Begin typing your search above and press return to search.

ప్రభాస్ 'ఫౌజీ'.. హను ప్లాన్ ఎలా ఉంది? రిపీట్ చేస్తారా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ లో ప్రస్తుతం విభిన్న జోనర్ సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. అందులో ఒకటి ఫౌజీ.

By:  M Prashanth   |   30 Jan 2026 8:30 AM IST
ప్రభాస్ ఫౌజీ.. హను ప్లాన్ ఎలా ఉంది? రిపీట్ చేస్తారా?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ లో ప్రస్తుతం విభిన్న జోనర్ సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. అందులో ఒకటి ఫౌజీ. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఆ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. 1940వ దశకంలో జరిగే కథగా.. మాతృభూమి ప్రజలకు న్యాయాన్ని అందించడానికి ఓ యోధుడు చేసే పోరాటంగా మూవీని తెరకెక్కిస్తున్నారు. వాస్తవ సంఘటనలకు కొంత ఫిక్షన్‌ జోడించి హను రాఘవపూడి కథను సిద్ధం చేశారని టాక్.

సినిమాలో ప్రభాస్‌ సైనికుడిగా కనిపించనుండగా.. ఆయన సరసన ఇమాన్వి నటిస్తున్నారు. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భాను చందర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని విశాల్ చంద్రశేఖర్ అందిస్తుండగా.. పాటలను కృష్ణకాంత్ రాస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి టీ సిరీస్ నిర్మిస్తున్న ఆ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గత ఏడాది మొదలుపెట్టారు మేకర్స్.

అయితే ఇప్పుడు దసరా కానుకగా సినిమాను విడుదల చేయనున్నారని కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంకా అధికారికంగా ప్రకటన రాకపోయినా.. మేకర్స్ ఇప్పటికే ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. అందుకు తగ్గట్లే అటు షూటింగ్ ను.. ఇటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను నిర్వహిస్తున్నారని సమాచారం. మరికొన్ని రోజుల్లో రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని వినికిడి.

అదే సమయంలో ప్రభాస్ కు ఫౌజీ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ప్రభాస్ రీసెంట్ గా ది రాజా సాబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్ డ్ రెస్పాన్స్ అందుకున్నారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా.. అనుకున్న స్థాయిలో అందరినీ ఆకట్టుకోలేకపోవడంతో అనేక విమర్శలు వచ్చాయి.. వస్తున్నాయి. దీంతో ఫౌజీతో కమ్ బ్యాక్ ఇవ్వాలని అంతా కోరుకుంటున్నారు.

అయితే ప్రభాస్ యాక్టింగ్ విషయంలో అదరగొడతారనే విషయం తెలిసిందే. అందుకే డైరెక్టర్ హనుపై మొత్తం ఆధారపడి ఉంది. నిజానికి ఎమోషన్‌, గ్రాండ్యూర్‌ కు పేరుపొందిన హను రాఘవపూడి, ఇప్పటికే పలు సినిమాలతో హిట్స్ అందుకున్నారు. ముఖ్యంగా సీతారామం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. తన మేకింగ్ అంట్ టేకింగ్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు.

అందుకే ఇప్పుడు ఫౌజీ విషయంలో కూడా అదే రిపీట్ చేస్తారని అంతా ఆశిస్తున్నారు. కేవలం సినిమా హిట్ అయ్యేలా చూడడమే కాకుండా.. ప్రభాస్ కెరీర్ లో గుర్తుండిపోయే మూవీ తీస్తారని అంచనా వేస్తున్నారు. అయితే ప్రభాస్‌ ను ఆయన ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పవర్ ఫుల్ అవతార్ లో చూపించబోతున్నారని సమాచారం. మరి ఫౌజీ చిత్రం ఎలాంటి హిట్ అవుతుందో.. హను ప్లాన్ ఎలా ఉంటుందో.. సక్సెస్ మోడ్ రిపీట్ చేస్తారో లేదో వేచి చూడాలి.