Begin typing your search above and press return to search.

100 రోజులు ముందే.. ‘ఫౌజీ’ లెక్క లాక్!

ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్‌కు కౌంట్‌డౌన్ మొదలైపోయింది. డిసెంబర్ 3న సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

By:  M Prashanth   |   25 Aug 2026 10:53 PM IST
100 రోజులు ముందే.. ‘ఫౌజీ’ లెక్క లాక్!
X

ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్‌కు కౌంట్‌డౌన్ మొదలైపోయింది. డిసెంబర్ 3న సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. సరిగ్గా రిలీజ్‌కు 100 రోజుల సమయం ఉన్నప్పుడు మేకర్స్ మరో పని పూర్తి చేశారు. ఇండియాలో ప్రమోషన్స్ ఇంకా పూర్తి స్థాయిలో మొదలవ్వకముందే ఓవర్సీస్ రిలీజ్ కోసం ప్రత్యేకంగా ప్లాన్ రెడీ చేస్తున్నారు.




‘ఫౌజీ’ ఓవర్సీస్ రిలీజ్ బాధ్యతలను ఫార్స్ ఫిల్మ్ తీసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ పోస్టర్‌తో ప్రకటించారు. “ధైర్యవంతుడైన సైనికుడి కథ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నాం” అంటూ పవర్ఫుల్ లైన్ ను హైలెట్ చేశారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుందట.

ప్రభాస్ సినిమాకు ఓవర్సీస్ మార్కెట్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ‘బాహుబలి’ తర్వాత ఆయన సినిమాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ అమెరికా, గల్ఫ్, ఇతర దేశాల్లో కూడా మార్కెట్ పెరిగింది. ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ లాంటి భారీ సినిమాల తర్వాత ఇప్పుడు ‘ఫౌజీ’ మాత్రం వేరే జానర్‌తో వెళ్తోంది. బ్రిటిష్ కాలం నేపథ్యంలో ఒక సైనికుడి కథగా హను రాఘవపూడి దీన్ని తెరకెక్కిస్తున్నాడు.

‘సీతారామం’తో ప్రేమకథను పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో చూపించిన హను ఇతర భాషల్లో కూడా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అదే దర్శకుడు ప్రభాస్‌తో వార్ డ్రామా చేస్తున్నాడు. యాక్షన్ ఒక్కటే కాకుండా ప్రేమ, త్యాగం, దేశభక్తి లాంటి అంశాలు కూడా కథలో కీలకంగా ఉండనున్నాయి. ప్రభాస్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ‘ఫౌజీ’ని అన్ని భాషల్లో కనెక్ట్ అయ్యే పీరియడ్ డ్రామాగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

కాస్ట్ కూడా అందుకు తగ్గట్లుగానే ఉంది. ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరిందని, ప్రభాస్ భాగాన్ని త్వరగా పూర్తి చేసేందుకు ఒకేసారి మూడు యూనిట్లు పని చేస్తున్నాయని రిపోర్ట్స్ వస్తున్నాయి. డిసెంబర్ 3 డేట్‌ను మిస్ కాకుండా టీమ్ స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది.

ఇక పెద్ద సినిమాల ఓవర్సీస్ లెక్కలు రిలీజ్ దగ్గరికి వచ్చాక ఎక్కువగా బయటకు వస్తుంటాయి. ‘ఫౌజీ’ మాత్రం 100 రోజుల ముందే అక్కడి పార్ట్‌నర్‌ను ప్రకటించి వరల్డ్‌వైడ్ రిలీజ్‌పై ఫోకస్ పెట్టింది. ఇప్పుడు అసలు నెక్స్ట్ స్టెప్ ప్రమోషనల్ కంటెంట్. ప్రభాస్ లుక్‌తో పోస్టర్లు ఇప్పటికే ఒక టోన్ సెట్ చేశాయి. ఇక టీజర్ లేదా గ్లింప్స్‌తో హను రాఘవపూడి తయారు చేసిన ఆ ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలి.