Begin typing your search above and press return to search.

ఫౌజి అలా వద్దంటున్న రెబల్ ఫ్యాన్స్..!

రెబల్ స్టార్ ప్రభాస్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు.

By:  Ramesh Boddu   |   1 Sept 2025 10:00 PM IST
ఫౌజి అలా వద్దంటున్న రెబల్ ఫ్యాన్స్..!
X

రెబల్ స్టార్ ప్రభాస్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. బిఫోర్ ఇండిపెండెన్స్ కథతో పీరియాడికల్ మూవీగా ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. ఈ సినిమా యాక్షన్ కమ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతుందని తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ లో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది. సోషల్ మీడియా లో ఆమెను చూసిన హను ఫౌజీ ఛాన్స్ ఇచ్చాడు.

ప్రభాస్ ఈమధ్య చేస్తున్న సినిమాలన్నీ..

సినిమా ఓపెనింగ్ టైం లోనే ఇమాన్వి స్టార్ క్రేజ్ దక్కించుకుంది. ఫౌజీ సినిమా విషయంలో రెబల్ స్టార్ ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే ఫౌజీ సినిమా చూస్తుంటే భారీ కాన్వాస్ తో తెరకెక్కిస్తున్నారు. సినిమా పీరియాడికల్ కథ స్వాతంత్ర్యం ముందు అంటున్నారు. మళ్లీ ఈ సినిమా కూడా రెండు భాగాలుగా ట్విస్ట్ ఇస్తారా ఏంటని అనుకుంటున్నారు. ఐతే ఫౌజీ ఒక సినిమాగా చాలని రెండు భాగాలుగా వద్దని రెబల్ ఫ్యాన్స్ కోరుతున్నారు.

ప్రభాస్ ఈమధ్య చేస్తున్న సినిమాలన్నీ కూడా ఇలానే రెండు భాగాలు అంటూ చేస్తున్నాడు. సలార్ 1 చేశాడు సలార్ 2 చేయాల్సి ఉంది. కల్కి 2 కూడా మొదలు పెట్టాల్సి ఉంది. ఐతే రాజా సాబ్ కూడా సీక్వెల్ ఉంటుందని అంటున్నారు. అందుకే ఫౌజీ సినిమా అయినా ఒకే ప్రాజెక్ట్ గా చేస్తే చూడాలని అనుకుంటున్నారు రెబల్ ఫ్యాన్స్. పార్ట్ 2 అని ట్విస్ట్ ఇచ్చి ఆ సినిమా కోసం ఎదురుచూసే టైం వాళ్లకు లేదనేలా ఉంది.

చివర్లో పార్ట్ 2 అని షాక్ ఇచ్చినా..

ఐతే ఫౌజీ సినిమా ఇప్పటివరకైతే ఒక మూవీగానే వస్తుందని అంటున్నారు. ఐతే చివర్లో పార్ట్ 2 అని షాక్ ఇచ్చినా చేసేది ఏమి ఉండదు. మరి రెబల్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ ని ప్రభాస్ యాక్సెప్ట్ చేస్తాడా లేదా అన్నది చూడాలి.

ప్రభాస్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. దాదాపు అరడజను సినిమాల దాకా పూర్తి చేయాల్సి ఉంది. ఐతే వీటిలో రెండు సీక్వెల్ పార్ట్స్ తీయాల్సి ఉంది. వాటిలో మళ్లీ ఫౌజీ కూడా రెండు భాగాలు అంటే కచ్చితంగా మరో టెన్షన్ మొదలైనట్టే.

ప్రభాస్ తో మేకర్స్ చేసే సినిమాలు కూడా ఇలా ప్రాజెక్ట్ మధ్యలో బాగా వస్తే సడెన్ గా పార్ట్ 2 అనేస్తున్నారు. మరి ప్రభాస్ నెక్స్ట్ సినిమాల లైనప్ అయితే భారీగా ఉంది కానీ వాటి రిలీజ్ ల విషయంలోనే క్లారిటీ మిస్ అవుతుంది. లెక్కలు చాలా సినిమాలని తెలుస్తున్నా ఈ ఇయర్ ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయక ఫ్యాన్స్ ని కన్ ఫ్యూజన్ లో పడేశాడు ప్రభాస్.