షూటింగ్ లేకపోయినా సెట్ లోనే ప్రభాస్.. ఎందుకంత ఇంట్రెస్ట్?
డార్లింగ్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'ఫౌజీ' సినిమా షూటింగ్ ప్రస్తుతం జెట్ స్పీడ్ లో జరుగుతోంది.
By: M Prashanth | 13 Aug 2026 9:22 AM ISTడార్లింగ్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'ఫౌజీ' సినిమా షూటింగ్ ప్రస్తుతం జెట్ స్పీడ్ లో జరుగుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రొడ్యూసర్ మైత్రీ రవి చెప్పిన ఒక చిన్న విషయం ఇప్పుడు ఫ్యాన్స్ లో ఇంట్రెస్టింగ్ చర్చకు దారితీసింది. సాధారణంగా హీరోలు తమ వర్క్ ఉన్న రోజే సెట్ కి రావడం చూస్తుంటాం. కానీ ప్రభాస్ మాత్రం ఈ ప్రాజెక్ట్ విషయంలో చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మైత్రీ రవి మైక్ పట్టి మాట్లాడేంత వరకు ఈ విషయం బయటకు రాలేదు. ప్రభాస్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు షూటింగ్ లో ఎంత బిజీగా ఉంటారో చెప్తూనే, ఆయన గురించి ఒక ఆసక్తికరమైన మేటర్ రివీల్ చేశారు. నిన్నటి షూట్ లో తన సీన్స్ లేకపోయినా సరే, ప్రభాస్ డైరెక్ట్ గా సెట్ కి వచ్చారని చెప్పారు. షూటింగ్ లేకున్నా రోజంతా అక్కడ ఉండి మానిటర్ దగ్గర కూర్చుని సీన్స్ ఎలా వస్తున్నాయో క్లోజ్ గా అబ్జర్వ్ చేశారట.
సాధారణంగా ఒక స్టార్ హీరో తన పోర్షన్ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే కారవాన్ కి లేదా ఇంటికి వెళ్లిపోతుంటారు. అలాంటిది కనీసం తన షాట్ కూడా లేని రోజున రోజంతా సెట్ లోనే ఉండి మేకింగ్ ప్రాసెస్ ను దగ్గరుండి చూడటం అనేది సాధారణ విషయం కాదు. కేవలం ఒక నటుడిగా తన బాధ్యత తీర్చుకోవడమే కాకుండా, సినిమా ఓవరాల్ అవుట్ పుట్ ఎలా వస్తోందో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ప్రభాస్ లో ఎంతవరకు ఉందో ఈ ఇన్సిడెంట్ చెప్తోంది.
అయితే దీని అర్థం ప్రభాస్ డైరెక్షన్ లో జోక్యం చేసుకుంటున్నారని లేదా ఇన్వాల్వ్ అవుతున్నారని అనుకోవడానికి లేదు. కథ పై, విజన్ పై ఉన్న క్లారిటీతో ప్రొడక్షన్ ప్రాసెస్ ని ఒక ఆడియన్ లా మానిటర్ దగ్గర కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. హను రాఘవపూడి టేకింగ్, విజువల్ ప్రెజెంటేషన్ పై డార్లింగ్ కి ఉన్న ఆసక్తి ఇందులో క్లియర్ గా కనిపిస్తోంది.
పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో 1940ల కాలం నాటి కథతో వస్తున్న ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద లాంటి సీనియర్ యాక్టర్లు కీ రోల్స్ చేస్తున్నారు. డిసెంబర్ 3న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర ఫౌజీ రిజల్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. కానీ తన పోర్షన్ లేకపోయినా సరే రోజంతా మానిటర్ ముందు కూర్చుని మేకింగ్ ని ఫాలో అయ్యేంతగా ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవ్వడం మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్ విషయమే. మరి విజువల్ వండర్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
