Begin typing your search above and press return to search.

ప్రభాస్‌ 'ఫౌజీ' ఫొటో లీక్‌.. అసలు విషయమిదేనా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సీతారామం ఫేమ్ హను రాఘవపూడి కాంబినేషన్ లో ఫౌజీ (ప్రచారంలో) మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   4 Sept 2025 11:38 AM IST
ప్రభాస్‌ ఫౌజీ ఫొటో లీక్‌.. అసలు విషయమిదేనా?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సీతారామం ఫేమ్ హను రాఘవపూడి కాంబినేషన్ లో ఫౌజీ (ప్రచారంలో) మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ సినిమాలో ప్రభాస్ కు జంటగా సోషల్‌మీడియా స్టార్‌ ఇమాన్వీ ఇస్మాయిల్ నటిస్తున్నారు. మూవీలో డార్లింగ్ సైనికుడిగా కనిపించనున్నారు.

1940 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఫౌజీ మూవీ.. మాతృభూమి ప్రజలకు న్యాయాన్ని అందించడానికి ఓ యోధుడు చేసే పోరాటంగా రానుందని తెలుస్తోంది. వాస్తవ సంఘటనలకు కొంత ఫిక్షన్‌ యాడ్ చేసి హను రాఘవపూడి విభిన్నమైన కథను సిద్ధం చేశారు. రూ. 700 కోట్ల భారీ బడ్జెట్‌ తో సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నట్లు సమాచారం.

అయితే కొన్ని రోజుల క్రితం సినిమా నుంచి ప్రభాస్ లుక్ లీక్ అంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరో వింటేజ్ లుక్ లో కనిపించడంతో నెటిజన్లు, అభిమానులు తెగ షేర్ చేశారు. అప్పుడే మేకర్స్ స్పందించారు. తమ మూవీ ఎదురుచూస్తున్నారని తెలుసని, సెట్స్‌ నుంచి ఓ ఫొటో బయటకు వచ్చిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు.

అద్భుతమైన సినిమాటిక్‌ అనుభవాన్ని ఇచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, లీక్‌ లు తమ నైతికతను దెబ్బతీస్తాయిని చెప్పారు. అనధికారికంగా ఎవరైనా ఫొటోలు షేర్‌ చేస్తే సైబర్‌ నేరంగా పరిగణిస్తామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ ఇప్పుడు సినీ వర్గాల్లో మరో విషయం తెగ వైరల్ అవుతోంది.

అది ఫౌజీ సెట్స్ నుంచి లీక్ అయిన పిక్ ఒరిజినల్ కాదని టాక్ వినిపిస్తోంది. ఓ మూవీ లవర్ క్రియేషన్ మాత్రమేనని తెలుస్తోంది. ఫౌజీ మూవీతోపాటు ప్రభాస్ రోల్ కు సరిపడే థీమ్ తో అతను ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా క్రియేట్ చేశాడని సమాచారం. రాధే శ్యామ్ మూవీ నుంచి క్లియర్ గా తీసుకుని మార్చిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫోటోగా వినికిడి.

దీంతో అది తెలియక ఫ్యాన్స్ నిజమనుకుని అప్పుడు ఆ లీక్ అయిన పిక్ ను నమ్మేశారు. సోషల్ మీడియాలో ఫుల్ గా షేర్ చేశారు. మేకర్స్ వార్నింగ్ ఇవ్వగా సైలెంట్ కూడా అయ్యారు. ఏదేమైనా ఏఐ ద్వారా చేసిన క్రియేషన్ ను ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. మొత్తానికి ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక సినిమా విషయానికొస్తే.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తుండగా.. మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. 2026లో సినిమా విడుదల అవ్వనుందని టాక్.