డార్లింగ్ కు కెరీర్ బెస్ట్ క్యారెక్టర్ పడబోతోందా?
ఇది 1930-40ల్లో జరిగే కథ అని తెలుస్తోంది. అలాగే ప్రజలకు న్యాయాన్ని అందించడానికి ప్రభాస్ యోధుడి పాత్రలో యుద్ధం చేస్తాడని సమాచారం.
By: M Prashanth | 23 Oct 2025 7:00 PM ISTప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ పాన్ఇండియావే. ఇప్పుడు ప్రభాస్ చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. కానీ, ప్రస్తుతం చర్చంతా డైరెక్టర్ హను రాఘవపూడితో చేస్తున్న చిత్రంపైనే నడుస్తోంది. ఇందుకు కారణం ప్రభాస్ - హను ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ చేసిన పోస్టరే. అలాగే డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా మరిన్ని సినిమాల పోస్టర్స్ అప్డేట్స్ రిలీల్ చేయనున్నారు.
అయితే రిలీజ్ చేసిన పోస్టర్స్ ను గమనిస్తే ఓ అవగాహన వస్తోంది. పాండవుల పక్షాన ఉన్న కర్ణుడు.. అనే క్యాప్షన్ రాసుకొచ్చింది మూవీటీమ్. ఇతడి కోసం అందరూ 1932 నుండి వెతుకుతున్నారు, ‘ఒంటరిగా పోరాడిన బెటాలియన్ అనే ట్యాగ్ లైన్లు సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. ఇది 1930-40ల్లో జరిగే కథ అని తెలుస్తోంది. అలాగే ప్రజలకు న్యాయాన్ని అందించడానికి ప్రభాస్ యోధుడి పాత్రలో యుద్ధం చేస్తాడని సమాచారం.
అయితే ఈ అంశాలను డైరెక్టర్ హను భావోద్వేగాలతో ముడిపెట్టి ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా తెరకెక్కిస్తున్నారని టాక్. అటు ప్రభాస్ బాహుబలి తర్వాత పాన్ఇండియా లెవెల్ లో సినిమాలు తీస్తున్నా.. మనసును హత్తుకునే పాత్రల్లో అయితే కనిపించడం లేదు. అప్పట్లో చక్రం సినిమాలో ప్రభాస్ పండించిన ఎమోషన్ కు ఇప్పటికీ ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆ సినిమా డైరెక్టర్ కృష్ణ వంశీ ప్రభాస్ లోని మరో కోణాన్ని అప్పట్లోనే పరిచయం చేశారు.
కానీ ఆ తర్వాత ఈ రేంజ్ ఇంపాక్ట్ ఉన్న పాత్రలో ప్రభాస్ మళ్లీ కనిపించలేదు. దీంతో డార్లింగ్ లోనీ ఈ షేడ్ ను ఫ్యాన్స్ కూడా మిస్ అవుతున్నారు. అందుకే హను ఈసారి ప్రభాస్ లోని ఆ కోణాన్ని బయటకు తీస్తున్నారని ఇన్ సైడ్ టాక్. వాస్తవానికి ఇలాంటి ఇంటెన్స్ ఉన్న పాత్రలు సృష్టించడం, తెరపై అద్భుతంగా చూపించడంలో హను దిట్ట. ఆయన గత సినిమాలు అందాల రాక్షసి, కృష్ణ గాడి వీర ప్రేమ గాథ, పడిపడి లేచే మనసు, సీతారామం ఇలా ఒక్కో సినిమాలో ఒక్కో విధమైన ఎమోషన్స్ పడించడంలో సక్సెస్ అయ్యారు.
ఇప్పుడు ఆయన ప్రభాస్ లోని అత్యుత్తమ నటనను ఈ సినిమాతో బయటకు తీసుకొస్తున్నారని అంటున్నారు. ఆడియెన్స్ హార్ట్ టచ్ చేసే కథను తెరపై చూపించడంలో హనుకు సాటిలేరు. అందులోనూ బ్రిటిష్ పాలన, గుడాచారి యాక్షన్ అంటున్నారు అంటే కంటెంట్ గట్టిగానే ఉంటుందని అర్ధమవుతుంది. ఇదివరకే సీతారామం విషయంలోనే ఇది నిరూపితమైంది. ఇక ఇది తన తొలి పాన్ఇండియా ప్రాజెక్ట్, అందులోనూ ప్రబాస్ లాంటి బిగ్ స్టార్ ఉండడంతో ఈ కథ విషయంలో హను చాలా కేర్ తీసుకుంటున్నారని టాక్. పక్కాగా ఇది ప్రభాస్ ను ది బెస్ట్ యాక్టర్ గా నిలబెడుతుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
