పోస్టర్‌కే ఈ రేంజ్ క్రేజ్… ‘ఫౌజీ’పై క్యూరియాసిటీ ఎందుకు ?
రెబెల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఫౌజీ' ఇటీవల విడుదలైన ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
By: Madhu Reddy | 18 July 2026 1:18 PM ISTరెబెల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఫౌజీ' ఇటీవల విడుదలైన ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ పోస్టర్ కేవలం లైకులు సాధించలేదు, ఇన్‌స్టాగ్రామ్‌లో 24 గంటల్లో ఏకంగా 5.33 లక్షల మంది దీన్ని షేర్ చేశారంటే క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా భిన్నమైన రెండు ఇమేజ్‌లు ఉన్న కాంబో కలిసినప్పుడు మార్కెట్లో ఎలాంటి క్యూరియాసిటీ పుడుతుందో చెప్పడానికి ఈ క్రేజే ఒక నిదర్శనం. ఆ విశేషాలు చూద్దాం..
భిన్నమైన ధృవాల కలయిక - అసలైన మ్యాజిక్:
ఈ సినిమాపై ఇంతటి భారీ హైప్ రావడానికి ప్రధాన కారణం దర్శకుడు, హీరోల జోనర్లే. హను రాఘవపూడి అనగానే మనకు గుండెను పిండేసే క్లాస్ లవ్ స్టోరీస్, సీతా రామం,అందాల రాక్షసి లాంటి సున్నితమైన ఎమోషనల్ డ్రామాలు గుర్తొస్తాయి. మరోవైపు ప్రభాస్ అంటేబాక్సాఫీస్‌ను షేక్ చేసే భారీ మాస్ ఇమేజ్, కటౌట్ గుర్తొస్తాయి. క్లాస్ ఎమోషన్స్ రాసే దర్శకుడు.. మాస్ రేంజ్ ఉన్న హీరోతో సినిమా చేస్తుండటంతో ఈ రెండు భిన్నమైన శైలుల కలయిక వెండితెరపై ఎలాంటి వండర్స్ సృష్టించబోతోందో అనే కుతూహలం అందరిలోనూ మొదలైంది.
జోనర్ పై పెరిగిన సస్పెన్స్:
సాధారణంగా ప్రభాస్ సినిమా అనగానే భారీ ఫైట్లు, యాక్షన్ సీక్వెన్సులు ఆశిస్తారు. కానీ హను రాఘవపూడి సినిమా కాబట్టి ఇందులో ప్రేమకథకు, దేశభక్తి ఎమోషన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ రెండు ఎలిమెంట్స్ ప్రభాస్ మాస్ ఇమేజ్‌కు తోడైతే సినిమా జోనర్ ఏ రేంజ్‌లో ఉండబోతోంది అనే సస్పెన్స్ ప్రేక్షకుల్లో క్రియేట్ అయింది. ఈ క్యూరియాసిటీనే పోస్టర్ షేరింగ్స్ రూపంలో రికార్డులు సృష్టిస్తోంది.
రికార్డుల వేటలో సోషల్ మీడియా షేర్స్:
ఒక పోస్టర్ నచ్చితే లైక్ కొట్టడం కామన్. కానీ 24 గంటల్లో 5.33 లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్‌లో దీన్ని షేర్ చేయడం అనేది ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక అరుదైన రికార్డు. కేవలం అభిమానులే కాకుండా, సామాన్య సినీ ప్రేమికులు సైతం ఈ ఆర్ట్‌వర్క్‌ను తమ స్టేటస్‌లుగా పెట్టుకుంటున్నారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఈ పీరియాడిక్ డ్రామాను నిర్మిస్తుండటం సినిమా రేంజ్‌ను మరో మెట్టు ఎక్కించింది.
కేవలం ఒకే ఒక్క పోస్టర్‌తో దేశవ్యాప్తంగా ఇంతటి క్యూరియాసిటీని రేకెత్తించడం 'ఫౌజీ' టీమ్‌కే సాధ్యమైంది. హను రాఘవపూడి క్లాస్ మేకింగ్, ప్రభాస్ గ్లోబల్ మాస్ అప్పీల్ కలిసి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త వండర్స్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విభిన్నమైన కాంబినేషన్ తెచ్చిన హైప్, డిసెంబర్ 3న థియేటర్లలో ప్రేక్షకులకు ఎలాంటి సరికొత్త అనుభూతిని ఇస్తుందో చూడాలి..
