Begin typing your search above and press return to search.

ప్రభాస్ 'స్పిరిట్'.. 22 ఏళ్ల తర్వాత కాంబో రిపీట్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   24 Jan 2026 7:00 PM IST
ప్రభాస్ స్పిరిట్.. 22 ఏళ్ల తర్వాత కాంబో రిపీట్?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ అటు అభిమానుల్లో.. ఇటు సినీ ప్రియుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసుకున్న ఆ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే సినిమాలో ప్రభాస్.. పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. తొలిసారి ఆ రోల్ లో సందడి చేయనున్నారు.

ఆయన సరసన బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ యాక్ట్ చేస్తున్నారు. వారిద్దరితోపాటు ప్రకాష్ రాజ్, కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే మిగతా కీలక పాత్రల గురించి మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఆసక్తికర ప్రచారం తెరపైకి వచ్చింది. స్పిరిట్ లో మ్యాచో స్టార్ గోపీచంద్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే ప్రభాస్, గోపీచంద్ గతంలో వర్షం సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఇద్దరికీ మంచి పేరు వచ్చింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఆ కాంబినేషన్ తెరపై కనిపించబోతుందనే వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. అందరిలో జోష్ కూడా నింపుతోంది. నెటిజన్లు, సినీ ప్రియులు ఆ విషయంపై డిస్కస్ చేసుకుంటున్నారు.

స్పిరిట్ లో గోపీచంద్ విలన్‌ గా నటిస్తారా? లేక హీరోకి సపోర్టింగ్ రోల్ చేస్తారా? అనే విషయంపై స్పష్టత లేదు. అయితే సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో నెగటివ్ క్యారెక్టర్లు చాలా పవర్‌ ఫుల్‌ గా ఉంటాయని తెలిసిందే. అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి సినిమాల కోసం ఆయన డిజైన్ చేసిన రోల్స్.. ప్రేక్షకులను తెగ మెప్పించాయి.

అలాంటి దర్శకుడు తీస్తున్న సినిమాలో గోపీచంద్ కీలక పాత్రలో కనిపిస్తే అది ఆయన కెరీర్‌ కు కొత్త మలుపు అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి గోపీచంద్ గతంలో కూడా ప్రభాస్ సినిమాలో మంచి విలన్ పాత్ర వస్తే తప్పకుండా చేస్తానని పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన సంగతి తెలిసిందే. అందుకే ఆ ప్రచారానికి మరింత బలం చేకూరిందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

అదే సమయంలో గోపీచంద్ కొంత కాలంగా హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. వరుస సినిమాలు చేస్తున్నా కూడా సక్సెస్ అందుకోలేకపోతున్నారు. దీంతో ఆయన మార్కెట్ తగ్గిపోయింది. అందుకే ఇప్పుడు స్పిరిట్ లాంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ లో భాగం కావడం ఆయనకు ప్లస్ అవుతుందని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి క్రేజీ కాంబినేషన్ నిజంగానే సెట్ అవుతుందా? గోపీచంద్ పాత్ర ఏంటి? అన్న ప్రశ్నలకు సమాధానాల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.