Begin typing your search above and press return to search.

ఇమాన్వీకి డార్లింగ్ మరో ట్రీట్.. వామ్మో అన్ని రకాలా?

ప్రభాస్‌ తో కలిసి ఫౌజీ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ ఇమాన్వీ ఇస్మాయిల్ కూడా డార్లింగ్ ఆతిథ్యాన్ని ఆస్వాదించింది.

By:  M Prashanth   |   23 Feb 2026 1:07 PM IST
ఇమాన్వీకి డార్లింగ్ మరో ట్రీట్.. వామ్మో అన్ని రకాలా?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఫ్యాన్స్, సినీ ప్రియులు ఎక్కువగా మాట్లాడుకునే విషయం ఏంటంటే ఆయన ఆతిథ్యం.. సెట్స్‌ లో అయినా, ఇంట్లో అయినా గెస్టులను చాలా బాగా చూసుకోవడం ప్రభాస్‌ కు అలవాటు. ఇప్పటికే పలువురు నటీనటులు, టెక్నీషియన్లు ఆయన ఇంటి భోజనం రుచి చూసి ప్రశంసలు కురిపించారు. తాజాగా ఆ లిస్ట్ లోకి మరో పేరు చేరింది.

ప్రభాస్‌ తో కలిసి ఫౌజీ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ ఇమాన్వీ ఇస్మాయిల్ కూడా డార్లింగ్ ఆతిథ్యాన్ని ఆస్వాదించింది. ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే గతంలో హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతున్న టైమ్ లో బ్రేక్ సమయంలో ప్రభాస్ తన ఇంటికి ఆహ్వానించి ప్రత్యేక విందు ఏర్పాటు చేసినట్లు ఇమాన్వీ సోషల్ మీడియాలో తెలిపారు.

"సర్ప్రైజ్‌ గా, చాలా సంతోషంగా అనిపించింది. మీ ఆతిథ్యానికి నా మనసు, పొట్ట నిండిపోయాయి" అంటూ ఆమె ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ అప్పట్లో నెట్టింట వైరల్ అయింది. తాజాగా మరోసారి ప్రభాస్ ట్రీట్ ఇవ్వగా, ఆ ఫుడ్ ఐటమ్స్ వీడియోను కూడా ఆమె షేర్ చేసింది. "థాంక్యూ ప్రభాస్ గారు" అంటూ క్యాప్షన్ పెట్టడంతో అభిమానులు రెస్పాండ్ అవుతున్నారు. డార్లింగ్ అంటే ఇదే, ఇమాన్వీకి మరో స్పెషల్ ట్రీట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఫౌజీ మూవీకి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన సినిమాల్లో నటించిన హీరోయిన్లకు టాలీవుడ్‌ లో మంచి గుర్తింపు వస్తుందని ఇండస్ట్రీలో టాక్ ఉంది. గతంలో ఆయన పరిచయం చేసిన పలువురు హీరోయిన్లు స్టార్‌ డమ్ అందుకున్నారు. అదే రేంజ్ లో ఇప్పుడు ఇమాన్వీపై కూడా అంచనాలు పెరిగాయి. అయినప్పటికీ ఫౌజీ నుంచి ఆమె ఫస్ట్ లుక్ ఇంకా విడుదల కాలేదు.

పీరియాడిక్ యాక్షన్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇందులో స్టార్ క్యాస్టింగ్ మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజిక్ ను విశాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు. మేకర్స్ సినిమాను 2026 అక్టోబర్‌ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ వరుసగా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

ఇప్పటికే సలార్ 2, కల్కి 2, స్పిరిట్ చిత్రాలు లైన్లో ఉన్నాయి. ఒకవైపు పాన్ ఇండియా సినిమాలు చేయడం, మరోవైపు సహ నటీనటులకు ఆతిథ్యం ఇవ్వడం.. ఇలా డార్లింగ్ తన సింప్లిసిటీ అందరి మనసులు గెలుచుకుంటున్నాడు. మొత్తానికి.. ఫౌజీ షూటింగ్‌ తో పాటు ప్రభాస్ ఇంటి విందు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారింది. అదే సమయంలో రిలీజ్‌ కు ముందే ప్రభాస్, ఇమాన్వీ కాంబోపై మంచి బజ్ క్రియేట్ అయింది.