Begin typing your search above and press return to search.

ప్రభాస్ 'ఫౌజీ'.. పండగ స్లాట్ ఫిక్స్ అయిందా?

బ్రిటిష్ కాలం, స్వాతంత్య్రానికి ముందు నాటి నేపథ్యంతో రెడీ అవుతున్న ఫౌజీ మూవీ షూటింగ్ గత ఏడాది నుంచి కొనసాగుతోంది.

By:  M Prashanth   |   29 Jan 2026 5:20 PM IST
Hanu Raghavapudis Epic War Drama Fauzi Release Date
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుసగా విభిన్న కథలతో రూపొందుతున్న భారీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుండగా.. అందులో ఒకటి ఫౌజీ మూవీ. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఆ సినిమా పీరియాడిక్ వార్ డ్రామాగా రూపొందుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఆ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది.

బ్రిటిష్ కాలం, స్వాతంత్య్రానికి ముందు నాటి నేపథ్యంతో రెడీ అవుతున్న ఫౌజీ మూవీ షూటింగ్ గత ఏడాది నుంచి కొనసాగుతోంది. కథకు తగ్గట్టు భారీ సెట్స్, గ్రాండ్ యాక్షన్ సీన్స్, అద్భుత విజువల్స్ అవసరం కావడంతో అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్లతో మేకర్స్ పని చేస్తున్నట్లు సమాచారం. అందుకే సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత ప్రమాణాలతో రూపొందిస్తున్నారని తెలుస్తోంది.

ఇటీవల ఫౌజీ టైటిల్‌ తో విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన వచ్చింది. బ్రిటిష్ టైమ్ బ్యాక్ డ్రాప్, 1940ల కాలాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన పోస్టర్ ఆసక్తి పెంచింది. దర్శకుడు హను రాఘవపూడి కూడా ప్రభాస్ పాత్రను వినాశకర శక్తులకు ఎదురైన గొప్ప ప్రతిఘటనగా వర్ణించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

అయితే ఇప్పుడు ఫౌజీ మూవీ రిలీజ్ డేట్‌ పై ఇంట్రెస్టింగ్ బజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాను దసరా 2026కి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. ఓవైపు షూటింగ్.. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. క్వాలిటీ విషయంలో ఎలాంటి తొందరపాటు లేకుండా, పండుగ సీజన్‌ ను దృష్టిలో పెట్టుకుని పనులు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఇక సినిమా విషయానికొస్తే.. సీతారామం వంటి సూపర్ హిట్ తర్వాత హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఫౌజీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే మూవీలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ప్రేమ, ధైర్యం, త్యాగం వంటి భావోద్వేగాలు ప్రధానంగా నడిచే కథతో వార్ డ్రామాగా సినిమాను గ్రాండ్ గా రూపొందిస్తున్నారని టాక్.

అదే సమయంలో ఫౌజీ మూవీతో ఇమాన్వీ హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్ నటులు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, సీనియర్ హీరోయిన్ జయప్రద కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. భారీ తారాగణంతో పాటు గ్రాండ్ స్కేల్‌ లో తెరకెక్కుతున్న మూవీకి దాదాపు రూ.600-700 కోట్ల వరకు బడ్జెట్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. మరి పీరియాడిక్ వార్ డ్రామాగా తెరకెక్కుతున్న ఫౌజీ ప్రభాస్ కెరీర్‌ లో మరో ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందా? దసరా 2026కి నిజంగా థియేటర్లలోకి వస్తుందా? అన్నది వేచి చూడాలి.