టాలీవుడ్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ట్రెండ్!
కాలాని కి తగినట్లుగా కథాంశాలు మారుతుంటాయి. ప్రస్తుతం పాన్ ఇండియా యాక్షన్ జానర్లు ..సరికొత్త దేశభక్తి ..చారిత్రక రహస్యాల ట్రెండ్ ఊపందుకుంటోంది.
By: Srikanth Kontham | 22 July 2026 4:15 PM ISTకాలానికి తగినట్లుగా కథాంశాలు మారుతుంటాయి. ప్రస్తుతం పాన్ ఇండియా యాక్షన్ జానర్లు ..సరికొత్త దేశభక్తి ..చారిత్రక రహస్యాల ట్రెండ్ ఊపందుకుంటోంది. ముఖ్యంగా స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ .. ఆజాద్ హింద్ ఫౌజ్ (INA) చరిత్రను ఆధారంగా చేసుకుని సినిమాలు తెరకెక్కించడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ తరహా కాన్సెప్ట్‌లతో వస్తున్న సినిమాలు ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 2023లో నిఖిల్ హీరోగా విడుదలైన `స్పై` సినిమా నేరుగా సుభాష్ చంద్రబోస్ అదృశ్యం ..ఆయన మిస్సింగ్ ఫైల్స్ మిస్టరీ చుట్టూనే సాగింది.
ఆ సినిమా కమర్షియల్ స్థాయిలో ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా? ఆ చారిత్రక నేపథ్యాన్ని ఎంచుకున్న తీరుకు మాత్రం మంచి అప్లాజ్ వచ్చింది. అలాగే నందమూరి కల్యాణరామ్ నటించిన `డెవిల్` చిత్రంలో కూడా బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ కథకు ఆజాద్ హింద్ ఫౌజ్ కనెక్షన్‌ను ఎంతో ఆసక్తికరంగా ముడిపెట్టారు. ఈ రెండు సినిమాల కోర్ కాన్సెప్ట్ ప్రేక్షకులకు త్వరగా కనెక్ట్ అవుతుందని రుజువు చేశాయి. ఇదే ఫార్ములాను ఇప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్స్ భుజాన వేసుకోవడంతో భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.
క్రేజీ డైరెక్టర్ హను రాఘవపుడి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ వార్ డ్రామా `ఫౌజీ` చిత్రంలో ఈ అంశం ప్రధాన హైలైట్‌గా మారనుంది. ఈ సినిమాలో ప్రభాస్ నేరుగా ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిగా కనిపించబోతున్నారన్న టాక్ ఫిలింనగర్‌లో గట్టిగా వినిపిస్తోంది. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సైనికుడిగా పనిచేసే హీరో ఆ తర్వాత నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరడం అనే పాయింటే సినిమాకు ఆత్మగా నిలవనుందని సమాచారం.
అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అటెంటెడ్ ప్రాజెక్ట్ `ఓజీ 2` చిత్రంలోనూ ఇదే తరహా సాలిడ్ ట్విస్ట్ ఉందనే లీక్స్ టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దర్శకుడు సుజిత్ ఈ కథను 1940ల నాటి ఆజాద్ హింద్ ఫౌజ్ సీక్రెట్ ఫండ్స్ ..నేతాజీ దాచిన రహస్య నిధుల మిస్టరీకి లింక్ చేశారట. ఈ రహస్యాల చుట్టూ నడిచే పవన్ కళ్యాణ్ ప్రయాణం సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తుందని ఇన్సైడ్ టాక్. ఇటు ప్రభాస్, అటు పవన్ కళ్యాణ్ ఒకేసారీ నేతాజీ బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకోవడం ఈ ట్రెండ్‌ను తారాస్థాయికి చేర్చుతోంది.
ఈ తరహా కథాంశాలు వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా దేశం కోసం ప్రాణాలర్పించిన యోధుల త్యాగాలను వెండితెరపై ఆవిష్కరించడానికి అద్భుతమైన వేదికగా మారుతున్నాయి. స్వాతంత్య్ర పోరాటంలోని చీకటి కోణాలను, ఎవరికీ తెలియని రహస్యాలను నేటి తరానికి పరిచయం చేయడంలో దర్శకులు చూపిస్తున్న చొరవ అభినందనీయం. స్టార్ హీరోల ఇమేజ్‌కు తగినట్లుగా పల్స్ పట్టుకొని ఈ కథలను డిజైన్ చేస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉంది.
