Begin typing your search above and press return to search.

'ఫౌజీ' ప్రభాస్.. అసలైన ఫైర్ లుక్ వచ్చేసింది.. పోస్టర్ తో ఏం చెబుతున్నారు?

ప్రభాస్ పుట్టినరోజు కానుకగా, ఈ క్రేజీ ప్రాజెక్ట్ టైటిల్, ఫస్ట్ లుక్‌ను అధికారికంగా విడుదల చేశారు.

By:  M Prashanth   |   23 Oct 2025 11:37 AM IST
ఫౌజీ ప్రభాస్.. అసలైన ఫైర్ లుక్ వచ్చేసింది.. పోస్టర్ తో ఏం చెబుతున్నారు?
X

రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు వచ్చిందంటే ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా. ఒకవైపు సోషల్ మీడియాలో బర్త్‌డే విషెస్ హోరెత్తితే, మరోవైపు డార్లింగ్ నటిస్తున్న సినిమాల నుంచి సర్‌ప్రైజ్ అప్‌డేట్లు క్యూ కడతాయి. ఈ ఏడాది కూడా ఆ ట్రెండ్ రిపీట్ అయింది. ఇప్పటికే భారీ అంచనాలతో ఉన్న లైనప్‌కు, ఇప్పుడు మరో పవర్‌ఫుల్ ప్రాజెక్ట్ నుంచి అదిరిపోయే ట్రీట్ వచ్చింది.




'సీతారామం' లాంటి క్లాసిక్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడి, ప్రభాస్‌తో ఒక సినిమా చేస్తున్నాడని తెలియగానే అందరిలోనూ ఆసక్తి మొదలైంది. నిన్న విడుదలైన ప్రీ లుక్ పోస్టర్, "ఒంటరిగా పోరాడే సైన్యం" అనే ట్యాగ్‌లైన్‌తో సినిమా థీమ్‌పై ఒక హింట్ ఇచ్చింది. ఆ పోస్టర్‌తోనే అంచనాలు పెరిగిపోగా, ఇప్పుడు అసలైన ఫస్ట్ లుక్‌తో మేకర్స్ ఫ్యాన్స్‌కు అసలైన కిక్ ఇచ్చారు.

ప్రభాస్ పుట్టినరోజు కానుకగా, ఈ క్రేజీ ప్రాజెక్ట్ టైటిల్, ఫస్ట్ లుక్‌ను అధికారికంగా విడుదల చేశారు. ఈ చిత్రానికి అందరూ ఊహించినట్లే "ఫౌజీ" అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. మంటల్లో కాలిపోతున్న బ్రిటిష్ జెండా బ్యాక్‌డ్రాప్‌లో, ప్రభాస్ ఇంటెన్స్ లుక్‌తో కనిపిస్తున్నాడు. ఆయన కళ్లల్లోని కసి, సినిమా మూడ్‌ను స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

పోస్టర్‌పై సంస్కృతం దేవనాగరి లిపిలో ఉన్న అక్షరాలు, నంబర్లు మిస్టరీని పెంచుతున్నాయి. ఈ పోస్టర్, సినిమా కథా నేపథ్యాన్ని కూడా స్పష్టం చేస్తోంది. ఇది 1940ల నాటి వలస భారతదేశంలో జరిగే కథ అని పోస్టర్ కింద క్లియర్‌గా మెన్షన్ చేశారు. బ్రిటిష్ జెండా కాలిపోవడం, ఒంటరిగా పోరాడే సైన్యం అనే ట్యాగ్‌లైన్.. ఇవన్నీ చూస్తుంటే, ప్రభాస్ ఒక తిరుగుబాటు యోధుడిగా, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒంటరి పోరాటం చేసే సైనికుడిగా కనిపించబోతున్నాడని అర్థమవుతోంది.

ఇది ఒక పీరియాడికల్ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో రానున్నట్లు తెలుస్తోంది. హను రాఘవపూడి తన మార్క్ విజువల్ బ్యూటీతో పాటు, ఈసారి ఇంటెన్స్ యాక్షన్‌ను కూడా జోడిస్తున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, టి సిరీస్ లాంటి బడా సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో, ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. ప్రభాస్‌ను మునుపెన్నడూ చూడని ఒక పవర్‌ఫుల్, ఎమోషనల్ రోల్‌లో చూడబోతున్నామనే ఫీలింగ్‌ను ఈ ఫస్ట్ లుక్ కలిగిస్తోంది. ఫైనల్ గా "ఫౌజీ" ఫస్ట్ లుక్ అంచనాలను మించిపోయింది. ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇది పర్ఫెక్ట్ బర్త్‌డే ట్రీట్. హను రాఘవపూడి విజన్, ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిసి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తాయో చూడాలి.