ప్రభాస్ మేకర్స్.. అస్సలు తగ్గే ఆలోచనలోనే లేరా?
ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ సుమారు 80 శాతం పూర్తయిందని తెలుస్తోంది. ఇంకా మూడు భారీ యాక్షన్ ఎపిసోడ్లు మాత్రమే చిత్రీకరించాల్సి ఉందట.
By: M Prashanth | 1 May 2026 12:00 AM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన లైనప్ లో ఉన్న సినిమాలన్నీ హై బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలే కావడం విశేషం. ఒకవైపు షూటింగ్స్, మరోవైపు రిలీజ్ ప్లాన్లతో మేకర్స్ ఎక్కడా తగ్గకుండా ముందుకు సాగుతున్నట్లు ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. నిజానికి.. ఇప్పుడు ప్రభాస్ చేతిలో ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 వంటి క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్ సినిమాల షూటింగ్స్ శరవేగంగా కొనసాగుతున్నాయి.
ముఖ్యంగా ఆ రెండు చిత్రాల మేకర్స్ అనుకున్న షెడ్యూల్ కు కట్టుబడి పని చేస్తున్నారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రకటించిన తేదీలకు సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. దీంతో ప్రభాస్ అభిమానుల్లో ఆనందం నెలకొంది. ముందుగా ఫౌజీ విషయానికి వస్తే.. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఆ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. పీరియాడిక్ టచ్ తో రూపొందుతున్న ఆ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్ లో కనిపించనున్నారని సమాచారం.
ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ సుమారు 80 శాతం పూర్తయిందని తెలుస్తోంది. ఇంకా మూడు భారీ యాక్షన్ ఎపిసోడ్లు మాత్రమే చిత్రీకరించాల్సి ఉందట. అవి పూర్తయితే మొత్తం షూటింగ్ కంప్లీట్ అవుతుందని వినికిడి. ఆ చిత్రంలో యాక్షన్‌తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని యూనిట్ భావిస్తోంది. మిగిలిన భాగాన్ని వేగంగా పూర్తి చేసి 2026 చివర్లో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారు. దసరా సీజన్ ను కూడా టార్గెట్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక స్పిరిట్ విషయానికి వస్తే.. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్న ఆ చిత్రం కూడా భారీ అంచనాలు సొంతం చేసుకుంది. అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి సినిమాలతో సంచలనం సృష్టించిన సందీప్, ఈసారి ప్రభాస్ ను పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూపించబోతున్నాడు. దీంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే ప్రభాస్ డేట్స్ విషయంలో కొంత ఇబ్బంది ఉందనే ప్రచారం గతంలో వినిపించింది. అయినప్పటికీ దర్శకుడు వంగా పక్కా ప్లానింగ్ షూటింగ్ ను ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి సారించి, ప్రకటించిన తేదీ అయిన 2027 మార్చి 5న సినిమాను విడుదల చేయాలని నిర్ణయంతో ఉన్నారని సమాచారం. గత కొంతకాలంగా ప్రభాస్ సినిమాలు తరచూ వాయిదాలు పడుతున్నాయి. కానీ ఫౌజీ, స్పిరిట్ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ముందుగానే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసి, క్లియర్ ప్లానింగ్ తో షూటింగ్స్ నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.
ఏదేమైనా ఇప్పుడు ప్రభాస్ సినిమాల విషయంలో ఈసారి మేకర్స్ అస్సలు తగ్గేలా కనిపించడం లేదు. ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్ లకు కట్టుబడి, సమయానికి సినిమాలను రిలీజ్ చేయాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఇదే కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రభాస్ అభిమానులకు వరుస పండుగలు ఖాయం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి చూడాలి డార్లింగ్ అప్ కమింగ్ మూవీస్ ఎలాంటి విజయాలు సాధిస్తాయో..
