Begin typing your search above and press return to search.

ఫౌజీ : ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది

సుభాష్ చంద్రబోష్‌ పాత్ర అనగానే ఆయన సైతం ఆసక్తి కనబర్చినట్లు యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. సుబోధ్‌ ను ఒప్పించి ఈ సినిమాలో నటింపజేశారని తెలుస్తోంది.

By:  Ramesh Palla   |   24 Oct 2026 11:46 AM IST
ఫౌజీ : ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది
X

ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా 'ఫౌజీ' నుంచి వచ్చిన వీడియో సోషల్‌ మీడియాను షేక్ చేస్తోంది. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ వీడియోను జనాలు చూస్తున్నారంటే ఏ స్థాయిలో సినిమాకు బజ్‌ క్రియేట్‌ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రభాస్‌ సినిమా అంటేనే బజ్ పీక్స్‌లో ఉంటుంది. ఇప్పుడు వీడియో రిలీజ్ తర్వాత అందరి అంచనాలు ఫౌజీ పై రెట్టింపు అయ్యాయి అనడంలో సందేహం లేదు. హను రాఘవపూడి దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు ఒక ఎత్తు అయితే, ఫౌజీ సినిమా ఒక ఎత్తు అవుతుందని ప్రభాస్ ఫ్యాన్స్‌ తో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు. పాన్‌ ఇండియా మూవీకి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఈ సినిమాకు ఉన్నాయనే నమ్మకం అప్పుడే ప్రేక్షకుల్లో కలుగుతోంది. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న వారికి మరింతగా ఆసక్తి పెంచింది అనడంలో సందేహం లేదు.

ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా ఫౌజీ వీడియో....

వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమా విడుదల చేయబోతున్నట్లుగా కొత్త డేట్‌ను యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది. దాదాపు ఆరు నెలలు సమయం ఉండగానే ఫౌజీ గురించి సోషల్‌ మీడియాలో ఆకాశమే హద్దు అన్నట్లుగా మాట్లాడుకోవడంకు ప్రధాన కారణం తాజాగా విడుదల అయిన వీడియో. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఫౌజీ నుంచి వచ్చిన వీడియోలో అడల్ఫ్‌ హిట్లర్‌, నేతాజీ సుభాష్‌ చంద్రబోష్‌ను చూపించారు. వీడియోలో హిట్లర్‌ ముందు నేతాజీ మాట్లాడుతూ ఇండియన్ ఆర్మీ పవర్‌ గురించి చెప్పిన డైలాగ్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. అంతే కాకుండా ప్రభాస్ పాత్రను పరిచయం చేసిన తీరు కూడా గూస్‌బంప్స్‌ను తెప్పించాయి అంటూ అభిమానులు సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. హీరో పాత్రను ఎలివేట్‌ చేస్తూ నేతాజీ పాత్ర చేసిన వ్యక్తి చెప్పిన డైలాగ్‌ వల్లే సినిమా స్థాయి పెరిగి పోయింది.

నేతాజీ సుభాష్‌ చంద్రబోష్‌ పాత్రలో....

ఫౌజీ వీడియో విడుదల అయినప్పటి నుంచి చాలా మంది ఆ నేతాజీ పాత్రలో కనిపించింది ఎవరు, చూడ్డానికి నేతాజీ మాదిరిగానే అనిపిస్తున్నాడు అంటూ చర్చ మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో ఆ ప్రశ్న ప్రముఖంగా కనిపించింది. ఫైనల్ గా ఆ ప్రశ్నకు సమాధానం లభించింది. మొదట నిజమైన నేతాజీ నుంచి ఏఐ క్యారెక్టర్‌ క్రియేట్‌ చేసినట్లుగా ఊహించారు. కానీ చిత్ర యూనిట్‌ సభ్యులు ఏఐ కాదని క్లారిటీ ఇచ్చారు. సుభాష్ చంద్రబోష్‌ గా కనిపించింది ఒక నటుడు అని యూనిట్‌ సభ్యులు చెప్పుకొచ్చారు. నేతాజీ పాత్ర అంటే మామూలు విషయం కాదు, అందుకే దర్శకుడు హను రాఘవపూడి చాలా వెతికి, పరిశోదించి చివరకు మరాఠి దర్శకుడు సుబోధ్‌ భవేను తీసుకు వచ్చాడు. దర్శకుడిగా సుబోధ్‌ సినిమాలు చేస్తూనే యాక్టింగ్‌ కూడా చేస్తూ ఉంటాడు. సుభాష్ చంద్రబోష్‌ పాత్ర అనగానే ఆయన సైతం ఆసక్తి కనబర్చినట్లు యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. సుబోధ్‌ ను ఒప్పించి ఈ సినిమాలో నటింపజేశారని తెలుస్తోంది.

మరాఠి నటుడు సుబోధ్‌ భవేను...

సోషల్‌ మీడియాలో ప్రస్తుతం సుబోధ్‌ భవే గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆయన ఇంతకు ముందు చేసిన సినిమాలు ఏంటీ, ఇంతకు ముందు ఆయన చేసిన పాత్రలు ఏంటీ అని ఇంటర్నెట్‌లో చాలా మంది వెతికేస్తున్నారు. ఆయన ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అయినా మెల్ల మెల్లగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. నటుడిగానూ ఆయన ఆచితూచి ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తూ ఉంటాడట. మరాఠీలోనే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించే సుబోధ్‌ భవే ను దర్శకుడు హను రాఘవపూడి ఒప్పించి ఈ సినిమాలో నటింపజేశాడు. నేతాజీ పాత్రకు నటుడు సెట్‌ అయినట్లుగా హిట్లర్‌ పాత్రకు నటుడు సెట్‌ కాలేదు అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే హిట్లర్‌ పాత్రను పోషించడం, ఆయన బాడీ లాంగ్వేజ్‌ను మ్యాచ్‌ చేయడం అంత సులభమైన విషయం కాదని కొందరు అంటున్నారు. సినిమాలో వీరి పాత్రలు ఎంత మేరకు ఉంటాయి అనేది చూడాలి.