Begin typing your search above and press return to search.

'ప్రభాస్' ఫౌజీ.. ఆయనకు చాలా ఇంపార్టెంట్!

రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు ఫౌజీ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. సీతారామం సినిమాతో బ్లాక్‌ బస్టర్ హిట్ అందుకున్న క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు.

By:  M Prashanth   |   24 Oct 2025 7:00 AM IST
ప్రభాస్ ఫౌజీ.. ఆయనకు చాలా ఇంపార్టెంట్!
X

రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు ఫౌజీ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. సీతారామం సినిమాతో బ్లాక్‌ బస్టర్ హిట్ అందుకున్న క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ ను శరవేగంగా జరుపుతున్నారు.

అదే సమయంలో ఫౌజీ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు. సీతారామం చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన.. ఇప్పుడు మరోసారి హను రాఘవపూడితో వర్క్ చేస్తున్నారు. అయితే పదేళ్ల వయసులోనే సోలో షోలు ఇవ్వడం ప్రారంభించిన విశాల్ చంద్రశేఖర్.. 450 కి పైగా షార్ట్ ఫిల్మ్‌ లకు పనిచేశారు.

13 ఏళ్ల క్రితం హాయ్ డా మూవీకి మ్యూజిక్ అందించినప్పటికీ ఆ సినిమా రిలీజ్ కాలేదు. ఆ తర్వాత ఏడాదే కోలీవుడ్, టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి తెలుగు, తమిళ సినిమాలకు వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. అందులో కోలీవుడ్ సినిమాలకే ఎక్కువగా ఉంటాయి. తెలుగులో కొన్ని చిత్రాలకు మాత్రమే మ్యూజిక్ అందించారు.

కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, కథలో రాజకుమారి, పడి పడి లేచే మనసు, చాణక్యుడు, వరుడు కావలెను వంటి తెలుగు సినిమాలకు పని చేసిన విశాల్.. సీతారామం మూవీకి గాను విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. సినిమాకు సరిగ్గా సరిపోయే.. అదిరిపోయే మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అందరినీ మెప్పించారు.

రీసెంట్ గా టాలీవుడ్ లో బచ్చలమల్లితోపాటు సింగిల్ సినిమాలకు వర్క్ చేశారు విశాల్ చంద్రశేఖర్. ఆ రెండు చిత్రాలు మోస్తరుగా అలరించినా.. సీతారామం మూవీ ఇచ్చినంత హిట్లు ఇవ్వలేదు. కానీ ప్రభాస్ ఫౌజీ సినిమాకు వర్క్ చేసే సూపర్ ఛాన్స్ అందుకున్నారు విశాల్. దీంతో ఆ సినిమా ఆయనకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి.

ఫౌజీని హను రాఘవపూడి ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్లు తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ తోనే అందరికీ క్లారిటీ వచ్చేసింది. కచ్చితంగా బొమ్మ బ్లాక్ బస్టర్ అని అనిపిస్తోంది. దీంతో విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ క్లిక్ అయితే ఆయనకు తిరుగుండదు. టాలీవుడ్ లో వివిధ బడా సినిమాల మేకర్స్ నుంచి ఛాన్స్ లు వస్తాయి. మరి ఆయన ఎలా మెప్పిస్తారో వేచి చూడాలి.