Begin typing your search above and press return to search.

కాంతార ప్రీక్వెల్.. రంగంలోకి ఆ ముగ్గురు..

బ్లాక్ బస్టర్ హిట్ కాంతార మూవీకి ప్రీక్వెల్ గా వస్తున్న ఆ సినిమాలో కన్నడ నటుడు రిషభ్ శెట్టి లీడ్ రోల్ పోషిస్తున్నారు.. దర్శకత్వం కూడా వహిస్తున్నారు.

By:  M Prashanth   |   21 Sept 2025 9:10 AM IST
కాంతార ప్రీక్వెల్.. రంగంలోకి ఆ ముగ్గురు..
X

మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీల్లో కాంతార చాప్టర్ 1 కూడా ఒకటి. బ్లాక్ బస్టర్ హిట్ కాంతార మూవీకి ప్రీక్వెల్ గా వస్తున్న ఆ సినిమాలో కన్నడ నటుడు రిషభ్ శెట్టి లీడ్ రోల్ పోషిస్తున్నారు.. దర్శకత్వం కూడా వహిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్‌‌‌‌‌‌‌‌ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

రుక్మిణీ వసంత్ హీరోయిన్‌‌ ‌‌‌‌‌‌గా నటిస్తున్న ఆ చిత్రంతో గుల్షన్ దేవయ్య కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. బి.అజనీష్ లోక్‌‌‌‌‌‌‌‌ నాథ్ సంగీతం అందిస్తున్న మూవీ.. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ అవ్వనుంది.

రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. అందులో భాగంగా ట్రైలర్ లాంచ్ కు డేట్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ట్రైలర్ ను సెప్టెంబర్ 22న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. దీంతో అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

కాంతార బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడంతో, ఇప్పుడు దాని ప్రీక్వెల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాటిని మేకర్స్ ఇంకా పెంచుతున్నారు. ఇప్పుడు ప్రీక్వెల్ చుట్టూ ఉన్న భారీ హైప్‌ ను క్యాష్ చేసుకోవడానికి పెద్ద ప్లాన్ వేశారు. పాన్ ఇండియా మూవీ కనుక.. పలువురు స్టార్ హీరోలతో ట్రైలర్ ను రిలీజ్ చేయించనున్నారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తెలుగు వెర్షన్ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. హిందీ ట్రైలర్ ను బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్.. తమిళ్ వెర్షన్ ను స్టార్ హీరో శివ కార్తికేయన్.. మలయాళ ట్రైలర్ ను మల్టీ టాలెంటెడ్ పృథ్వీరాజ్ సుకుమారన్ చేతుల మీదుగా విడుదల చేయనున్నారు మేకర్స్.

ఆయా హీరోలు రేపు మధ్యాహ్నం 12:45 గంటలకు తమ తమ భాషల్లో ట్రైలర్‌ ను విడుదల చేయనున్నారు. ఆ విషయాన్ని ఇప్పటికే మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే మేకర్స్ ప్లాన్ అదిరిపోయిందని నెటిజన్లు చెబుతున్నారు. ట్రైలర్ రిలీజ్ అయ్యాక.. మూవీపై పాన్ ఇండియా రేంజ్ లో బజ్ పెరగడం ఖాయమని అంటున్నారు. మరి ట్రైలర్ ఎలా ఉంటుందో.. బజ్ ఎంతలా పెరుగుతుందో వేచి చూడాలి.