ఫౌజీ రిలీజ్ డేట్ ఫిక్స్ అవుతోందా?
ఇదిలా ఉంటే, ప్రభాస్ మరో ప్రాజెక్ట్ "ఫౌజీ" షూటింగ్ ను కూడా సమాంతరంగా చేస్తున్నాడు.
By: M Prashanth | 8 Aug 2025 3:22 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల విషయంలో ఎంతో వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అలాగే కొత్తదనాన్ని ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతానికి రెండు భారీ సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్న డార్లింగ్, వరుసగా అభిమానులను సంబరాల్లో ముంచెత్తేలా చేస్తున్నాడు. ఇప్పటికే మారుతితో తెరకెక్కిస్తున్న "రాజా సాబ్" షూటింగ్ దాదాపు పూర్తి కాగా, డిసెంబర్ 5న విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
మరోవైపు, సంక్రాంతి 2026 కూడా విడుదల డేట్‌గా పరిశీలిస్తున్నారు. ఈ సినిమా లోని పాటలు మినహా మిగిలిన భాగం పూర్తయింది. ఇదిలా ఉంటే, ప్రభాస్ మరో ప్రాజెక్ట్ "ఫౌజీ" షూటింగ్ ను కూడా సమాంతరంగా చేస్తున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది.
ప్రేమకథ, యాక్షన్, భావోద్వేగాలతో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఫౌజీ షూటింగ్ సగం పూర్తయింది. రెండు నెలల్లో మిగిలిన భాగాన్ని కూడా పూర్తి చేయడానికి ప్రభాస్ పూర్తిగా డేట్స్ కేటాయించనున్నాడు..ఇపుడు ఫౌజీ చిత్రం రిలీజ్ డేట్ పై గట్టిగా చర్చ నడుస్తోంది. మేకర్స్ ప్రస్తుతం ఈ సినిమాను 2026 ఏప్రిల్ 3న విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారని సమాచారం.
గుడ్ ఫ్రైడే వీకెండ్ కావడంతో, ఆ సమయంలో పాన్ ఇండియా లెవెల్ లో మంచి వసూళ్లు రాబట్టేందుకు వీలుగా ఉంటుంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రభాస్ ఫౌజీ షూటింగ్ ను స్పీడ్ గా పూర్తిచేయాలని ఉద్దేశంతో మరిన్ని బల్క్ డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. స్పిరిట్ సినిమాకు ముందు ఫౌజీ ను కంప్లీట్ చేయాలని ప్రభాస్ నిర్ణయించుకున్నారు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వినూత్నమైన సెట్లు, గ్రాండ్ యాక్షన్ సీన్స్ తో ప్రేక్షకులకు మరో విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం ఉన్నందున, దర్శకుడు షూట్ ను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ హను కాంబినేషన్ పై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక విడుదల తేదీ అధికారికంగా రాగానే ఫౌజీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
