Begin typing your search above and press return to search.

ప్రభాస్ ఫౌజీ అప్డేట్.. అసలు మ్యాటర్ ఇది..!

రెబల్ స్టార్ ప్రభాస్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా పీరియాడికల్ కథగా రాబోతుంది.

By:  Ramesh Boddu   |   12 Aug 2025 11:34 AM IST
ప్రభాస్ ఫౌజీ అప్డేట్.. అసలు మ్యాటర్ ఇది..!
X

రెబల్ స్టార్ ప్రభాస్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా పీరియాడికల్ కథగా రాబోతుంది. బిఫోర్ ఇండిపెండెన్స్ టైం స్టోరీతో ఇది తెరకెక్కుతుంది. ఐతే ఈ సినిమా షూటింగ్ అప్డేట్ గురించి ఫ్యాన్స్ అంతా ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ సినిమా అప్డేట్స్ అంటూ రోజు ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది. హను, ప్రభాస్ మూవీ ఫౌజీ (వర్కింగ్ టైటిల్) సినిమా కూడా 50 శాతం షూటింగ్ పూర్తైందన్న న్యూస్ వచ్చింది. ఐతే అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది.

ఫౌజీ సుభాస్ చంద్రబోస్..

తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ఫౌజీ ఇంకా 150 నుంచి 160 రోజుల దాకా షూటింగ్ ఉంటుందట. అంతేకాదు ఈ సినిమా సుభాస్ చంద్రబోస్ గురించి అంటూ న్యూస్ వైరల్ అయ్యింది. ఐతే ఫౌజీలో ఆయన ప్రస్తావన ఉండే ఛాన్స్ ఉంది కానీ కథ మాత్రం వేరే అని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమా స్టోరీ బ్యాక్ డ్రాప్ అంతా కూడా చాలా కొత్తగా ఉంటుందని చెబుతున్నారు.

బిఫోర్ ఇండిపెండన్స్ స్టోరీనే అయినా హను మార్క్ ఫిక్షనల్ స్టోరీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇమాన్వి నటిస్తుంది. ప్రభాస్ ఇమాన్వి కెమిస్ట్రీ కూడా సినిమాకు హైలెట్ అవుతుందని అంటున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజీ సినిమాల్లో ఒకటిగా ఫౌజీ వస్తుంది. ఈ సినిమాను హను చాలా ఫోకస్ తో చేస్తున్నారట. సినిమాకు సంబందించి ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారట.

సందీప్ తో స్పిరిట్ సినిమా..

ప్రభాస్ ఈ సినిమాతో పాటు సందీప్ తో స్పిరిట్ సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమాతో పాటు కల్కి 2, సలార్ 2 కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఆల్రెడీ ప్రభాస్ మారుతి కాంబోలో వస్తున్న రాజా సాబ్ ని ఫినిష్ చేశాడని తెలుస్తుంది. ఆ సినిమా ఈ ఇయర్ డిసెంబర్ 5న రిలీజ్ ఫిక్స్ చేశారు.

ప్రభాస్ ఫౌజీ సినిమాను నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లేదా సెకండ్ హాఫ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో ప్రభాస్ స్టామినా ఏంటో మరోసారి పాన్ ఇండియా లెవెల్ లో తెలుస్తుందని అంటున్నారు. ప్రభాస్ సినిమాలు ఒక్కొక్కటి ఒక్కో ట్రెండ్ సెట్టర్ గా ఉండబోతున్నాయి. నెక్స్ట్ రాబోతున్న సినిమాలన్నీ కూడా ఏ ఒక్క రికార్డ్ కూడా మిగిల్చకుండా చేసేలా ఉన్నాయి. ఈ ఇయర్ రాజా సాబ్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వనున్న ప్రభాస్ నెక్స్ట్ ఇయర్ ఫౌజీ ఆ తర్వాత స్పిరిట్ ఇలా లైన్ లో బ్లాక్ బస్టర్ ప్లానింగ్ తో వస్తున్నాడు.