Begin typing your search above and press return to search.

ప్రభాస్ మిస్టరీ.. లీక్ కాకూడదనేనా?

సాధారణంగా ఇలాంటి లుక్స్‌పై రకరకాల గాసిప్స్ వస్తుంటాయి. ఏదో హెయిర్ కి సంబంధించిన ట్రీట్మెంట్ అని కూడా ప్రచారాలు మొదలయ్యాయి.

By:  M Prashanth   |   4 Nov 2025 11:38 AM IST
ప్రభాస్ మిస్టరీ.. లీక్ కాకూడదనేనా?
X

రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్య ఎక్కడ పబ్లిక్‌లో కనిపించినా, ఆయన ఫ్యాషన్ కంటే ఎక్కువగా ఆయన తలకు చుట్టుకుంటున్న క్లాత్ గురించే చర్చ జరుగుతోంది. రీసెంట్‌గా 'బాహుబలి: ది ఎపిక్' ప్రమోషన్ల కోసం రాజమౌళి, రానాతో కలిసి చేసిన ఇంటర్వ్యూలో కూడా ఆయన ఇదే లుక్‌లో కనిపించారు. దీంతో, ప్రభాస్ మళ్లీ తన హెయిర్‌స్టైల్‌ను ఎందుకు దాస్తున్నాడనే క్యూరియాసిటీ ఫ్యాన్స్‌లో పెరిగిపోయింది.

సాధారణంగా ఇలాంటి లుక్స్‌పై రకరకాల గాసిప్స్ వస్తుంటాయి. ఏదో హెయిర్ కి సంబంధించిన ట్రీట్మెంట్ అని కూడా ప్రచారాలు మొదలయ్యాయి. కానీ, అసలు విషయం అది కాకపోవచ్చని ఓ వర్గం ఫ్యాన్స్ అంటున్నారు. ఒక హీరో తన లుక్‌ను దాస్తున్నాడంటే, దానికి బలమైన ప్రొఫెషనల్ కారణమే ఉండి ఉంటుందని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా, డైరెక్టర్ల రిక్వెస్ట్ మేరకే హీరోలు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. 'పుష్ప' టైమ్‌లో బన్నీ, 'RRR' టైమ్‌లో చరణ్ ఎన్టీఆర్ కూడా తమ లుక్స్‌ను చాలా కాలం పాటు దాచిపెట్టారు.

ప్రభాస్ లైనప్ చూస్తే, అందులో ఉన్న డైరెక్టర్లు లుక్స్ విషయంలో ఎంత పర్టిక్యులర్‌గా ఉంటారో తెలిసిందే. సందీప్ వంగా (స్పిరిట్), హను రాఘవపూడి (ఫౌజీ).. ఈ ముగ్గురూ తమ హీరోల క్యారెక్టర్లను ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే వరకు సీక్రెట్‌గా ఉంచడంలో మాస్టర్స్. ఇప్పుడు ప్రభాస్ ఒకేసారి ఈ ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో, ఏ లుక్ బయటకు రాకూడదని ఈ జాగ్రత్త తీసుకుంటున్నారనిపిస్తోంది.

ప్రస్తుతం వినిపిస్తున్న గట్టి టాక్ ప్రకారం, ఈ 'హెడ్ ర్యాప్' వెనుక ఉన్న కారణం 'ఫౌజీ' అని మరో బలమైన టాక్ కూడా వినిపిస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి డైరెక్షన్‌లో ఈ సినిమా షూటింగ్‌లోనే ఉన్నాడు. ఇది ఒక పీరియడ్ యాక్షన్ డ్రామా కావడంతో, ఇందులో ప్రభాస్ ఒకటి కాదు, రెండు మూడు డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది.

సరిగ్గా ఈ షూటింగ్ మధ్యలోనే ఆయన 'బాహుబలి' ప్రమోషన్ల కోసం బయటకు రావాల్సి వచ్చింది. దీంతో, 'ఫౌజీ' కోసం సెట్ చేసిన ఆ స్పెషల్ హెయిర్ స్టైల్ లేదా లుక్ బయటకు లీక్ కాకూడదని డైరెక్టర్ హను రాఘవపూడి రిక్వెస్ట్ చేయడం వల్లే, ప్రభాస్ ఇలా తలకు క్లాత్ చుట్టి పబ్లిక్‌లోకి వచ్చారని మరో టాక్ వైరల్ అవుతోంది. ఏదేమైనా ప్రభాస్ టీమ్ నుంచి అధికారిక క్లారిటీ వచ్చే వరకు ఈ మిస్టరీ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుందని చెప్పవచ్చు.