణాల వ‌ల్ల మ‌ధ్య‌లో షూటింగ్ లేట‌వ‌డంతో రిలీజ్ కూడా ఆల‌స్య‌మైంది. రాజా సాబ్ చెప్పిన తేదీ నుంచి వాయిదా ప‌డి వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రికి వెళ్లింది.

కాగా ఈ సినిమా విష‌యంలో ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ప్ర‌భాస్ కోసం రాజా సాబ్ స్పెష‌ల్ షో వేశార‌ని, ఫైన‌ల్ అవుట్‌పుట్ చూసుకుని ప్ర‌భాస్ చాలా సంతృప్తిగా ఉన్నార‌ని తెలుస్తోంది. ద‌స‌రా త‌ర్వాత సినిమా షూటింగ్ ను పూర్తి చేయ‌డానికి డార్లింగ్ గ్రీస్ వెళ్ల‌నున్నార‌ట‌. ఈ నెల 6 నుంచి బ్యాలెన్స్ ఉన్న రెండు పాట‌ల‌ను ప్ర‌భాస్ పూర్తి చేయ‌నున్నార‌ట‌. 20 రోజుల వ‌రకూ ఈ షెడ్యూల్ కొన‌సాగ‌నుంద‌ని స‌మాచారం. హార్ర‌ర్ కామెడీ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న రాజా సాబ్ లో మాళ‌విక మోహ‌న‌న్, నిధి అగ‌ర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా త‌మ‌న్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో రాజా సాబ్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.