'ఫౌజీ' ని అంత ఈజీగా వదలరంటా...!
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా నుంచి ఎట్టకేలకు అధికారిక ప్రకటన వచ్చింది.
By: Ramesh Palla | 26 Oct 2025 11:23 AM ISTప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా నుంచి ఎట్టకేలకు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ ఏడాదిలోనే సినిమా విడుదల ఉంటుందని అనుకుంటే ఇప్పటికి సినిమా నుంచి అధికారిక ప్రకటన విడుదల చేశారు. సినిమా టైటిల్ విషయంలో ఇన్నాళ్లుగా ఉన్న సస్పెన్స్‌కు తెర దించుతూ ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా అధికారికంగా ప్రకటన చేయడంతో పాటు పోస్టర్‌ను విడుదల చేయడం ద్వారా ఫ్యాన్స్‌కి బిగ్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా పాన్ ఇండియా రేంజ్‌లో భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ విషయంలో చాలా సంతృప్తిగా ఫ్యాన్స్ ఉన్నారు. దర్శకుడు హను రాఘవపూడికి సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కృతజ్ఞతలు చెబుతూ పోస్ట్‌లు చేస్తున్నారు.
సలార్ 2 కోసం వెయిటింగ్
రాజాసాబ్ సినిమా కంటే ఎక్కువగా ఫౌజీ సినిమా కోసం ఎదురు చూస్తున్నామని కొందరు ఫ్యాన్స్ అంటూ ఉంటే, కొందరు సలార్ 2 కోసం కంటే ఫౌజీ కోసం తాము ఎక్కువగా ఎదురు చూస్తున్నామని ఫ్యాన్స్ అంటున్నారు. సీతారామంతో పాటు ఇంకా పలు సెన్సిబుల్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న హను రాఘవపూడి ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో స్టార్ దర్శకుడిగా నిలవడం ఖాయం అని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఫౌజీకి ఉన్న బజ్ నేపథ్యంలో ఒక్క సినిమాతో వదిలి పెట్టకూడదని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ నుంచి అనధికారికంగా అందుతున్న వార్తల అనుసారం వచ్చే ఏడాది రాబోతున్నది కేవలం ఫౌజీ మొదటి పార్ట్ మాత్రమే అని, కథను మరింత లోతుగా, హీరో పాత్రను మరింతగా చూపించేందుకు రెండో పార్ట్‌ను తీసుకు వస్తారని అంటున్నారు.
ప్రభాస్ ఫౌజీ 2 ఉంటుందా?
ఫౌజీ 2 గురించి అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ప్రభాస్ వంటి స్టార్ హీరో తో సినిమాను చేసినప్పుడు రెండు పార్ట్‌లుగా ఒక సినిమాను తీయడం ద్వారా డబుల్ ప్రాఫిట్ లభిస్తుంది. అందుకే ఫౌజీ సినిమాను రెండు పార్ట్‌లుగా తీసుకు వచ్చేందుకు నిర్ణయించారని తెలుస్తోంది. ప్రస్తుతానికి రెండో పార్ట్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. కానీ దర్శకుడు హను రాఘవపూడి మనసులో ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఐడియా ఉంది. దాన్ని ఇప్పటికే హీరో ప్రభాస్‌తో, నిర్మాతలు మైత్రి వారితో చర్చించాడని, వారు అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. అదే కనుక నిజం అయితే హను రాఘవపూడి నుంచి మరో ప్రభాస్ మూవీ రాబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఫౌజీ సినిమా కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫౌజీ హిట్ అయితే సీక్వెల్ కచ్చితంగా రావడం ఖాయం.
రాజాసాబ్ సినిమా షూటింగ్
ప్రస్తుతం ప్రభాస్ తన రాజాసాబ్ సినిమా చివరి దశ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాకు సంబంధించిన పాట చిత్రీకరణ ఇటీవల జరిగింది. వచ్చే ఏడాది సంక్రాంతికి రాజాసాబ్ వస్తుందని అధికారికంగా ప్రకటన వచ్చింది. అయితే సంక్రాంతికి రాజాసాబ్ రాకపోవచ్చు అనే వారు ఉన్నారు. ఇక ఫౌజీ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు హను రాఘవపూడి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదే సమయంలో సలార్ 2, కల్కి 2 సినిమాలు సైతం లైన్ లో ఉన్నాయి. ఇన్ని సినిమాలు ఉండగా ప్రభాస్ కొత్తగా కథలను వింటున్నాడని తెలుస్తోంది. మొత్తానికి ప్రభాస్, హను రాఘవపూడి కాంబో మూవీ సీక్వెల్ ఉంటుంది అనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలోనే కాకుండా ఇండస్ట్రీ వర్గాల్లోనూ వైరల్ అవుతున్నాయి.
