వారిద్దరికే ప్రత్యేకం.. ప్రభాస్ 'నిధి'ని పట్టించుకోవడం లేదా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత అన్నీ యాక్షన్ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
By: Madhu Reddy | 7 Jan 2026 5:35 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత అన్నీ యాక్షన్ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు ఆయన తొలిసారి తన సినీ కెరియర్ లోనే హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ది రాజా సాబ్ అంటూ సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మారుతి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు భామలు ప్రభాస్ తో జత కట్టిన విషయం తెలిసిందే. మలయాళ నటి మాళవిక మోహనన్ ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఈమెతో పాటు గతంలో రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ తో కలసి నటించిన రిద్ధీ కుమార్ కూడా హీరోయిన్గా నటిస్తోంది. అలాగే ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ఇందులో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇకపోతే తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ప్రభాస్ నిధి అగర్వాల్ ను పట్టించుకోవడం లేదు అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే సాధారణంగా ప్రభాస్ తన సినిమాలో పనిచేసే హీరోయిన్లను చాలా జాగ్రత్తగా చూసుకుంటారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సెట్లో ఉన్నప్పుడు వారికి తన ఇంటి నుండి ఆహారం అందించడమే కాకుండా వారికి ఆహారం విషయంలో ఎటువంటి లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. ముఖ్యంగా ప్రభాస్ తో పని చేసిన ఎంతోమంది హీరోయిన్లు దీని గురించి చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే .
అయితే ది రాజాసాబ్ సినిమా షూటింగ్లో మాత్రం ప్రభాస్ తన హీరోయిన్ల కోసం ఒక అడుగు ముందుకు వేసినట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. ఈ సినిమాలో నటిస్తున్న మాళవిక మోహనన్ షూటింగ్ సమయంలో ప్రభాస్ తన కోసం స్వయంగా బిర్యానీ వండి పెట్టాడని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇన్ని రోజులు ప్రభాస్ ప్రజలకు అద్భుతమైన ఆహారాన్ని అందిస్తాడని అందరికీ తెలుసు. కానీ ఈసారి స్వయంగా అద్భుతమైన బిర్యాని వండి వడ్డించగలడు అని మాళవిక చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఇకపోతే ఈ సినిమాలో నటిస్తున్న మరో హీరోయిన్ రిద్ది కుమార్. ఈమె కూడా ప్రభాస్ గురించి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకుంది ముఖ్యంగా ప్రభాస్ తనకు చీరను బహుమతిగా ఇచ్చాడని మూడేళ్ల తర్వాతే ఆ చీరను ది రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ధరించానని చెప్పి ఈమె కూడా ఆశ్చర్యపరిచింది.
అలా మాళవిక మోహనన్ ప్రభాస్ తనకు బిర్యానీ వండి పెట్టాడని చెబితే.. ఇటు రిద్దీ తనకు ఏకంగా చీర ఇచ్చాడని చెప్పింది మరి నిధి అగర్వాల్ అభిమానులు మాత్రం నిధి అగర్వాల్ కోసం ప్రభాస్ ఏం చేయలేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఆ ఇద్దరికే ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారా? నిధి అగర్వాల్ ను ఆయన పట్టించుకోవడం లేదా? ఎందుకు? అనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో నైనా ప్రభాస్ నిధి అగర్వాల్ కోసం ఏదైనా ప్రత్యేకంగా చేస్తాడేమో చూడాలి.
