డార్లింగ్ 50 కోట్లుచ్చి పంచేయమన్నాడా!
తాజాగా డార్లింగ్ ప్రభాస్ కూడా అలాంటి దాతృహృదయం గలవారని ఓ డిస్ట్రిబ్యూటర్ మాటల ద్వారా బయట పడింది.
By: Srikanth Kontham | 20 Aug 2025 5:00 AM ISTసినిమా ప్లాప్ అయితే చాలా మంది స్టార్ హీరోలు పారితోషికంలో మినహాయింపులిస్తుంటారు. కొంత మంది పూర్తి పారితోషికం తిరిగి నిర్మాతలకు చెల్లిస్తుంటారు. నిర్మాతలకు తిరిగి ఇవ్వాల్సిన పనిలేదు. కానీ నిర్మాత బాగుండాలంటే? అప్పుడప్పుడు హీరోలకు ఇలాంటి త్యాగాలు తప్పవు. సూపర్ స్టార్ కృష్ణ ను నిర్మాతల పాలిట దేవుడుగా చెబుతారు. సినిమా ప్లాప్ అయితే తీసుకున్న పారితోషికం మొత్తం తిరిగి చెల్లించిన ఏకైక నటుడిగా కృష్ణకు పేరుంది. ఇప్పటి జనరేషన్ హీరోలు కూడా కొంత మంది అలా చేస్తుంటారు.
తాజాగా డార్లింగ్ ప్రభాస్ కూడా అలాంటి దాతృహృదయం గలవారని ఓ డిస్ట్రిబ్యూటర్ మాటల ద్వారా బయట పడింది. ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన `రాధేశ్యామ్` భారీ అంచ నాల మధ్య విడుదలైన వాటిని అందుకోవడంలో విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లింది. ఆ సినిమాకు గాను ప్రభాస్ 100 కోట్ల వరకూ పారితోషికం తీసుకున్నారుట. దీంతో 50 కోట్లు నిర్మాతలకు తిరిగి ఇచ్చేసి ఆ డబ్బును డిస్ట్రిబ్యూటర్లకు పంచేయమని చెప్పారుట.
ఈ విషయాన్ని ఓ తమిళ డిస్ట్రిబ్యూటర్ చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మరి ఇందులో నిజమెంతో ఆ సినిమా నిర్మాతలు క్లారిటీ ఇవ్వాలి. `బాహుబలి` నుంచి ప్రభాస్ సినిమాలు పాన్ ఇండియా లో రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలన్నీ వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. హిట్ అయితే లాభాలు ఏ స్థాయిలో వస్తున్నాయో? ప్లాప్ అయితే నష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి.
ఇటీవల రిలీజ్ అయిన ఓ రెండు అగ్ర హీరోల చిత్రాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా ఫలితాలు అనుకున్న విధంగా రాలేదు? అన్న టాక్ బలంగా వినిపిస్తుంది. అదే నిజమైతే నష్టాలు తప్పవు. లాంగ్ రన్ లో వాటి భవితవ్యం ఏంటి అన్నది తేలుతుంది. ఇక ప్రభాస్ నటిస్తోన్న `రాజాసాబ్`, `పౌజీ` చిత్రాలు ఆన్ సెట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే.
