Begin typing your search above and press return to search.

ఆ ఇరువురి న‌డుమా న‌లిగిపోతున్న డార్లింగ్!

ప్రభాస్ తన భారీ ప్రాజెక్టుల షూటింగ్ షెడ్యూళ్లను సమన్వయం చేసుకుంటున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలోని ‘ఫౌజీ’ డిసెంబర్ 3, 2026 నుంచి మార్చి 19, 2027కు వాయిదా పడింది. సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ 2027 దీపావళికి విడుదల కానుంది. రెండు సినిమాల మధ్య క్లాష్ లేకుండా ప్రభాస్ డేట్స్ ప్లాన్ చేస్తున్నారు.

By:  Sivaji Kontham   |   28 Nov 2026 8:00 PM IST
ఆ ఇరువురి న‌డుమా న‌లిగిపోతున్న డార్లింగ్!
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఒకేసారి రెండు మూడు భారీ ప్రాజెక్టుల‌తో కుస్తీలు డార్లింగ్‌కి స‌వాల్‌గానే మారాయి. ఫౌజీ, స్పిరిట్ లాంటి భారీ చిత్రాల‌ను అత‌డు ప‌ట్టాలెక్కించ‌డంతో షెడ్యూళ్ల ప‌రంగా అటూ ఇటూ ర‌న్ చేయాల్సిన స్థితి ఉంది. అయితే ఈ సినిమాల్ని స‌జావుగా చెప్పిన తేదీకే రిలీజ్ చేయించేయ‌డం కూడా చాలా స‌వాల్ గానే మారింది.

ముందుగా `ఫౌజీ` విషయానికి వస్తే.. హను రాఘవపూడి దర్శకత్వంలో 1930-40ల నాటి పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం తొలుత 3 డిసెంబర్ 2026న విడుదల కావాల్సి ఉండగా.. ఇప్పుడు 19 మార్చి 2027కు వాయిదా పడింది. ఒకవైపు `ఫౌజీ` షూటింగ్‌లో బిజీగా ఉంటూనే మధ్యలో 15 డిసెంబర్ 2026 నుంచి కొద్దిరోజుల షెడ్యూల్ కోసం సందీప్ రెడ్డి వంగా `స్పిరిట్`సెట్స్‌కు ప్రభాస్ వెళ్లి ఆ తర్వాత మళ్లీ `ఫౌజీ` సెట్స్ కి వెళ్లాల‌నుకుంటున్నార‌ట‌. ఇది షెడ్యూల్ సమన్వయంలో వ్యూహాత్మక అడుగు. స్పిరిట్ కూడా తొలుత అనుకున్న మార్చి 2027 రిలీజ్ నుంచి 2027 దీపావళి విండోకు మారింది.

స్వాతంత్య్ర‌ సమరానికి సహకరించే భారత గూఢచారి పాత్రలో ప్రభాస్ నటిస్తున్న భారీ పీరియడ్ డ్రామా ఫౌజీకి విజువల్ క్వాలిటీ- భారీ సెట్స్- గ్రాఫిక్స్ - పోస్ట్-ప్రొడక్షన్ పనులకు తగిన సమయం కేటాయించడం కోసం రిలీజ్ విండోను సర్దుబాటు చేసినట్లు తెలుస్తోంది. `స్పిరిట్`ని దీపావళి సీజన్‌కి షిఫ్ట్ చేయ‌డం వెన‌క వ్యూహం ఉంది. ముఖ్యంగా హిందీ, తెలుగు బెల్ట్‌లలో భారీ ఓపెనింగ్స్‌కు అనువైన పండ‌గ కావడం.. అలాగే స్క్రిప్ట్, ప్రొడక్షన్ స్కేల్‌కు తగ్గట్టుగా సమయం తీసుకోవడం ఈ వాయిదాకు కార‌ణ‌మైంది.

ఇటీవల టాలీవుడ్‌లో పలు పెద్ద సినిమాల వాయిదాలు, షూటింగ్ జాప్యాలపై చర్చ జరుగుతున్నా `ఫౌజీ`ని మార్చి 19కు, `స్పిరిట్`ను 2027 దీపావళికి విండోలు సెట్ చేయడం ద్వారా రెండు భారీ చిత్రాల మధ్య క్లాష్ లేదా హడావుడి లేకుండా ప్రభాస్ తన డేట్స్‌ను మేనేజ్ చేస్తున్నారు. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా.. వేర్వేరు సీజన్లలో రెండు బిగ్ టికెట్ రిలీజ్‌లను ప్లాన్ చేయడం ప్రభాస్ మార్కెట్ వ్యూహానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రభాస్ ప్రణాళిక బావుంది.. బాక్సాఫీస్ వద్ద ఫౌజీ, స్పిరిట్ చిత్రాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో వేచి చూడాలి.