'పౌజీ' రిలీజ్ వచ్చే దీపావళికా?
అయితే ఏప్రిల్ కాకుండా వచ్చే దీపావళి సందర్భంగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు నిర్మాణ వర్గాల నుంచి తాజాగా తెలిసింది.
By: Srikanth Kontham | 7 Oct 2025 11:00 PM ISTప్రభాస్ కథానాయకుడిగా హనురాఘవపూడి దర్శకత్వంలో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో `పౌజీ` తెరక్కుతోన్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా సినిమా ఆన్ సెట్స్ లోనే ఉంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ప్రత్యేకంగా సన్నధమై రంగంలోకి దిగారు. ఈ సినిమాతో పాటే అసవరం మేర `రాజాసాబ్` షూటింగ్ లోనూ పాల్గొంటున్నారు. ఇలా రెండు షూటింగ్ లను బ్యాలెన్స్ చేస్తూ పూర్తి చేస్తున్నారు. అయితే `పౌజీ` పీరియాడిక్ స్టోరీ కావడంతో మరింత ఎఫెర్ట్ తో పని చేస్తున్నారు. హనురాఘవ పూడి అంతే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఎక్కడా రాజీపడకుండా షూటింగ్ చేస్తున్నారు.
మరో ఏడాది వెయిటింగ్:
అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అన్నది ఇంత వరకూ సరైన క్లారిటీ లేదు. రిలీజ్ గురించి కూడా పెద్దగా ప్రచారంలోకి రాలేదు. భారీ కాన్వాస్ పై తెరకెక్కిస్తోన్న సినిమా కావడంతో ఏడాదిన్నర నుంచి రెండేళ్లు పడు తుందనే ఓ అంచనా తప్ప క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఏప్రిల్ లో రిలీజ్ అవ్వొచ్చు అనే వార్త వినిపిస్తోంది.
అయితే ఏప్రిల్ కాకుండా వచ్చే దీపావళి సందర్భంగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు నిర్మాణ వర్గాల నుంచి తాజాగా తెలిసింది. ఇదే నిజమైతే మరో ఏడాది పాటు `పౌజీ` కోసం ఎదురు చూడక తప్పదు.
రెండు షూటింగ్ లతో బిజీ:
అప్పుడు అనుకున్నట్లే రెండేళ్లు అవుతుంది. ప్రాజెక్ట్ గత ఏడాది అక్టోబర్-నవంబర్ లోనే ప్రారంభోత్సవం జరుపు కుంది. అటుపై పెద్దగా గ్యాప్ లేకుండానే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టారు. అప్పటి నుంచి చిత్రీకరణ దశలోనే ఉంది. మధ్యలో `రాజాసాబ్` షూటింగ్ కి డేట్లు కేటాయించడంతో? అటు ఇటు బ్యాలెన్స్ చేయాల్సిన సన్నివేశం ఎదురైంది. అయితే రాజాసాబ్ షూటింగ్ క్లైమాక్స్ కి వచ్చిన నేపథ్యంలో పౌజీ పనులు వేగవంతం కానున్నాయి. రాజాసాబ్ జనవరిలో రిలీజ్ అయితే ప్రభాస్ అప్పటి నుంచి పౌజీకి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాడు.
భారీ వార్ సన్నివేశాలు:
అప్పటి నుంచి నిర్విరామంగా ఒకే సినిమాకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సినిమాకు సీజీ కూడా కీలకమైందే? సినిమాలో కొన్ని వార్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. వాటిని హైలైట్ చేయాల్సిన కోణంలో సీజీ వర్క్ ఎక్కువగా ఉంటుంది. విజువల్ ఎఫెక్స్ట్ కి అత్యంత ప్రాధాన్యత ఉన్న చిత్రం కాబట్టి నెలల సమయం వాటికి కూడా పడుతుంది. ఈ నేపథ్యంలో హను మరోవైపు ఆ పనులు కూడా తొలి నుంచే పూర్తిచేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
