Begin typing your search above and press return to search.

ప్రభాస్ ప్లాన్ మారుతుందా? మళ్లీ ఇలాంటి జోనర్‌ లో రిస్క్ చేస్తాడా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

By:  M Prashanth   |   10 Jan 2026 2:00 PM IST
ప్రభాస్ ప్లాన్ మారుతుందా? మళ్లీ ఇలాంటి జోనర్‌ లో రిస్క్ చేస్తాడా?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా.. ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్‌ సొంతం చేసుకుంది. ప్రభాస్ నటనకు ఒకవైపు ప్రశంసలు వస్తుండగా, మరోవైపు దర్శకుడు మారుతిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత మంచి ఛాన్స్ ను సరిగ్గా యూజ్ చేసుకోలేదని ఫైర్ అవుతున్నారు.

నిజానికి రాజా సాబ్ ప్రభాస్ కెరీర్‌లో ఒక ప్రయోగాత్మక చిత్రం అని చెప్పాలి. ఇప్పటివరకు యాక్షన్, మాస్, పీరియాడిక్, మైథలాజికల్ జోనర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రభాస్.. ఈసారి హారర్ ఫాంటసీ కామెడీ జోనర్‌ ను ఎంచుకున్నారు. ఇది పూర్తిగా కొత్త ప్రయత్నం కావడంతో అభిమానులతోపాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి ఏర్పడింది. ట్రైలర్లు, పాటలు సినిమాపై హైప్‌ను పెంచాయి.

అయితే విడుదల తర్వాత సినిమా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. మూవీలో ప్రభాస్ యాక్టింగ్ కు మంచి మార్కులు పడుతున్నాయి. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, టైమింగ్, కొన్ని సీన్స్ లో కామెడీ టచ్ ఆకట్టుకున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. కానీ స్టోరీ వీక్ గా ఉండడం, హారర్ అంశాలు సరైన స్థాయిలో వర్క్ అవ్వకపోవడం, కామెడీ ట్రాక్ ఆశించినంత ఎంగేజింగ్‌ గా లేకపోవడమే మైనస్ అని అంటున్నారు.

ముఖ్యంగా దర్శకుడు మారుతి.. తన స్టోరీని మరింత చక్కగా డీల్ చేయాల్సిందని విమర్శలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న ప్రభాస్ ఇకపై ఇలాంటి జోనర్‌ లో మళ్లీ నటిస్తాడా? లేక ప్లాన్‌ మార్చుకుంటాడా? అనేదే. అయితే రాజా సాబ్ రిజల్ట్ ప్రభాస్ కెరీర్‌ పై పెద్దగా ప్రభావం చూపకపోయినా, జోనర్ ఎంపిక విషయంలో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో భారీ బడ్జెట్, పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో ఎక్కువగా యాక్షన్, సైన్స్ ఫిక్షన్, ఎపిక్ కథలే ఉండటం గమనార్హం. అయితే ప్రభాస్ ప్రయోగాలకు భయపడే నటుడు అస్సలు కాదని చెప్పాలి. గతంలోనూ విభిన్న కథలను ఎంచుకుని రిస్క్ చేశారు. దీంతో రాజా సాబ్ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుని, సరైన కథ, బలమైన స్క్రిప్ట్ ఉంటే ఫ్యూచర్ లో మళ్లీ హారర్ లేదా ఫాంటసీ జోనర్‌ ను ట్రై చేసే ఛాన్స్ లేదని చెప్పలేం.

ఏదేమైనా రాజా సాబ్ మూవీ ప్రభాస్‌ కు ఒక అనుభవంగా మిగిలినా, ఆయన స్టార్ ఇమేజ్‌ పై మాత్రం ఎలాంటి ఎఫెక్ట్ పడలేదనే చెప్పాలి. మరి ఫ్యూచర్ లో ప్రభాస్ ఎలాంటి కథలను ఎంచుకుంటారో.. తన సినిమాల జోనర్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనేది వేచి చూడాలి.