‘ఫౌజీ’లో ఆమె పాత్ర ఏంటో తెలిసింది..!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ హనురాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఫౌజీ' సినిమాను ఈ ఏడాదిలోనే విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెల్సిందే.
By: Ramesh Palla | 1 Aug 2026 11:15 AM ISTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ హనురాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఫౌజీ' సినిమాను ఈ ఏడాదిలోనే విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెల్సిందే. ఫౌజీ సినిమాతో హీరోయిన్‌గా సోషల్ మీడియా ఇన్ఫ్యూలెన్సర్ ఇమాన్వి పరిచయం కాబోతుంది. ఇప్పటి వరకు ఆమె ప్రేక్షకులకు పరిచయం కాలేదు. అయితే ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని రీల్స్, షాట్స్‌తో మాత్రం ఆమె గురించి కొందరికి తెలిసింది. అందంగా, క్యూట్‌గా ఇమాన్వి ఉందని, ప్రభాస్‌కి భలే జోడీ అంటూ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఫౌజీ సినిమాలో నటిస్తున్న ఇతర నటీనటుల గురించి సైతం ప్రధానంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్‌లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు, వీరిద్దరితో పాటు సీనియర్ స్టార్ హీరోయిన్ జయప్రద సైతం ఈ సినిమాలో కనిపించబోతున్నారు.
ప్రభాస్ ఫౌజీ సినిమాలో జయప్రద...
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషల్లోనూ సినిమాలు చేసిన జయప్రద గత కొంత కాలంగా వెండి తెరకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారు. మంచి కథలు, మంచి పాత్రలు వస్తే నటిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ మూవీ, అది కూడా ఒక మంచి పాత్ర కావడంతో ఫౌజీ సినిమాలో నటించిందనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఫౌజీ సినిమాలోని ఆమె పాత్రకు ఉండే ఎమోషనల్ సీన్స్ గుండెలు పిండేస్తాయని ఇండస్ట్రీ వర్గాల వారు, యూనిట్ సభ్యులు మాట్లాడుకుంటున్నారు. తాజాగా యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఫౌజీ సినిమాలో జయప్రధను ప్రభాస్ యొక్క తల్లి పాత్రలో చూడబోతున్నామని చెబుతున్నారు. గతంలో కృష్ణంరాజు తో జయప్రద ఎన్నో సినిమాలు చేసింది. ఇప్పుడు ఆయన వారసుడికి తల్లిగా నటించడం ద్వారా కచ్చితంగా ఫ్యాన్స్ ఒక స్పెషల్ మూమెంట్‌గా చూస్తారు అనడంలో సందేహం లేదు.
ఫౌజీ సినిమా విడుదల తేదీ...
జయప్రద ను ఈ సినిమాలో ప్రభాస్‌కు తల్లిగా నటింపజేయడం అనేది కచ్చితంగా కలిసి వచ్చే అంశం అని మార్కెట్ వర్గాల వారు అంటున్నారు. ఆఫ్ ది రికార్డ్ ప్రకారం ప్రభాస్ కి జయప్రద కి మధ్య మంచి ఎమోషనల్, సెంటిమెంట్ సీన్స్ ఉంటాయట. జయప్రద ఇలా వచ్చి అలా వెళ్లే పాత్రలో కాకుండా కథలో భాగం అయ్యే పాత్ర, స్క్రీన్ ప్లేలో చాలా సమయం ఉండే పాత్రలో కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు. ఈ మద్య కాలంలో జయప్రదను ఇలాంటి మంచి పాత్రలో చూసి ఉండరు అనేది యూనిట్ సభ్యులు చెబుతున్న మాట. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రచారం స్పీడ్ పెంచాలని అభిమానులు కోరుతున్నారు. ఇప్పటి వరకు ఫౌజీ నుంచి సాలిడ్ వీడియో లేదా అప్‌డేట్ రాలేదు అనేది అభిమానుల ఫిర్యాదు. తాజాగా రిలీజ్ డేట్ రావడంతో ఇక పాటలు, టీజర్‌లు రావడం ఖాయం అని అభిమానులు భావిస్తున్నారు.
ప్రభాస్ అభిమానుల కోసం...
ప్రభాస్ ఈ ఏడాది రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పరిచాడు. దాంతో ఆయన ఈ ఏడాదిలోనే ఫౌజీతో వచ్చి 2026 ను హిట్ ఇయర్‌గా మార్చుకోవాలని భావిస్తున్నాడు అంటూ ప్రభాస్ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. హను రాఘవపూడి సినిమాలు మినిమం గ్యారెంటీ అన్నట్టుగా ఉంటాయి. ఆయన సీతారామం సినిమా ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందో చూశాం. అందుకే ప్రభాస్‌తో హను మూవీ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలుస్తుంది అనేది అందరి నమ్మకం. ఫౌజీ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో మరోసారి ప్రభాస్ తన పేరు వినిపించేలా చేస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ నుంచి చాలా కాలం తర్వాత రాబోతున్న ప్రేమ కథా చిత్రం ఇదే కావడంతో అందరి దృష్టి ఈ సినిమాపై ఉంది. గత కొంత కాలంగా ఫుల్ యాక్షన్ మూడ్‌లో ఉన్న సలార్ ఇప్పుడు లవర్ బాయ్‌గా ఎలా కనిపిస్తాడో చూడాలి.
