Begin typing your search above and press return to search.

ఫౌజీ.. ఆ రోజు ఏం చెప్పబోతున్నారు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   19 Jan 2026 10:47 AM IST
ఫౌజీ.. ఆ రోజు ఏం చెప్పబోతున్నారు?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. లైనప్‌లో ఉన్న సినిమాల్లో ఫ్యాన్స్‌ను సామాన్య ప్రేక్షకులను అమితంగా ఆకర్షిస్తున్న వాటిలో ఫౌజీ కూడా ఉంది. సీతారామం వంటి క్లాసిక్ లవ్ స్టోరీని అందించిన హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా, అనౌన్స్‌మెంట్ నుండే ఒక పాజిటివ్ వైబ్‌ను క్రియేట్ చేసింది. పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ ఒక స్పై కనిపిస్తుండటంతో అంచనాలు మాములుగా లేవు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఏమాత్రం రాజీ పడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన కొన్ని పోస్టర్లు ఆడియన్స్‌లో క్యూరియాసిటీని పెంచేశాయి. అయితే, గత కొన్ని రోజులుగా ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్న రెబల్ ఫ్యాన్స్‌కు ఒక అదిరిపోయే లీక్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అసలు విషయానికి వస్తే, వచ్చే జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఫౌజీ టీమ్ నుండి ఒక క్రేజీ అప్‌డేట్ రాబోతోందట. దేశభక్తి నేపథ్యంలో సాగే కథ కాబట్టి, ఆ రోజున ఒక పవర్‌ఫుల్ వీడియో గ్లింప్స్ లేదా ఏదైనా మేజర్ అనౌన్స్‌మెంట్ ఉండే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. ఈ అప్‌డేట్‌లో సినిమా కథా నేపథ్యంపై మరికొంత క్లారిటీ ఇవ్వడమే కాకుండా, ప్రభాస్ పాత్రకు సంబంధించిన మరో లుక్‌ను కూడా రివీల్ చేస్తారని అందరూ భావిస్తున్నారు.

ముఖ్యంగా ఈ అప్‌డేట్‌లో అందరూ ఎదురుచూస్తున్నది రిలీజ్ డేట్ గురించే. అసలైతే ఇదే ఏడాది ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే వీకెండ్ కానుకగా విడుదల చేయాలని మేకర్స్ మొదట ప్లాన్ చేసుకున్నారు. అయితే షూటింగ్ పనులు ఎంతవరకు పూర్తయ్యాయి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎంత బ్యాలెన్స్ ఉంది అనే విషయాలపై ఇప్పటివరకు మేకర్స్ నుండి ఎలాంటి అఫీషియల్ క్లారిటీ లేదు. జనవరి 26న రాబోయే అప్‌డేట్‌తో ఈ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే, హను రాఘవపూడి దీనిని రెండు భాగాలుగా ప్లాన్ చేశారట. అందులోనూ రెండో భాగం సీక్వెల్ కాదు, అది ప్రీక్వెల్ అని తెలుస్తోంది. ఆజాద్ హింద్ ఫౌజ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి వంటి లెజెండరీ యాక్టర్స్ భాగం కావడం సినిమా రేంజ్‌ను పెంచేసింది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఈ సినిమాకు మరో మేజర్ ప్లస్ కానుంది. ఫైనల్ గా ఫౌజీ టీమ్ రిపబ్లిక్ డే రోజున ఎలాంటి బాంబు పేల్చబోతుందోనని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.