ప్రభాస్ 'ఫౌజీ' రూట్ క్లియర్.. ఇద్దరు మెగాస్టార్‌లతో క్లాష్ లేనట్టేనా?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ' సినిమా విడుదల తేదీని ఇటీవల అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 18 July 2026 4:00 AM ISTటాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ' సినిమా విడుదల తేదీని ఇటీవల అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్- టిసిరీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ భారీ చిత్రం 2026 డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రభాస్ కోసం ఈ తేదీని ఎలాంటి క్లాష్ లేకుండా ఒక పద్ధతి ప్రకారం తెలివిగా నిర్ణయించారా? అంటే.... ట్రేడ్ వర్గాల విశ్లేషణ ఇలా ఉంది. డిసెంబర్ మొదటివారంలో ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్‌కు ఇటు టాలీవుడ్ లేదా అటు బాలీవుడ్ అగ్ర హీరోల నుంచి పెద్దగా పోటీ ఉండే అవకాశం లేదని విశ్లేషిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో-ఫాంటసీ చిత్రం 'విశ్వంభర' విడుదల తేదీ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. అయితే ఈ చిత్రాన్ని డిసెంబర్ చివరి వారంలో విడుదల చేసి, క్రిస్మస్ సెలవుల నుండి సంక్రాంతి వరకు వచ్చే లాంగ్ రన్‌ను క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందువల్ల డిసెంబర్ మొదట్లో వచ్చే ప్రభాస్ సినిమాకు చిరు నుండి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పోటీ ఉండకపోవచ్చు.
మరోవైపు బాలీవుడ్ మెగాస్టార్ షారూఖ్ ఖాన్ నటిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `కింగ్` కూడా డిసెంబర్ రేసులో ఉన్నా.. డిసెంబర్ 24న అంటే మంథ్ ఎండ్ లో రిలీజ్ కానుంది. 'పఠాన్' ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో షారూఖ్‌తో పాటు.. అతడి కుమార్తె సుహానా ఖాన్ డెబ్యూ చేస్తుండటం, దీపికా పదుకోన్, అభిషేక్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై నార్త్ బెల్ట్‌లో భారీ హైప్ ఉంది. కానీ ఈ సినిమా డిసెంబర్ చివరలో వస్తుండటంతో అంతకంటే మూడు వారాల ముందే డిసెంబర్ 3న వచ్చే `ఫౌజీ` చిత్రానికి బాక్సాఫీస్ పరంగా ఎలాంటి చిక్కులు ఉండవు. ఆ సమయానికే ప్రభాస్ చిత్రం మెజారిటీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.
వీటితో పాటు డిసెంబర్ నెలలో మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు థియేటర్లలోకి రాబోతున్నాయి. అమర్ కౌశిక్ దర్శకత్వంలో అలియా భట్, అనిల్ కపూర్, కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రల్లో వస్తున్న హారర్- కామెడీ చిత్రం 'చాముండ' డిసెంబర్ 4న విడుదల కానుంది. అయితే ఆలియా సినిమా ప్రభాస్ కి పోటీనిస్తుందని ఎవరూ భావించడం లేదు. అలాగే టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న 'రౌడీ జనార్దన' కూడా డిసెంబర్ లోనే విడుదలకు సిద్ధమవుతున్నా.. ఈ సినిమా అధికారిక తేదీ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. అయితే యానిమేషన్ ఫ్రాంచైజీలో వస్తున్న మైథలాజికల్ ఎపిక్ `మహావతార్` చిత్రం డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా రానుంది. దీని మొదటి భాగం విజయం కారణంగా సీక్వెల్ కి మంచి క్రేజ్ ఉండటం వల్ల యానిమేటెడ్ కేటగిరీలో ఈ చిత్రం ఒక్కటే 'ఫౌజీ' లాంగ్ రన్‌కు స్వల్ప పోటీని ఇచ్చే అవకాశం ఉంది.
ఈ సమీకరణాలన్నింటినీ పరిశీలిస్తే... టాలీవుడ్ నుంచి ప్రభాస్ `ఫౌజీ` చిత్రానికి పెద్ద కాంపిటీషన్ ఏదీ లేనట్టేనని స్పష్టమవుతోంది. ఆల్మోస్ట్ సోలోగానే బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న ప్రభాస్ డిసెంబర్ మొదటి రెండు వారాల పాటు థియేటర్లను రూల్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. బాలీవుడ్ - టాలీవుడ్ పెద్ద సినిమాలు డిసెంబర్ మూడో వారం లేదా చివరి వారంలో ప్లాన్ చేసుకోవడం వల్ల .. `ఫౌజీ`కి కలెక్షన్ల పరంగా భారీ అడ్వాంటేజ్ లభించనుంది. హను రాఘవపూడి లాంటి క్లాసిక్ డైరెక్టర్ ప్రభాస్ క్రేజ్‌ను ఉపయోగించుకుని బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి గ్రౌండ్ పక్కాగా సిద్ధమైంది.
ఇక `ఫౌజీ` సినిమా విషయానికొస్తే.. దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రంలో ప్రభాస్‌ను సరికొత్త మేకోవర్‌లో.. ఒక పవర్‌ఫుల్ మిలిటరీ ఆఫీసర్‌గా ఆవిష్కరించబోతున్నారు. ఈ సినిమా కథాంశం బ్రిటీష్ కాలం నాటి బ్యాక్‌డ్రాప్‌లో.. మరీ ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో నాటి ఒక చారిత్రాత్మక రొమాంటిక్ యాక్షన్ డ్రామా కథతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగనుందని సమాచారం. సైన్యంలో పనిచేసే ఒక సైనికుడి దేశభక్తి, అతడి జీవితంలో చోటుచేసుకున్న భావోద్వేగాల చుట్టూ ఈ కథ రక్తి కట్టించనుంది. హను రాఘవపూడి మార్క్ పోయెటిక్ లవ్ స్టోరీకి... ప్రభాస్ రేంజ్ యాక్షన్ ఎలివేషన్లను జోడించి ఈ విజువల్ వండర్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. కంటెంట్, భావోద్వేగాల పరంగా కనెక్టవుతుందని మొదటి రోజు సమీక్షలు, మౌత్ టాక్ స్ప్రెడ్ అయితే చాలు.. బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మానియా ఎలా ఉంటుందో మరోసారి చూసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
